పరాశక్తి అయిన జగన్మాత లోకసంరక్షణార్థం వేరువేరు సందర్భాలలో వేరువేరు నామ రూపాలతో ఆవిర్భవించింది. ఆయా దేశ కాలాలలో తనదైన ‘దివ్య ప్రణాళిక’ను నిర్వహించే నిమిత్తం ‘దుర్గ’గా, ‘రాధ’గా, ‘లక్ష్మి’గా, ‘సరస్వతి’గా ‘సావి త్రి’గా అవతరించింది. ఈ ఐదు సన్నివేశాలలో వ్యక్తమైన దేవతామూర్తులకే ‘పంచశక్తులు’.
దుర్గాదేవి
దేవీ మహిమలను శ్రద్ధాళువై అలకిస్తున్న జన మేయజయ మహారాజు వ్యాసమహర్షికి అంజలి సమర్పిస్తూ ”మహర్షీ! పరాశక్తి ప్రభావాన్ని గురించి ఎంతగా విన్నా తనివితీరడం లేదు. ఆశ్రయించిన వారికి అనంత సంపదలను అనుగ్రహించే ఆ తల్లి వాత్సల్య విశేషాలను తెలియ జేసి నన్ను తరింప చేయండి” అని ప్రార్థించాడు.
జనమేయుని మాటల కు సంతోషించిన వ్యాసమహ ర్షి ”రాజా! దేవియందు గల భక్తిశ్రద్ధలతో నీవడిగిన ఈ కో రిక సంతోషం కలిగించింది. సావధాన చిత్తుడవై ఆలకిం చు” అని దుర్గాదేవి కథను వివరించాడు.
”పూర్వం హిరణ్యాక్షుని వంశంలో దుర్గముడనే రాక్షసుడు పుట్టాడు. దేవ తలకు వేదమే బలమని గుర్తించిన అతడు, వేదా లను తుదముట్టించి దేవతలను నాశనం చేయవచ్చు నని ఆలోచించాడు. ఒక పథకం ప్రకారం వేయి సంవత్సరాలు బ్రహ్మను గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. కేవలం వాయు భక్షణతోనే జీవయాత్ర సాగిస్తూ, అతడు తపస్సును కొనసాగించాడు. అతని కఠోర తపశ్చర్యకు లోకం అల్లకల్లోలమైంది. బ్రహ్మ అతనికి ప్రత్యక్షమయ్యా డు. వేదాలను తనకు అనుగ్రహించే వలసిందిగా, దేవతలను జయించ గల శక్తిని తనకు ప్రసాదించవలసిందిగాను వరం కోరుకున్నాడు దుర్గముడు. బ్రహ్మదేవుడు ”తథా స్తు” అని మాయమయ్యాడు.
బ్రహ్మ యిచ్చిన వరప్రభావం వల్ల దుర్గముని కి వేదాలన్నీ స్వాధీనమయ్యాయి. ఆనాటి నుండి విప్రులు వేదాలను మరచిపోయారు. భూలోకంలో వేద ధర్మాచరణ క్షీణించింది. స్నానసంధ్యాదులు, జపహోమాదులు, యజ్ఞయాగాదులు అన్ని అంత రించాయి. వేదవాఙ్మయ విజ్ఞానం తమకు దూరమై పోవడంతో బ్రాహ్మణులకు యజ్ఞ నిర్వహణ అసా ధ్యమైపోయింది. యజ్ఞాలు లేకపోవడంవల్ల దేవత లు నిర్వీర్యులయ్యారు. రాక్షస గణం దేవలోకాన్ని ఆక్రమించింది. ఇంద్రుడు స్వర్గాన్ని విడిచి, కొండ ల్లో, కోనల్లో అజ్ఞాతవాసం చేస్తూ పరాశక్తిని ప్రార్థిం చసాగాడు. బ్రాహ్మణులందరూ హిమాలయాలకు వెళ్ళి భవానీమాతను ప్రార్థించి, తమ అపరాధాల ను క్షమించి, దయచూడవలసిందిగా వేడుకున్నా రు. తెలియక చేసిన తప్పులను మన్నించి, కనిక రించవలసిందిగా ప్రాధేయపడ్డారు.
వారి ప్రార్థనలు విని జగన్మాత నిలువెల్లా కన్ను లతో దివ్యకాంతులతో ప్రత్యక్షమయింది. తన బిడ్డ లైన ప్రాణికోటి కష్టాలను చూడలేక శతనేత్రాలతో తొమ్మిది రోజులపాటు ధారాపాతంగా కన్నీరు కారు స్తూ రోధించింది. ఆమె కన్నీటి ధారల చేత చెట్లన్నీ చిగురించి, పుష్పించి, ఫలించి, ఆర్తులకు మధుర ఫలాలను అందించాయి. అంతట జగన్మాత స్వ యంగా తన చేతులతో వివిధ ఫలాలను, రకరకా ల శాకాలను ఆర్తుల నోటికి అందించి, వారి ఆకలిని తీర్చింది. ఆనాటి నుండి ఆ దేవిని ‘శతాక్షి’ అని, ‘శాకంభరి’ అని పిలుస్తూ పూజించారు.
ఈ వృత్తాంతం విన్న దుర్గముడు రాక్షస సమూ హాలను వెంటబెట్టుకొని వెళ్లి దేవతలను, బ్రాహ్మణులను చుట్టుముట్టి, పరిపరి విధా లుగా వేధిస్తూ, భయ భ్రాం తులను చేయసాగాడు. దేవ తలు, బ్రాహ్మణులు ఆర్తితో శతాక్షీదేవిని ప్రార్థించారు.
వారి మొరలు ఆలకిం చి, జగన్మాత తేజోరాశి అ యిన చక్రాన్ని సృష్టించి రాక్ష సులతో యుద్ధం ప్రారం భించింది. దేవదానవ సం గ్రామంలో వారు పరస్పర మూ ప్రయోగించుకొనే శరపరంపరలతో సూర్య మండలం మూసుకుపోయింది . అగ్ని జ్వాలలు ఆకాశాన్ని అంటుకున్నాయి. రాక్షసులు మ రింత విజృంభించారు. అప్పుడు దేవి కనుబొమ్మలు ముడిచి, హుంకారం చేసింది. ఆమె దివ్య దేహంను ండి అజేయమైన శక్తులు అనేకం ఆవిర్భవించాయి.
”కాళికా తారిణీ బాలాత్రిపురా భైరవీ రమా!
బగళా చైవ మాతంగీ తథా త్రిపురసుందరీ!!”
అలా ముప్పయి రెండు శక్తులు ఆవిర్భవించి, రాక్షసులను చీల్చి చెండాడాయి. పదిరోజులు యు ద్ధం తర్వాత దానవ సైన్యం అంతా నశించింది. దుర్గ ముడు ఒక్కడే మిగిలాడు. దుర్గముడు అతి కోపంతో దేవి పైకి విజృంభించాడు. అపుడు శతాక్షీ దేవి తీక్షణ మెన చూపులను ప్రసరింపచేసి, దుర్గ మునిపై బాణ వర్షం కురింపించింది. దుర్గముని రథాశ్వాలను, సారథిని వధించింది. ఆపై మరో ఐదు బాణాలు ప్ర యోగించి దుర్గముణ్ణి సంహరించింది.
”శాకంభరీ దేవి! నమస్తే శతలోచనే!
సర్వోపనిషదుద్ఘషే! దుర్గమాసుర నాశిని!” అని దేవతలు, త్రిమూర్తులు సంస్తుతించారు.
అంతట ఆ దేవి వానితో ”మీరిప్పుడు చూస్తు న్న ఈ నా రూపం చాలా పవిత్రమైనది. ఈ రూపా న్ని చూడనందువల్లనే ఇంతకాలమూ మీరు ఇన్ని కష్టాలు పడ్డారు. దుర్గమాసురుణ్ణి చంపిన నన్ను ‘దుర్గ’ అనే పేరుతో పూజిస్తూ, మీ కష్టాలను దూరం చేసుకొని సుఖంగా ప్రశాంతంగా జీవించండి” అని అభయమిచ్చి, అంతర్థానమైంది.