మంధనాచల ధారణ హేతో, దేవాసుర పరిపాలవిభో
కూర్మాకార శరీర నమో, భక్తం తే పరిపాలయమామ్!
కృతయుగంలో దేవ, దానవులు అమృతం కోసం పాల సము ద్రాన్ని మందరగిరిని కవ్వంగా, వాసుకి పాముని త్రాడు గా చేసు కొని చిలుకడం మొదలుపెట్టారు. అప్పుడు మందరగిరి సము ద్రంలోకి జారిపోతూ సముద్ర మదనానికి ఆటంకం కలిగిం ది. ఈ ఆటంకం నుంచి తప్పించమని అనుగ్ర#హంచమని దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. అప్పుడు శ్రీవి ష్ణువు కూర్మావతరం దాల్చి సముద్రంలోకి మందరగిరి మునిగిపోకుండా రక్షించినాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం.
ప్రపంచంలోనే ఏకైక కూర్మావ తర దేవాలయం ఆంధ్ర ప్రదేశ్‌లో శ్రీకా కుళం జిల్లా గార మండలం శ్రీకూర్మం గ్రామంలో ఉంది. కళింగ రాజు ఆనంగ భీముడు కూర్మ నాథ స్వామి గుడిని నిర్మించినట్లు చరిత్ర చెబు తోంది. కర్పూరేశ్వరుడు, #హఠకేశ్వరుడు, సుందరే శ్వరుడు, కోటేశ్వరుడు, పాతాళ సిద్ధేశ్వరుడు అనే ఐదు గురు ఈశ్వరులు క్షేత్ర పాలకులు ఉన్న ఈ గుడి కళింగ రాజుల పాలనలో ఒక వెలుగు వెలిగింది. ఈ క్షేత్ర ప్రస్తా వన కూర్మ, బ్రహ్మాండ, పద్మ పురాణాలలో వుంది. శ్రీరాముడు, బల రాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించారని పురాణాల కథనం.
కూర్మావతారుడు తన భక్తుల కోరికపై స్వయంగా వెలసిన క్షేత్ర మే శ్రీకూర్మం. కృతయుగంలో శ్వేతరాజు అతని భార్యల తపస్సుకు మెచ్చి వారి కోరిక మేరకు స్వయంగా ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా స్వామి వారు వెలిశారు. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మరెక్కడా లేని విధం గా ఈ దేవాలయంలో రెం డు ధ్వజ స్తంభాలు ఉంటాయి. ఇవి శివ కేశవుల ప్రతీక అని చెబుతారు. ఈ ధ్వజ స్తంభాలు శివ కేశవుల అబేధత త్వాన్ని బోధిస్తాయి. దేవాలయంలోని మూల విరాట్టు బ్ర#హ్మ దేవు నిచే ప్రతిష్ఠించబడిదని, ప్రతిరోజు రాత్రి దేవతలు వచ్చి ఈ గుడిని నిర్మించి మరల సూర్యోదయం అయ్యేలోపు వెళ్లిపోయే వారని అందుకని ధ్వజస్తంభాలు ఒకదానికి ఒకటి పోలిక లేని విధంగా ఉందని చెబుతుంటారు. ఈ దేవాలయం వద్దనే స్వామి సుదర్శన చక్రం చేత శ్వేత పుష్కరిణి ఆవిష్క రించబడింది. ఇక్కడ ఉన్న విష్ణు పాదాల దగ్గర పిండ ప్రదానం చేస్తే గయలో పితృకర్మలు చేసిన ఫలితం లభిస్తుందని, పితరు లకు ఉత్తమ గతులు ఉంటాయ ని భక్తుల నమ్మకం.