అమరకుడి శరీరములో ప్రవేశించి కామకళలో నిష్ణాతుడవైనందువల్ల నీ యతి ధర్మానికి భం గం కలుగలేదా”యని ప్రశ్నించింది శారదామాత శంకరభగవత్పాదుల వారిని. శారదాదేవికి నమస్కరించి వారు ఇలా అన్నారు.
”హ శారదామాతా! నా తల్లి గర్భాన జన్మించిన మొదలు నేటి వరకు నేను ఈ పాంచభౌతిక శరీరముతో ఎట్టి పాపకర్మలు గానీ పాప కృత్యములు గానీ ప్రమాణ పూర్వకముగ చేయలేదు. ఓ మర్మజ్ఞా! నీవు సర్వధర్మాలు ఆకళింపు చేసుకున్న దానవు. నా సచ్ఛీలత నా నిర్మలత్వం నీకు తెలియనిది కాదుగదమ్మా! కనుక నా పవిత్ర జీవ నాన్ని తెలిసిన నీవే ఇక్కడ యున్నవారందరికి బహరంగ ముగ తెలియచేయవమ్మా!” అని ప్రార్థించారు శంకరా చార్యులవారు.
శంకరుల విన్నపాన్ని గౌరవించి శారదాదేవి ”హ వరిష్టా! నీవు సౌశీల్య వంతుడవు. నీవు సర్వదా పవిత్రుడవు. ఈ విద్యాభద్ర పీఠాన్ని అథిరోహంచటానికి సర్వ విథాల అర్హుడవే అంది శారదాదేవి. హ యతివర్యా! ఈ సర్వ జ్ఞ పీఠాన్ని అధిరోహంచు. ఈ నా నిర్ణయము ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికి శిరోధార్యము అగుగాక” యని శారదా మాత పలికింది.
”సుఖత: క్రయతే రామాభోగ: ,
పశ్యాత్ హంత శరీరే రోగ:,
యద్యపి లోకే మరణం శరణం,
తదపి నముంచతిపాపాచరణం”
మానవుడు తనలోని ఇంద్రియాలకు లొంగిపోయి సుఖాలను అనుభవించుకోవాలను కుంటున్నాడు. కానీ తర్వాత సుఖము తాలూకు రోగాల్లో చిక్కుకొని విపరీత ముగ బాధింపబడుచున్నాడు. ఈ విధముగ మరణానికి దగ్గరవుతున్నాడు. ఇంద్రియలోలత్వం చివరికి మరణానికి దారితీస్తున్నా ఈ మానవుడు మాత్రము పాప కృత్యాలు మానకపోవడము నిజముగ జాతికి పట్టిన దౌర్భాగ్యము.
దేహము అనగా దేవాలయమని భావించాలి. ఇంద్రియ విషయ లోలత్వమునకు గురికాకూడదు. మాన వుడు పవిత్రముగా వుండటానికి కారణమైన దైవస్మరణని సాధకులు గుర్తించాలని శంకరభగవత్పాదుల వారు జాతికి బోధ చేస్తున్నారు.
శారదాదేవికి శంకరుల విన్నపం
Advertisement
తాజా వార్తలు
Advertisement