సకల ప్రాణకోటికి ఇహపర సౌఖ్యా లను కల్పించేవాడు, కరుణామయు డు, దయాసాగరుడు, పరమేశ్వరుడై న శంకరుడే. ఆ సౌఖ్యం డబ్బుతో కొనేదికాదు. ”శివోహం” అంటూ త్రికరణ శుద్ధిగా, భక్తి తో ఆరాధించినప్పుడే ఆ పరమేశ్వరుడు
”నీ వెనకే ఉన్నాను” అంటూ, రక్షిస్తుంటాడు. పర మాత్మ శివుడు నిరాకారుడు.అందుకే ”లింగ” రూపంలోమాత్రమే దర్శనమిస్తాడు. ఈ లింగ స్వరూపం ఏర్పడటానికి ప్రకృతే ఆధారం. సృష్టి ప్రారంభంలో ప్రకృతిని పంచభూతాలు చేరుకోడానికి ముందే పరమేశ్వర తత్త్వం ఆవహించింది. అందుకే పంచభూతాలకు సంబం ధించిన పంచలింగాలు ఆవిష్కరించబడ్డాయి.
అవే-
1) పృథ్వీ లింగం: ఇది మట్టితో చేసిన లిం గం. ఏకాంబరేశ్వరుడు- అమ్మ కామాక్షి తల్లి చే ప్రతిష్టించబడిన లింగం. ఇది కంచిలో ఉంది. పృథ్వి అంటే భూమి. పంచభూతాలు లో ఆధార భూతము భూమే కదా!
2) ఆకాశ లింగం: ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉంది. ఆకాశలింగ దర్శ నం రహస్యమైంది. ఇది ఆత్మజ్ఞాన సంపన్ను లు. శివ తత్త్వాన్ని ఔపోసన పట్టినటువంటి వారికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది. లేకపోతే శూన్యంగా కనపడుతుంది. అందు వల్లనే చిదంబర రహస్యం అంటారు.
3) జల లింగం: ఈ లింగం క్రింద నీరు ఎప్పుడూ ఊరుతూనే ఉంటుంది. అందువల్ల ఆ పేరు వచ్చింది. ఇది తమిళనాడులోని తిరు చురాపల్లికి దగ్గరలోని జంబుకేశ్వర క్షేత్రంలో ఉంది. స్వామి వారికి జంబుకేశ్వరుడని, అమ్మ వారికి అఖిలాండేశ్వరి అని పేర్లు. బ్రహ్మహ త్యాపాతక నివారణకై జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకు శివునికి ఆపేరువచ్చింది.
4) తేజో లింగం లేదా అగ్ని లింగం: ఇది కూడా తమిళనాడులోని అరుణాచలం (తిరు మన్నామలై)లో వుంది. పరమేశ్వరుడు అరు ణాచలేశ్వరుడుగా మనల్ని కాపాడుతూ ఉన్నా డు. గర్భగుడిలోకి వెళ్ళగానే వేడిగా గాలి తగులుతుంది.
5) వాయులింగం: ఇది శ్రీ కాళహస్తిలోని కాళహస్తీశ్వరుడే. గర్భాలయంలోకి వెళ్ళి చూస్తే వాయువుతో దీపారాధనలు ఊగిసలా డడం చూడవచ్చు. దీన్ని బట్టి మనకు-
”ఆకాశమిత్యాహు: పృథి వీతస్య పీఠికా ఆలయ:
సర్వదేవానం లయనాల్లింగ ముచ్యతే!”
అంటే ఆకాశమే లింగం. దాని పీఠమే ఈ భూమి. లింగమే సకల దేవతలకు ఆలయం. ఆ లింగంలోనే సర్వమూ జన్మించి, లయం చెం దుతున్నాయి. అందుకే ఈ జగత్తే పెద్ద శివ లిం గం” అని శివపురాణం చెపుతోంది. ఇప్పటి వరకు జరిగిన యుగాలులో కృతయుగంలో ”రత్న లింగాలు”, త్రేతాయుగంలో ”స్వర్ణ లింగాలు”, ద్వాపర యుగంలో ”రసలింగా లు”, ఈ కలియుగంలో ”పార్థివ లింగాలు” శ్రేష్టమని చెప్పబడింది.
పార్థివ లింగాలను అర్చించినచో, సుఖ భోగాలు, భాగ్యాలు, దీర్ఘాయువును, మోక్ష ప్రాప్తి సిద్ధిస్తుంది. పార్థివ లింగం అంటే పవిత్ర మైన నదుల నుండి కాని, తటాకాల నుండి కాని, సంకల్ప పూర్వకంగా, మట్టిని తెచ్చి, జాగ్రత్తగా, భక్తితో శివలింగాన్ని తయారు చేసి ఆ లింగానికి ఊర్థ్వ పిండాలు పెట్టి, మారేడు, పుష్పాలతో అలంకరించి ‘ఓం నమశ్శివాయ’ అంటూ శివస్తుతి చేయడం.
అసలు ఈ పరమేశ్వరుడు లింగం స్వరూ పములో మాత్రమే కనపడడానికి, పూజలు అందుకోవడానికి, రెండు ప్రధాన కారణాలు పురాణాల ద్వారా తెలుస్తున్నాయి. పూర్వం దేవతలు చతుర్ముఖ బ్రహ్మ వద్దకు వెళ్ళి, ”పితామహా! పరమేశ్వరుడు నిరాకారుడు కదా! లింగ స్వరూపం ఎలా ఏర్పడింది?” లింగ రూపంలోనే శివునికి ఎందుకు పూజిం చాలి? ” అని ప్రశ్నించగానే, బ్రహ్మ బదులిస్తూ ”దేవతలారా! సృష్టికర్త అయిన నన్ను, స్థితి కారుడు శ్రీహరిని రక్షించడానికి పరమేశ్వరు డు జ్యోతిర్లింగ రూపం లో ఆవిర్భవించాడు.
”ప్రధాన లింగ మఖ్యాతం, లింగీచ పరమేశ్వర:”
ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తులుగా, పరిణ మించే మూల ప్రకృతి శివుడుకు అధిష్టానంగా ఉంటుంది. ఆ అధిష్టానాన్ని లింగ రూపంలో ఆశ్రయించి ఉండేవాడు పరమేశ్వరుడు. ఒక సారి నేను మోహావేశంలో క్షీరసాగరంలో శేష శయనుడైన మహావిష్ణువు వద్దకు వెళ్ళి, గట్టిగా చేత్తో తట్టిలేపగా, శ్రీ#హరి చిరునవ్వుతో”వత్సా! స్వాగతం” అన్నాడు.
”అసలు నువ్వు ఎవ్వరవు? నేను ఈ జగత్తుకు సృష్టికర్తను. నావల్లనే నువ్వు జన్మిం చావు.” అన్నాను.
”నేను జగన్నాథుడను” అనేసరికి, మా ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి, చివరకు యుద్ధానికి సంసిద్ధులయ్యేసరికి, శివుడు పెద్ద జ్యోతిర్లింగ రూపంలో సాక్షాత్కరించి, మీలో ఒకరు నా ఆది, మరొకరు నా అంత్యం కనుగొని రండి” అని ఆజ్ఞాపించాడు. నేను హంస రూపంలో శివుని అంత్యం చూడడానికి పైకెగి రిపోయాను. శ్రీహరి వరాహ రూపంలో ఆది ని కనుగొనడానికి భూమిని త్రవ్వుతూ క్రింద లోకాలకు వెళ్ళాడు. అలా వెయ్యి సం.రాలు అయినా ఆద్యంతాలు ఇరువురము కనుగొన లేకపోయాము. మేము వెనుతిరిగి రాగానే పరమేశ్వరుడు పంచబ్రహ్మ స్వరూపంతో దర్శనమివ్వగానే మాలో ఉన్న మోహం, అహంకారం నశించి, మా కర్తవ్యం తెలిసింది. అప్పటినుండి శివుడు జ్యోతిర్లింగ రూపుడు గానే పూజలు అందుకొంటున్నాడు.
మరొక కారణం, భృగు మహర్షి శాపం వల్ల, పరమేశ్వరుడు సాకారుడుగా కాక, నిరా కారుడుగా లింగ రూపంలోనే కటాక్షిస్తున్నా డు. మనదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పన్నెండుచోట్ల ప్రసిద్ధి పొందాయి. ఈ జ్యోతి ర్లింగాలకు ఉపలింగాలు చాలా ఉన్నాయి. అంతకేశ్వర లింగం, రుద్రేశ్వర లింగం, నర్మ దానది ఒడ్డున దుగ్గనాథుడు, భూతేశ్వర లిం గం, ఇలా ఎన్నో ప్రసిద్ధి పొందినవి వున్నాయి.
మనం కాశీ క్షేత్రంలో విశ్వనాథ జ్యోతి ర్లింగ దర్శన మాత్రమే చేసుకుంటుంటాము. కాని అక్కడ ఉన్న ఉప లింగముల దర్శనం గురించి పెద్దగా పట్టించుకోము. కాశీలో దశా శ్వమేథ లింగం, సంగమేశ్వర లింగం, తిలా బాండేశ్వరుడు, విశాలాక్షి మందిరం సమీపం లో ఉన్న ధర్మేశ్వర లింగం, కేదార్ఘాట్ దగ్గ ర కేదారేశ్వర లింగం, ఇలా ఎన్నో ప్రసిద్ధి పొం దిన లింగాలు ఉన్నాయి. అందుకే
” సర్వలింగమయీ కాశీ సర్వ తీ్థంక జన్మభూ!
స్వర్గాప వర్గయో దాత్రీ దృష్ట్యా దేహన్త సేవితా!!”
అంటే కాశీ సర్వము లింగమయమై గంగానదికి తీర్థమై, మోక్షప్రద భూమి. పర మాత్మను నిత్యమూ స్మరి స్తూ ఉంటే ఆయనే మనకు అవసరమైన భోగభాగ్యా లు చూస్తాడు. అలా స్మరిం చడం మన కర్తవ్యం.
– అనంతాత్మకుల రంగారావు
7989462679