Tuesday, November 26, 2024

శక్తి – భక్తి – ముక్తి – ‘శ్రీ’ ద్వారానే సమాశ్రయణం (ఆడియోతో..)

భాషాపరంగా శ్రీ శబ్దానికి ఆరు విధాలైన అర్థాలున్నాయి. 1. ఆశ్రయించేది, 2. ఆశ్రయింపబడేది అన్నవి వాటిలోని రెండు అర్థాలు. సర్వేశ్వరుని అన్ని వేళలా విడువక చేరి ఉండేది కనుక శ్రీ అనబడుతుంది. జీవుల చేత ఆశ్రయించబడుతుంది కనుక కూడా శ్రీ గా కూడా వ్యవహృతమౌతుంది. 3. వినున ది, 4.వినిపించునది అని మరి రెండ ర్థాలను శ్రీ శబ్దం కలిగి ఉంది. జీవుల మొరలను తాను విని, శ్రీమన్నారాయణునికి వినిపిస్తుంది కనుక ఆమెను శ్రీగా పేర్కొంటారు. 5. పరిపక్వము చేయునది, 6. హింసింప చేయునది అన్న అర్థాలు కూడా ఉన్నాయి. ఆత్మలను భగవత్సమాశ్రయణయోగ్యమైన పరిపాకము కలవిగా చేసేది శ్రీ. పరమాత్మ చేత జీవుల పాపములను హింసింపజేసేది అంటే నశింపజేసేది కనుక శ్రీ. భగవత్సమాశ్రయణానికి శ్రీ ప్రధాన సాధనం. సర్వేశ్వరుని ఆశ్రయించినపుడు శ్రీ ద్వారా సమాశ్రయణం చేయాలి. శ్రీని ఆశ్రయించేందుకు మధ్యవర్తుల అవసరమేది ఉండదు. ఆమె నిర్హేతుక కృపయే మనకు శర ణము. అమ్మ దయ కావాలంటే అమ్మనే ప్రార్థించాలి.

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement