Sunday, November 17, 2024

షడ్గుణ రాజులే… ఆశ్రయించ అర్హులు!

భర్తృహరి తన నీతి శతకంలో రాజుల లక్షణాలను మనోజ్ఞంగా రచించి జనులకు సందేశం అందిం చినాడు. ఒక పద్యంలో మానవులు గుణవంతుడైన రాజునే ఆశ్రయించా లన్నాడు. గుణహీనుడైన ప్రభువుల నాశ్రయించి ప్రయోజనం లేదన్నాడు. రాజుల కర్తవ్యాన్ని తెలుపుతూ యిలా చెప్పారు.
తే||గీ|| ఆజ్ఞయును- కీర్తియును-
భూసురావనంబు
దానమును- భోగ- మిత్ర సంత్రాణనములు
షడ్గుణంబులు గలుగనే జనులయందు
వారిగొల్చిన ఫలమేమి- వసుమతీశ||
అంటూ రాజులకు ఆరు గుణములుం డాలన్నారు. అవి వరుసగా శాసించడం- సత్కీర్తి- బ్రాహ్మణ పరిరక్షణం- సత్పాత్ర దా నం- సుఖానుభ వం- ఆపన్నులైన మిత్రులను రక్షించడం అనే ఆరు గుణ ములు. ఇవి లేని రాజులను సేవించినం దువల్ల ప్రయోజనం లేదన్నాడు.
ఆజ్ఞ అంటే లోక స్థితిని రక్షించే శాసనం. మొద టిది ప్రజలు నియమబద్ధులు కాకుంటే అరాచకం ప్రబలుతుంది. రాజు ఆ సమయంలో శాసనం ద్వా రా ప్రజలను కట్టుబాటు చేయాలి. దుష్టులను శిక్షించాలి.
రెండవ గుణం కీర్తి. రాజు సత్పాత్రులకు దాన ధర్మాలు చేయాలి. యుద్ధంలో శత్రువులపై పరా క్రమం చూపినప్పుడు కీర్తి వస్తుంది.
మూడవ గుణం బ్రాహ్మణులను రక్షించడం. అజ్ఞానమును పోగొట్టి జ్ఞానమును సమాజానికి అం దించేవారు బ్రాహ్మణులు. రాజులు వారిని రక్షించి, ప్రజలలోని అజ్ఞానమును దూరం చేయాలి. అనగా జ్ఞానవంతులను చేయాలని భావం.
నాల్గవది దానం. సమాజంలో ఎంతో మంది నిరుపేదలు- దరిద్రులు ఉంటారు. వారికి రాజులు కూడు- గూడు- గుడ్డ మున్నగునవి దానం చేయాలి. వారిని పోషించాల్సిన బాధ్యత కూడా రాజులదే.
ఐదవది భోగం. అనగా సుఖానుభవములను పొందే ఏర్పాట్లు చేయాలి.
ఆరో గుణం మిత్ర సంరక్షణం. అంటే ఆపద లో ఉన్న ప్రాణమిత్రులను సంరక్షించడం, వారిని ఆదుకోవడం.
ఈ షడ్గుణాలున్న రాజులనే జనులు ఆశ్రయిం చాలి. అపుడే ప్రయోజనం సిద్ధిస్తుంది. ధనం మీద అత్యాశ ఉండరాదు. ధనం రావడం- రాకపోవడం దైవాధీనాలు గదా!
ఈ షడ్గుణాలను సంస్కృత శ్లోకంలో వివ రించారు.
శ్లో|| ఆజ్ఞా కీర్తి: పాలనం బ్రాహ్మణానాం
దానం భోగో మిత్ర సంరక్షణంచ
యేషామేతే- షడ్గుణాన ప్రవృత్తా:
కోర్థ స్తే షాం పార్థివో పాశ్రయేణ?

అని తెలిపారు. అలాగే రాజులనుసరించవ లసిన నీతి బహు విధాలుగా ఉంటుంది. రాజులకు సత్య- ధర్మాలే శాశ్వతములు. రాజాశ్రయంలోని ప్రజలు నిరంతరం సుఖశాంతులతో, సౌఖ్యాలతో, ఆనందంగా అవసర వేళల్లో రాజుకు తమ సేవలను అందించి తృప్తి చెందాలి. ”యథా రాజా – తథా ప్రజా” అని ఆర్యోక్తి. రాజ్యంలోని రాజులు ప్రజలు పరస్పరం ఐకమత్యంగా ఉండాలి. అప్పుడే రాజు కు సంతృప్తి- కరుణ- దయ కలిగి ప్రజలను తన కన్నబిడ్డ వలె పోషించుకోవలసిన ధర్మం వుంది. రాజ్యం సుభిక్షంగా వుంటే దైవం కూడా సత్ఫలితా లనందిస్తాడు. రామరాజ్యంగా పేరొంది సంతోషం తో ధన్యజీవులవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement