దేవుని భక్తులు, అందులో మహర్షులు వచ్చినప్పుడు భగవంతుని ధ్యానములో ఉన్నా, తపస్సులో ఉన్నా అన్నిటినీ విడిచి ఆ భక్తులను పూజించాలి అనేది ధర్మశాస్త్రము. భగవంతుడు కూడా చాలా స్పష్టముగా ”నన్ను పూజించకున్నా ఇంకా చెప్పాలంటే నిరాదరణ చేసినా, అవమానము చేసినా నేను పట్టించుకోను. నా భక్తులకు చి న్న అవమానము జరిగినా నేను సహించను. వెంట నే శిక్షిస్తాను” అన్నాడు. అలాగే ”గుడిలో ఉన్న విగ్రహాలలో, చిత్ర పటాలలో, ఇతర దేవతామూర్తులలో నన్ను చూచి ఆరాధించే నా భక్తులలో నన్ను చూడలేక వారిని అవమానించేవారు నా భక్తులే కాదు” అన్నాడు.
సత్యలోకములో ఒకసారి బ్రహ్మ సమస్త దేవదానవ యక్ష గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధర గరుడు లను ”అందరం కలిసి పరమాత్మ నామ యజ్ఞం చేదాం రండి, దంపతులుగా రండి” అని ఆహ్వానించాడు. అంద రూ సకుటుంబంగా వచ్చారు. కోట్ల మంది వచ్చారు. అందరూ పరవశంతో నామయజ్ఞము చేస్తున్నారు. వారిలో కుబేరపుత్రు లు నలకూబర, మణిగ్రీవులు ఇంతమందిలో మమ్ములను చూచేవారెవరు, తెలిసేవారెవ్వరు అని తమ భార్యలతో కలిసి జలక్రీడలకు వెళ్ళారు. అది గమనించిన నారద మహర్షి వారికి బుద్ధి చెప్పి అను గ్రహించాలని వారిద్దరినీ గోకులంలో మద్దిచెట్లుగా పుట్టమని, పరమాత్మ కృష్ణావతారంలో మీవద్దకు వచ్చి శాపవిమోచనం చేసి అనుగ్రహిస్తాడని శపించి వెళ్ళాడు. ఇది ఆగ్రహమా, అనుగ్రహమా? అట్లే జయవిజయుల ను సనకసనందనాదులు రాక్షసులుగా పుట్టండని శపించి భక్తులను అడ్డగిస్తే, అవమానిస్తే పరమాత్మ సహంచడు అని పాఠం చెప్పారు. పరమాత్మ కూడా ‘న్యా య్యోహ దండ: కృతకిల్బిషేషు’ అని తప్పు చేసినవారికి దండ న విధించడం న్యాయమే అని తెలిపాడు. మూడు జన్మలలో విరోధముతో నిరంతరము నా నామాన్నే స్మరిస్తూ మరల నా వద్ద కు చేరుతారని అనుగ్ర హించాడు. భక్తుల కంటే శత్రువులే ఎక్కువ స్మరిస్తారని భగ వంతుడు వారికి రాక్షసరూపములో కూడా శత్రుత్వము లోనూ భక్తినే ప్రసాదించాడు. ఇదంతా పరమాత్మ ఔదార్యమే. సనక సనందనాదులు నారాయణ అవతారమే. నారదమహర్షి నారాయణ అవతారమే. ఇక అగస్త్య మహర్షి ఆయన అవతారమే. ఇలా ఇంచుమించు ఋ షులందరూ పరోక్షముగా, ప్రత్యక్షముగా భగవా నుని రూపాలే. అందుకే వారిచ్చిన శాపాలు, వరాలు కూడా భగ వానుని ఔదార్య మే అని తెలుసు కోవాలి.
శత్రుత్వంలోనూ భక్తే!
Advertisement
తాజా వార్తలు
Advertisement