ఈరోజు షిర్డీ లో సాయిబాబా వారు బంగారు నగల అలంకారం వుండడానికి కారణం ఈరోజు శరత్ పూర్ణిమ లేదా (కోజాగిరి పూర్ణిమ), అంటారు. శరదృతువులో ఆశ్వీయుజ మాసం పౌర్ణమి నాడు ఈ పండుగగా జరుపుకుంటారు. ఈ పండగని శరత్-పూర్ణిమ, కొజాగరాత్రిపూర్ణిమ, కాముడిపున్నమి అని కూడా అంటారు. ఈరోజు రాత్రి లక్షీదేవి ఆకాశమార్గంలో తిరుగుతూ ఎవరైతే ఉపవాసముండి తనని పూజిస్తారో వారికి అష్టఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. హిందువులు ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలవారు ఈపండుగ జరుపుకుంటారు. ఈ రోజు దేవాలయాలలో, చాలా ప్రాంతాలలో ఆరుబయట చంద్రుడు పాలలో కనిపించేలా పాలను మరిగించి ఇంటి లొ కూడ రాత్రి వేళ పాలల్లో చంద్రుడుని చూసి తరువాత ఆ పాలను ప్రసాదం గా స్వీకరిస్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement