Wednesday, November 20, 2024

వశిష్ఠుని ఆత్మజ్ఞానోపదేశము

విశ్వామిత్రుడు తన యాగమును సంరక్షించు నిమిత్తము శ్రీరాముని పంపమని కోరుటకు దశరథుని దగ్గరకు అయోధ్య వచ్చినాడు. మొదటి రాక్షస సంహా రానికి పదహారు సంవత్సరాల వయస గల శ్రీరామచంద్రుని పంపుటకు దశర థుడు సంకోచించినాడు. తానే స్వయంగా వస్తానని అభ్యర్థించాడు. కానీ దానికి విశ్వామిత్రుడు అంగీకరించలేదు. చివరకు వశిష్ఠ మహాముని నచ్చచెప్పగా దశరథు డు అంగీకరించి శ్రీరాముని సభకు రమ్మని కబురుపంపాడు. అయితే అదే సమయ ములో ప్రాపంచిక వస్తు భోగాల యడల విరక్తుడై దీర్ఘ ఆలోచనలో మునిగిన శ్రీరాముడు గొప్ప వైరాగ్యానికి లోనయినాడు. తండ్రి ఆజ్ఞను పాటిస్తూ వెంటనే అదే పరిస్థితిలో సభకు వచ్చాడు. శ్రీరాముని అంతరంగమును తెలుసుకున్న విశ్వామిత్రు డు కారణం ఏమిటని ప్రశ్నించాడు. అంత శ్రీరాముడు వైరాగ్యము చేతన #హృదయ ము కర్తవ్య శూన్యమైనదని తెలిపాడు. ఆ సమయమున దశరధుని రాజసభ చాలా గంభీరముగా మారినది. అప్పుడు వశిష్ఠ మహామునిని ఉద్దేశించి, బ్ర#హ్మదేవుడు ఉపదేశించిన ఆత్మజ్ఞానోపదేశమును శ్రీరామునికి ఉపదేశించి #హృదయ తాపమును తొలగించవలెనని కోరినాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు అంగీకరించి తన తత్త్వమును వశిష్ఠ గీతా రూపములో శ్రీరామునకు ఉపదేశించెను. దశరథుని సభ గొప్ప ఆధ్యా త్మిక సభగా మారినది. అనేకమంది ఋషులు, మునీశ్వరులు, జ్ఞానులు, సిద్ధులు, గంధర్వులు దేవతలు అందరూ శ్రద్ధతో ఆలకించినారు.
ఒకసారి విశాలమైన, శూన్యమైన, అశాంతిమయమైన, భయముతో గూడిన ఒక మహారణ్యమునందు అనేక నేత్రాలు, #హస్తాలు, కలిగిన ఒక భారీ భయంకరుడైన పురుషుడు కలడు. ఆ అరణ్యము అతి విశాలమైనది అయినను చిన్నదిగా కనబడుచు న్నది. అతడు తన అనేక వేల చేతులతో చిన్నచిన్న ఆయుధములను పట్టుకొని, తన దే#హమంతా కొట్టుకొనుచు ఆ అరణ్యమున పరుగెత్తుచుండెను. అతడు అవివేకముతో పడుతూ, లేస్తూ వళ్ళంతా గాయాలతో చివరకు ఒక అంధకారమయిన పెద్ద గోతిలో పడెను. కొంతసేపటికి దానినుండి బయటపడి అనేక ముళ్ళు కలిగిన గజిబిజి తీగల మధ్య ప్రవేశించి తిరిగి బయటపడి కొట్టుకొనుచూ అటు ఇటూ పరుగెత్తసాగెను. కొం త సేపటికి ఒక చక్కటి అరటితోటలో ప్రవేశించినాడు. మరలా తనను తాను కొట్టు కొనుచూ ఆ తోటనుండి మరొక దిక్కుకు పరుగెత్తసాగెను. అతని విచిత్ర పరిస్థితిని చూసి వశిష్ఠుడు అతనిని నీవెవరు? ఎందుకు ఇట్లు విచిత్రముగా ప్రవర్తిస్తున్నావు? నీ కు ఏమి కావలెను? అని ప్రశ్నించాడు. అంత అతడు ”ఓ మునీ! నేనెవరనుగాను, నేనే మి చేయుట లేదు, అనవసరముగా నన్ను ప్రశ్నించి నన్ను హంసించినావు, నువ్వు నా కు శత్రువు, ఇప్పడు నాకు సుఖము లేదు. దు:ఖములేదు, నేను నశిస్తున్నాను. అని పలికాడు.
తరువాత వశిష్ఠునకు వేరొక ప్రదేశములో అటువంటి వాడు తనను తాను కొట్టు కొనుచూ కనబడినాడు. తిరిగి ఆయనకు అటువంటివారే అనేకచోట్ల కృత్యములు చేసుకుంటూ అటూఇటూ తిరుగుచూ కనపడినారు. వారిలో కొంతమందిని వశి ష్ఠుడు ప్రశ్నించగా వారు శాంతిని పొంది అదృశ్యమయిపోసాగారు.
ఈ వృత్తాంతమంతా శ్రీ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునకు చెప్పి, ”ఓ! రామ చంద్రా! ఆ మహారణ్యమే చిన్నదిగా కనపడు విచిత్రమైన ఈ సంసారమే! ఇది శూన్య ముగా కనబడుచున్ననూ భయంకరమైన మనో ఆకృతి గల పురుషులు అనగా జీవు లు భ్రాంతిచే దు:ఖమనే చిత్తముతో సంచరించుచున్నారు. ఒక్కొక్కసారి ముళ్ళతో నిండిన వనములలో పడుచున్నారు. ఒక్కొక్కసారి ఫలించిన చల్లని అరటి తోటలలో పడుచున్నారు. మరొకసారి అంధకారముయిన కూపములలో పడుచున్నారు.
కూపములో పడువారు నరకమును చూస్తున్నారు. అరటి తోటలో పడువారు స్వర్గానుసక్తులు, అక్కడే ఉండి బయటకు రానివారు పుణ్యాత్ములు. ముళ్ళతో నిం డివున్న తీగల వనము నుండి బయటపడనివారు మనుషులై పుట్టి జ్ఞాన పరిణామము పొందని వారు. చివరకు ఎవరైతే జ్ఞాన సంపన్నులై ఆత్మతత్త్వమును తెలుసుకుంటు న్నారో వారు ముక్తిని పొందుతున్నారు. లేనివారు అనేక జన్మలెత్తుచూ, అనేక ఉపా దులను పొందుచూ స్వర్గ నరకముల మధ్య పరిభ్రమించుచున్నారు.
ఎవరు తత్త్వబోధను తిరస్కరించినారో వారు అవివేకులు. తనను తాను కొట్టుకొ నుచూ, ఏడ్చుచూ పరుగెట్టు వారు భోగత్యాగము చేయుటకు సిద్ధపడుతున్న కష్ట సమయు చిత్తమును కలిగి ఉన్నవారు.
అర్థప్రాప్త వివేకస్య న ప్రాప్తస్యామలం పదమ్‌
చేత సస్త్యజతో భోగాన్పరితాపో భృశం భవేత్‌.
అర్ధ జ్ఞానమును పొంది, ఆత్మ బ్రహ్మ పదమును ఇంకా పొందని చిత్తమునకు పరితాపము ఎక్కువగా ఉండును. ఆ సమయములో భోగములను పరిత్యజించవ లెనని చిత్తము భావించుటయే దానికి కారణము.
తనను తాను కొట్టుకొనుచూ పరుగెడుతుండడం అనేది మనసును వాసనలు కొ డుతుండడం. ఆ బాధ పడలేక మనసు పరుగెడుతుంది. చివరకు ఎవరైతే మనసును, బుద్ధిని, అహంకారమును, విత్తమును విడివిడిగా తెలుసుకుంటారో వారికి ఆత్మ దగ్గ రవుతుంది. మనసు పరుగెడుతుంది. చివరకు ఎవరైతే మనసును, బుద్ధిని, అహం కారమును, చిత్తమును విడివిడిగా తెలుసుకుంటారో వారికి ఆత్మ దగ్గరవుతుంది. మనసు తన వాసనా రూపము క్రమముగా కోల్పోతుంది. దానికి తత్త్వబోధ, సాధన అవ సరం, భోగ త్యాగము అత్యంత అవస్యము. మిత భావన అత్యంత ప్రయోజనం చేకూర్చుతుంది. ఇక్కడ భోగమంటే అరిషడ్వర్గాలయిన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను పెంచి పోషించేది ఏదయినా అవ్వచ్చు.
సత్యమునకు జీవుడు ఆత్మయే అయిననూ అహంకారము వలన కలుషిత దృష్టి తో సమస్తమూ ద్వైతమని భావిస్తున్నాడు.” అని వశిష్ఠ మ#హర్షి చిత్తాఖ్యానము అను ప్రకరణములో బోధించాడు. దీనిని మనం అన్వయించుకుంచే ప్రస్తుతం సమాజ ములో పడుచున్న కష్టాలు, పెడుతున్న కష్టాలు, లోభాలు, ప్రలోభాలు, కాంక్షలు, ఆకాంక్షలు, అమానవీయాలు, భోగలాలసత్వాలు వీటన్నింటికి కారణం చిత్త భ్రమ ణము. సత్త్వగుణమును ఆపాదించుకొని ఆనందాన్ని పొందాలనే పూర్ణజ్ఞానమును తెలుసుకోవడం అవసరము. అర్థజ్ఞానముతో ఆగిపోతే అథోగతే!

– వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు, 8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement