Friday, November 22, 2024

శక్తి – భక్త్తి -ముక్తి : శక్తులు….అచింత్యములు (ఆడియోతో..)

‘శక్తయ: సర్వభావానాం అచిన్త్య జ్ఞాన గోచరా:
యతోతో బ్ర హ్మణస్తాస్తు సర్గాద్యా భావశక్తయ:
భవన్తి, తపతాం శ్రేష్ట పావకస్య యథోష్ణతా’

ఆయా పదార్థములలో ఉండే శక్తులు అచింత్యములు. అంటే మన ఊహకు అందనివని అర్థం. అగ్నికి కాల్చే శక్తి ఎందుకుండాలి? నీటికే చల్లబరిచే శక్తి ఎందుకు కలగాలి? ఇది మన ఆలోచనకు అందని విషయం. ‘పరాస్య శక్తి ర్వివిదైవ శ్రూయతే….’ ఈ పరమాత్మ శక్తి పలు విధాలుగా ఉంటుందని చెప్పబడుతోంది.

‘ఏకదేశస్థితస్యాగ్నే:జ్యోత్స్నా విస్తారిణీ యథా
పరస్య బ్రహ్మణోశక్తి: తథేదమఖిలం జగత్‌’

ఒక ప్రదేశంలో ఉన్న అగ్ని ప్రకాశం-వెలుగు చాలా దూరం- చాలా ప్రాంతం ప్రసరిస్తున్నట్లే పరమాత్మ శక్తి సకల ప్రపంపంలో వ్యాపించి ఉంటుందని ఈ శ్లోక భావం. ఇలా పరమాత్మకు ఉండే అనంత శక్తులలో అహంతాశక్తి ఒకటి. ఇదే మహాలక్ష్మిగా వ్యవహరించబడుతోంది.

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement