Tuesday, November 26, 2024

ఏడేడు లోకాలనేలే శ్రీనివాసుని అనుగ్రహమే పురాణపండ ‘హరే హరే’

ఆపదలను దూరంచేసే అద్భుతమే వేల వేల సౌందర్యాల తిరుమల మహాక్షేత్రంగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ‘ హరే … హరే ‘ పరమాద్భుత గ్రంధంలో స్ఫుటంగా భక్తిమయంగా ప్రస్ఫుటం చేశారని ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి ఆనం రామ నారాయణరెడ్డి అభినందించారు.

శ్రీ దేవీనవరాత్రోత్సవాల, తిరుమల బ్రహ్మోత్సవాల ముగింపు పరిమళింపు సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థాన ప్రత్యేక ఉత్సవ వేదికపై పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలన సౌందర్య తిరుమల ప్రత్యేక విశేష గ్రంధం ‘ హరే హరే ‘ ను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ … ఏ ఫలాపేక్ష లేకుండా శ్రీనివాస్ చేస్తున్న మనోహర పవిత్ర గ్రంధాల కృషి వెనుక కనకదుర్గమ్మ కటాక్షం ఉందని, ఈ ధార్మిక గ్రంథ రచనా ప్రచురణ సేవ మామూలు విషయం కాదని చెప్పారు. హరే హరే తొలిప్రతిని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ కె.ఎస్.రామారావు కు అందజేశారు.

ఇదే సమయంలో తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఆలయ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం తిరుమల ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాలదీక్షితులు, అన్నమాచర్య ప్రాజెక్ట్ డైరెక్టర్, విఖ్యాత పండితులు ఆకెళ్ళ విభీషణ శర్మకు అందజేశారు.

ఈ ‘ హరే హరే ‘ పవిత్ర వేంకటాచల క్షేత్రం గ్రంధం గురించి ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు, విఖ్యాత న్యాయవాది చల్లా ధనంజయ మాట్లాడుతూ…. ఏడేడులోకాలనేలే ఏడుకొండలవాని లావణ్యసౌందర్యం ఉట్టి పడేలా , శ్రీనివాసుని అనుగ్రహ విశేషంగా ఈ బ్రహ్మోత్సవాల్లో చిరంజీవి పురాణపండ శ్రీనివాస్ చక్కని పుణ్యాల గ్రంధాన్ని వెలువరించడం పూర్వజన్మసంస్కారమేనని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ చల్లా శివ శంకర్, ప్రముఖ యువ న్యాయవాది సీహెచ్ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement