Friday, November 22, 2024

శక్తి – భక్తి – ముక్తి – స్వామి శరణుకు తోడ్పడే ‘అమ్మ’ కరుణ(ఆడియోతో..)

పరాశర భట్టరువారు ‘శ్రీగుణరత్న కోశము’లో ఒక చక్కని శ్లోకం చెప్పారు.

‘పితేవ త్వత్ప్రేయాన్‌ జనని పరిపూర్ణాగసి జనే
హితస్రోతో వ్యత్త్యా భవతి చ కదాచిత్‌ కలుషధీ:
కిమేతత్‌ నిర్దోష: క ఇహ జగతీతి త్వముచితై:
ఉపాయైర్విస్మార్య స్వజనయసి మాతా తదసి న:’

ఇది అమ్మ స్వరూపాన్ని పురుషకార ప్రధానంగా తెలిపే శ్లోకం. జీవుడు ఎన్నో జన్మలను పొందుతుంటాడు. ప్రతి జన్మలోనూ లెక్కలేనన్ని పాపములు చేస్తూ ఉంటాడు. ఇలా పాపాలు చేస్తున్నవాడు పరమాత్మ కటాక్షం పడినట్లయితే సజ్జనుల సహవాసం, ఆత్మగుణసంపత్తి, ఆచార్యులను పొంది ‘అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ అని స్వామిని శరణు వేడతాడు. లేదా శరణు వేడేందుకు స్వామి చెంతకు చేరతాడు. అపుడు స్వామికి ఈ జీవుడు చేసిన అపరాధములు అగుపడి ఆగ్రహం కలుగుతుంది. అది కూడా జీవుని శ్రేయస్సును కోరి అతడి పాపములను నశింపజేసేందుకే అయినప్పటికీ ఆ ఆగ్రహాన్ని మనం తట్టుకోజాలము. శ్రీదేవి కూడా సహించజాలదు. పరమాత్మ కోపాన్ని, జీవులకు కలుగు జేయవలసిన శిక్షను తప్పించేందుకు పూనుకుంటుంది. జీవుని పక్షాన వాదించి స్వామిని ఒప్పించి మెప్పించి ఆగ్రహాన్ని అనుగ్రహంగా మారుస్తుంది. తప్పులు చేసిన జీవుడు తాను తప్పు చేశానని ఒప్పుకుని క్షమించమని వేడుకుంటే మన్నించాలని కోరుతుంది.

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement