తాడ్వాయి, ప్రభన్యూస్: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ట్రస్టు బోర్డు చైర్మన్‌గా కామారం గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కోర్ణబెళ్లి శివయ్య నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మహాజాతర సందర్భంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్‌తో పాటు పద్నాలుగు మంది డైరెక్టర్లు నియమిస్తారు.ఇందులో భాగంగా 2022లో మహ జాతరకు చెర్మెన్‌గా కోర్ణబేళ్లీ శివయ్య ఎస్టీ కోయ, డైరెక్టర్లు గా లకావత్ చందూలాల్ గోవిందరావుపేట ఎస్టి లంబాడి, చిలకమర్రి రాజేందర్ మంగపేట బిసి పెరిక,వట్టం నాగరాజు గోవిందరావుపెట ఎస్‌టి కోయ, బండి వీరస్వామి ఎటు-ర్ నగరం ఎస్‌సి నేతకాని, సాని కొమ్ము ఆదిరెడ్డి ములుగు రెడ్డి, అలం శోభారాణి తాడువాయి ఎస్‌టి కోయ, నక్క సాంబయ్య యాదవ్ కొత్తగూడా బిసి యాదవ్,జేటీ వీ సత్యనారాయణ వాజేడు ఎస్‌టి కోయ,తండ రమేష్ వెంకటాపురం బిసి గౌడ, పొదెం శోభన్ ఎస్‌టి కోయ, కన్నాయిగూడెం అంకం కృష్ణ స్వామి హైదరాబాద్ బీసి వడ్డెర సిద్ధబోయిన జగ్గారావు తాడువాయి ఎస్‌టి కోయ, వద్దిరాజు రవిచంద్ర వరంగల్ బీసీ మున్నూరు కాపు, సప్పీడీ రాంనర్సయ్య ఎటునాగారం బిసి గౌడలను నియమించారు బోర్డు చైర్మన్‌తో పాటు ఈ నెల 29న దేవదాయ శాఖ మంత్రి మంత్రులు సత్యవతి రాథోడ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ ఆధ్వర్యంలో మేడారంలో ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement