Saturday, November 23, 2024

శని ప్రతిష్టించినశనైశ్చర క్షేత్రం

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్‌
ఛాయామార్తాండ సంభూతం తమ్‌ నమామి శనైశ్చరమ్‌||
అంటూ శనైశ్చరుడిని ప్రార్థిస్తే శని దేవుని వ ల్ల కలిగే సమస్త దోషాలు తొలగిపోతాయ ని శాస్త్ర వచనం. శనీశ్వరునికి దేశంలో నే ఎంతో విశిష్టమైన ప్రత్యేకమైన శనై శ్చర ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో వుంది. ఈ ఆలయంలో శని దోష నివారణా ర్థం ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు నిర్వహిస్తారు.ఎన్నో సంవత్సరాలుగా భక్తుల బాధలు తీర్చే దేవాలయంగా విరాజిల్లుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో ని మందపల్లి శ్రీ శనైశ్చర దేవాలయం. శని ప్రతిష్ఠ చేసి న ఈశ్వర లింగం ఒక్క మందపల్లిలో తప్ప మరెక్కడా లేకపోవ డం విశేషం. ఈ మందపల్లి క్షేత్ర ప్రాంతంలో 14,108 పుణ్యతీర్థా లున్నట్టు చెబుతారు. ఈ మహా పుణ్య తీర్థాల్లో అశ్వద్ధ పిప్పల, శనైశ్చరాది తీర్థ సముదాయాలు నిక్షిప్తమై ఉన్నాయి.
పురాణ కథనం ప్రకారం పూర్వకాలంలో కైటభుడు అనే రాక్షసుని కొడుకులలో అశ్వద్ధుడు, పిప్పలుడు అనే ఇద్దరు లోక కంటకులై అనేక పాపకర్మలు చేశారు. యజ్ఞ యాగాది క్రతువుల ను భగ్నం చేస్తూ బ్రా#హ్మణ బాలురను భక్షిస్తూ ఉండేవారట. వీరి బాధల నుంచి విముక్తి కోసం ఋషులు, మునులు తపస్సు చేసు కుంటున్న శనిదేవుని ఆశ్రయించి ఆ రాక్షసుల బారి నుంచి రక్షిం చమని మొరపెట్టుకున్నారట. వారి బాధలు విని, చలించిపోయి న శనిదేవుడు ఒక బ్రాహ్మణ బాలుని రూపంలో అశ్వ పిప్పల రాక్షసులను సం#హరించాడు. యావత్‌ ప్రపంచం ఎంతో సంతో షించింది. మునులు, ఋషులు శనిదేవునికి ఎన్నో వరాలు కూ డా అనుగ్ర#హంచారు. ఎంతో తృప్తి చెందిన శనిదేవుడు శనివా రం రోజున నియమ నిష్టలతో ఎవరైతే అశ్వద్ధ వృక్షానికి ప్రదక్షిణ లు చేస్తారో వారి మనో భీష్టాలు నెరవేరుతాయని, అలాగే అశ్వద్ధ, శనైశ్చర తీర్థాలలో ఎవరైతే స్నానం చేస్తారో వారి సమస్త కార్యా లు నిర్విఘ్నంగా నెర వేరుతాయని వరమిచ్చాడు.
బ్రా#హ్మణ సంతతివారగు రాక్షసులను శని సంహరించడం వల్ల బ్రహ్మహత్యా దోష నివారణార్ధం శివలింగాన్ని మందపల్లి లో ప్రతిష్ఠించడం జరిగింది. సాక్షాత్తూ శనిచేత ప్రతిష్ఠించబడిన శివలింగం కాబట్టి దీనికి శనైశ్చర లింగమని, శనికి మందుడు అనే నామాంతరం ఉండడం వల్ల మందేశ్వర లింగమని పేరు వచ్చింది. శనిదోష నివారణకు ఇక్కడి స్వామివారికి తైలాభిషే కం చేస్తే శనివల్ల కలిగే సమస్త దోషాలు నివారించబడతాయని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈ ఆలయం లో రోజూ మరీ ముఖ్యంగా, శనివారం, శనిత్ర యోదశి నాడు తైలాభిషేకాలు విశేషంగా జరుగు తాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక, ఇతర ప్రాం తాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అభిషే కాలు జరిపించుకుంటారు.
దేవాలయంలో భక్తులు స్వయంగా పోసిన నువ్వుల నూనె నేరుగా శివలింగం మీదకు జాలువారి పానవట్టం లోకి రావడం ఇక్కడి ప్రత్యేకత. శని త్రయోదశినాడు తప్ప దేవాలయం ప్రతి రోజూ ఉ. 5 గం.ల నుంచి మధ్యా హ్నం 12 గం.ల వరకు, తిరిగి సాయంత్రం 4 గం.ల నుంచి 8 గం.ల వరకు తెరచి ఉంటుంది. స్వామివారికి అభిషేకాలు ఉదయం 5 గం.ల నుంచి 12 గం.ల వర కు మాత్రమే జరుగుతాయి.
ఈ ఆలయంలో పార్వతీ అమ్మవారి ఉపాల యం ఉంది. ఇక్కడ శుక్రవారాల్లో, దేవీ నవరాత్రుల సమ యాల్లో విశేష పూజలు జరుగుతాయి. అలాగే బ్రహ్మ దేవుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని ఇక్కడ దర్శించ వచ్చు. దీనికి బ్రహ్మశ్వర లింగమని పేరు. అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శ్రీ వేణుగోపాల స్వామివారిని ఇక్కడ దర్శించుకోవచ్చు.
కూలివాడు కుబేరుడు కావడానికి, కుబేరు డు- కూలివాడు కావడానికి కారణం శని ప్రభావం అంటుంటారు మన పెద్దలు. నలదమయంతులు అడవి పాలైనా, పరమశివుడు కైలాసం విడిచి చె ట్టు తొర్రలో దాక్కున్నా బలీయమైనశని మ#హ మే కారణమని పురాణాల కథనం. శనివల్ల కలిగే సమస్త దోషాల నివారణకి నాటి నుంచి నేటి వర కు శనీశ్వరుడికి తప్పకుండా పూజలు చేస్తూనే ఉన్నారు. రాజమండ్రి రైల్వేస్టేషన్‌ నుంచి 38 కి.మీ., రావులపాలెం బస్‌స్టేషన్‌ నుంచి కొత్తపేట మీదుగా అమలాపురం వెళ్లే బస్సు రూట్లో రావులపాలేనికి 6 కి.మీ. దూరంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement