శ్రీశైలం, ప్రభన్యూస్ : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలంలో ఆదివారం రాత్రి స్వామి అమ్మవార్లకు పుష్పపల్లకీసేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంక రించిన ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపం లో కొలువుంచి వివిధ పుష్పాలతో అలంకరిం చారు. ఆ తర్వాత మేళతాళాలతో స్వామి అమ్మవార్లను తీసుకోచ్చి పుష్పపల్లకి లో ఊరేగించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరవ రోజైన ఆదివారం ఉదయం స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిపించ బడ్డాయి. తరువాత యాగశాల యందు శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేయబడ్డాయి. అనంతరం మండ పారాధనలు, పంచావరణా ర్చనలు, శివపంచాక్షరి, నిత్యహ వనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమశాస్త్రం ప్రకారంగా జరిపించబడ్డాయి. అదే విధముగా ఈ సాయంకాలం ప్రదోష కాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement