సుందర కాండలో హనుమంతుడు లంకలో సీతను వెదకి వెదకి లభించక ఖిన్నుడై అశోకవనానికి వెళ్లి వెదకాలని నిశ్చయించుకొని అశోకవనంలో ప్రవేశిం చే ముందు ‘నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై’ అని ప్రార్థిస్తాడు. లక్ష్మణునితో కూడా ఉన్న రామునికి నమస్కారము. దేవియైన జనకాత్మజకు నమస్కారము. అని సీతమ్మకు నమస్కరిస్తాడు. ‘అమ్మా! ఆనాడు జనకుడు సంతానకం కొరకు యజ్ఞం చేయ సంకల్పించి భూమిని దున్నుతుండగా నీకు నీవుగానే సాక్షాత్కరించినట్లు నేడు నాకు కూడా నీవే ప్రత్యక్షం కావాలి. నీ సాక్షాత్కారాన్ని నా ప్రయత్నంతో పొందగలనా? నీవే దయ చూపమని ఆమె దర్శనానికి ఆమెనే ప్రార్థించాడు. ఇక స్వామి అనుగ్రహం కావాలంటే అది అమ్మ ద్వారానే సాధ్యపడుతుంది.
…శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి