Saturday, November 23, 2024

శాంతమూర్తి… యాదాద్రి లక్ష్మీనారసింహుడు!

దేవదేవుడు యాదాద్రి లక్ష్మీనారసింహుడు. తెలుగు ప్రజల ఇలవేల్పు. ఆయన వెలసిన పుణ్యక్షేత్రం యాదాద్రి. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి ప్రధాన ఆలయం పున:నిర్మాణం పూర్తిచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి ఆలయ పున: ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. కోట్లాదిమంది భక్తులు ఎదురుచూస్తున్న స్వామివారి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ శుభ సమయం నేటి ఉదయం 11.55 నిముషాలకు. ఈ సందర్భంగా యాదాద్రి లక్ష్మీనారసింహ అవతార విశిష్టతను ధ్యానించుకుందాం.

స్వర్ణశోభిత యాదాద్రి
యాదాద్రిలో లక్ష్మీనారసింహస్వామి వారి దర్శనం ఒక ఎత్తయితే… అక్కడ కాలు పెట్టింది మొదలు అడుగడుగునా ఆకట్టుకునే యాదాద్రి వైభవం మరో ఎత్తు. కొండపైన కొలువుదీరిన లక్ష్మీనరసింహస్వామి గర్భగుడి, మహాద్వారం, ధ్వజస్తంభం, బలిపీఠం, విమానం పైనున్న సుదర్శనచక్రం, రాజగోపురాల మీదనున్న కలశాలకు బంగారు తాపడం చేశారు. రాత్రివేళ ప్రధానాలయంలోని అష్టభుజ మండప ప్రాకారాలు బంగారు వర్ణంలో మెరిసిపోయేలా విద్యుదీకరణ చేశారు. ఆలయాన్ని బంగారు రంగులో మెరిపించే ఈ విద్యుత్‌ ధగధగలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. యాదాద్రి ఆలయ ధ్వజస్తంభం స్వర్ణమయమై కనువిందు చేస్తోంది. గర్భాలయానికి ఎదురుగా పడమటి దిశలో 34 అడుగుల ఎత్తున్న ధ్వజస్తంభం పసిడి కాంతులతో మెరిసిపోతోంది.
స్థల పురాణం
శ్రీరామచంద్రమూర్తి సోదరి శాంతాదేవి. ఆమెను మహా జ్ఞాని విబాంధకుడి కుమారుడు అయిన రుష్యశృంగ మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. వారి పుత్రుడు యాదమహర్ష. ఆయన చిన్నతనం నుంచే విష్ణు భక్తుడు. నృసింహ ఉపాసకుడు. విష్ణుమూర్తి దశావతారాల్లో నాలుగవ అవతారం అయిన నారసింహావతారంలో శ్రీహరిని దర్శించుకోవాలనేది యాదరుషి కోరిక. ఆ స్వామి సాక్షాత్కారాన్ని పొందడానికి కీకారణ్యంలో తిరుగుతూ కొండజాతివారికి చిక్కాడు. వాళ్లు యాదుడిని క్షుద్రదేవత లకు బలివ్వబోయారు. అప్పుడు ఆంజనేయస్వామి ప్రత్యక్షమై యాద రుషిని రక్షించి, కీకారణ్యలో సింహాకార గుట్టలున్నాయని, అక్కడికి వెళ్ళి సాధనచేస్తే స్వామి సాక్షాత్కరిస్తారని సూచించాడు. దాంతో యాద మహర్షి ఆంజనేయస్వామి సలహా మేరకు దీర్ఘకాలం తపస్సు చేశాడు. ఆ సమయంలో ఒక రాక్షసుడు యాదుడిని తినబోయాడు. ఆ విషయం ముని పట్టించుకోలేదు కానీ శ్రీహరి సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. అప్పుడు కళ్ళు తెరిచిన ముని ఆ సుదర్శన చక్రాన్ని ప్రార్థించి భక్తులకు ఏవిధమైన బాధలు కలగకుండా అక్కడే వుండి పొమ్మని కోరాడు. ఆ సుదర్శనము త్వరలోనే అక్కడ వెలయబోతున్న లక్ష్మీనరసింహస్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చే భక్తులను సదా కాపాడతాడనని వరమిచ్చాడు. ఆ తర్వాత యాదమహర్షి తపస్సు కొనసాగించాడు. ఆయన తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆ ఉగ్ర నరసింహ రూపాన్ని చూడలేక కళ్లు మూసు కున్నాడు. యాదరుషి కోరిక మేరకు స్వామి శాంతస్వ రూపంలో శ్రీలక్ష్మీసమేత నర సింహుడిగా ప్రత్యక్షమయ్యా డు. అనంతరం యాదరుషి స్వామిని వేరు వేరు రూపాల్లో చూడాలనుందని వరం కోరు కున్నాడు. దాంతో జ్వాలా, గండభేరుండ, యోగానంద, ఉగ్రనరసింహ, శ్రీలక్ష్మీనర సింహ స్వామిగా ప్రత్యక్షమ య్యాడు మహా విష్ణువు. తనను కటాక్షించిన గుహలోనే సామా న్య భక్తులకు దర్శనమివ్వమని వేడుకు న్నాడు యాదరుషి. కాదనలేని ఆ భక్తసులభుడు ఆ రూపాల్లో నే అక్కడ వెలిశాడు. యాద మహర్షి కోరిక మేరకు ఆంజనే యస్వామి యాదగిరిలో క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు.
లక్ష్మీనారసింహుని పంచ అవతారాలు

కండ గుహలో ఉన్న రెండు శిలలపైన యోగానంద, నరసింహుడు, శ్రీలక్ష్మీనరసింహుడు విగ్రహ రూపంలో కనిపిస్తుంటారు. ఆ రెండు శిలా ఫలకాల మధ్య సన్నని రేఖలా సర్పాకృతిలో జ్వాలానరసింహస్వామి దర్శనమిస్తాడు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి ఆలయానికి తూర్పు వైపున కొండ బిలంలో గండభేరుండ నరసింహస్వామి కొలువై ఉంటా డు. ఇక ఉగ్రనరసింహమూర్తిది అభౌతిక రూపం. కొండ చుట్టూ తేజోవల యమై ఉంటాడన్నది భక్తుల నమ్మకం. అందుకే యాదగిరి కొండనే ఉగ్రనారసింహస్వామి ఐదవ రూపంగా కొలుస్తారు. యాదరుషి పేరుతోనే యాదగిరిగుట్టగా, యాదాద్రిగా ప్రసిద్ధి చెందింది ఈ పుణ్యక్షేత్రం.

Advertisement

తాజా వార్తలు

Advertisement