గ్రామ పొలిమేరన శివాలయం వద్ద ఒక సిద్ధుడు తపస్సు చేస్తూ నివసిస్తున్నాడనే వార్త జనంలో వ్యాపించింది. ఆయనను కలిసేందుకు, ఆశీర్వాదం కోసం, తమ కోరికలు చెప్పి, నెరవేర్చుకునేందుకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. తమకు శాంతి, ఆరోగ్యం, సంపదలు ప్రసాదించాలని కోరుతూ, ఆయన ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. ఆ సందర్భంలో ఒక ప్రముఖ వ్యక్తి విరాజిల్లే అలంకరణలతో, సంపదలకు చిహ్నంగా నిలుస్తూ సిద్ధుడి దర్శనానికి వస్తాడు. తన కోరికను బయట పెట్టే అతడు, ఇంకా మరింత గొప్పగా ఎదగాలని, ఊరి జనమందరి కంటే అధిక సకల సంపన్నుడిగా ఉంచాలని, తాను వుండేలా ఆశీర్వదించాలని కోరతాడు.
ఆ ప్రముఖ వ్యక్తి కోరికను విన్న సిద్ధుడు ”అంతటి ఆశ పనికి రాదు, మనలోని కాంక్ష క్రమంగా మనను బంధించి దూరంగా తీసుకుపోతుంది. సంపదను కోరడం కన్నా, దానిని పరమార్థంగా ప్రజల కోసం ఉపయోగించాలన్న కోరిక ఉండాలి, సంపదల్ని కొంత పంచాలి” అని ఆ సిద్ధుడు చెబుతాడు. ఆయన మాటలు లోక#హతం, సమాజం బాగు కోసం కాబట్టి అందరిలో ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. సిద్ధుని మాటలు వింటూ, ఆ ప్రముఖ వ్యక్తి తన మనసులోని కల్లోలాన్ని పరిశీలించి, లోక #హతానికి, లోక సేవకు తన జీవితం అంకితం చేయాలనే సంకల్పం కలిగి వెళ్ళిపోతాడు. సాధారణంగా మనం ఆధ్యాత్మిక సాధన లేదా భక్తి మార్గంలో గమ్యం సమీపిస్తున్నప్పుడు, భౌతిక విలాసాల కోసం తపన పెరుగుతుంది. కాని, నిజంగా సాధించాల్సింది మాత్రం ఆత్మానందం, లోకమార్గంలో పయనం. అశాశ్వతమైన సంపద సమగ్ర స్థితిని గమనిస్తే, సర్వజన #హత కాంక్షే నిజమైన సంపదగా క్లుప్తీకరించవచ్చు. మన సమాజం ముందుకు వెళ్లాలంటే వ్యక్తిగత ఆశలకు ముగింపు పలికి సమాజాన్ని సేవించడం ముఖ్యం. ఒక వ్యక్తి సంపదను పొందినంత మాత్రాన అది పూర్తి సంతృప్తి ఇవ్వదు. కానీ, ఆ సంపదను సమాజ #హతం కోసం వినియోగిస్తే, ఆ వ్యక్తి జీవితమే ఒక స్ఫూర్తి అవుతుంది.
సమాజం మనకు ఇవ్వడంలో, మనం సమాజానికి ఇచ్చే తిరిగి ఇచ్చే బాధ్యతను గుర్తుచేయాలి. తమ చుట్టూ ఉన్న ప్రజల అభ్యున్నతికి పునాదులు వేస్తూ, కాంక్షలను తగ్గించుకోవడమే శ్రేష్ఠమైన కార్యం.
భగవంతుడి సృష్టిలో అందరికి మంచి చేసే ప్రయత్నం చేయడమే గొప్పతనం. దేవుడిని చేరాలని కోరుకుంటున్న ప్రతి సాధన, సర్వజన సుఖం కోసమే ఉండాలి.
సిద్ధుని సందేశం గ్రామ ప్రజల #హృదయాలలో స్ఫూర్తి నింపుతుంది. సకల సంపదలు, స్వార్థాలు మాత్రమే కాదని, తమ చుట్టూ ఉన్న ప్రజల అభ్యున్నతికి పునాదులు వేయడమే శ్రేష్ఠమైన జీవితం అనే బోధన అందిస్తుంది.
- డా||చిట్యాల రవీందర్