ఉద్ధాలక మహర్షి కుమారుడు శ్వేతకేతువుకు ఉప నయన సంస్కారాలు నిర్వహంచి, కొంత వయ స్సు వచ్చేవరకు తానే గురువుగా కొంతమేర వేదా ధ్యయనం నేర్పాడు. తన వద్దే విద్యను అభ్యసించడంకంటే గురువు శుశ్రూషలోనే బాగా అధ్యయనం చేయగలుగు తాడని పిలిచి, ”నాయనా! శ్వేతకే తూ! నువ్వు ఇకనుండి గురుకుల ఆశ్రమానికి వెళ్ళి బ్రహ్మచర్య దీక్షతో విద్యను అభ్యసించు. పండితువుకా!” అని చెప్పి పంపా డు.
శ్వేతకేతువు తన తండ్రి సూచనమేరకు గురుకులా శ్రమంలో దాదాపు పన్నెండు సంవత్సరాలు వేదాధ్యయ నం, ఉపనిషత్తులు సారం తెలుసుకొన్నాడు. కుమారుడుకి ఆత్మజ్ఞానం తెలిసిందా? లేదా? అని పరీక్షించాలని భావిం చాడు. ”నాయనా! శ్వేతకేతు! శ్రవణ గోచరం కాని తత్త్వం, ఇంద్రి య గోచరించే పరమాత్మ తత్త్వం గురించి మీ గురువు గారిని ఎ ప్పుడైనా అడిగావా?” అని అడిగాడు.
శ్వేతకేతు ”ఏమిటా విషయం?” అన్నాడు.
”ఉద్ధాలకుడు, మట్టితో చేసే వస్తువులు రూపాలను బట్టి, వివిధ పేర్లతో పిలుస్తారు. అలాగే బంగారం, కర్రలతో చేసే వస్తువులు, వేరువేరుగా పేర్లున్నాయి. కాని గోచర మయ్యే వస్తువులలో ఉన్న మూల పదార్థం ఒక్కటే. ఆ మూలంలో అంతర్గతంగా ఉన్న తత్త్వం గురించి తెలిస్తే, పరబ్రహ్మ తత్త్వం నీకు బోధపడుతుంది.” అని చెప్పాడు.
”అయితే నాన్నగారు! నాకు ఆ విషయం గురించి పూర్తి గా వివరించండి.” అని కోరాడు.
”శ్వేతకేతా! సృష్టికి పూర్వం ఈ జగత్తు అంతా శూన్యం. అపుడు అద్వితీయమైన సత్తు ఒక్కటే ఉండేది. సత్తు అంటే సత్యం. అసత్యం అనేది లేదు. అంటే ఏకత్వం. అదే పర బ్ర#హ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ అంశతోనే పంచభూతా లు, అనేక రూపాల్లో జీవులుగా, వస్తువులుగా, నదులుగా, పర్వతాలుగా ఏర్పరచబడ్డాయి. సృష్టి ఏర్పడింది ఆ పంచభూతాలు అంటే అగ్ని, భూమి, జలం, వాయువు, ఆకాశం వల్లనే జీవులకు అవ సరమైన ఆహారాన్ని, వాయువును, జలాన్ని పొందుతున్నారు. నాయనా! చూసావా!
నిద్రావస్థలో జీవులు ఆత్మతో లీనమై ఉంటుంది. కాని మరణ సమ యంలో ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది.
సత్తు అంటే శుద్ధ చైతన్యమే. ఆ చైతన్య స్వరూపం నీలోనే ఉంది. ప్రతీ జీవిలోను ఉంది. అది గుర్తించడమే ఆత్మజ్ఞానం. బాహ్యప్రపం చపు వ్యామో#హంలో పడి, సత్యశోధన చేయకుండా, అంతర్ముఖులు కాలేకపోతున్నారు. నువ్వు కాస్త ఉప్పు తీసుకుని నీళ్ళలో వేయి” అన్నాడు.
తండ్రి చెప్పినట్లే చేశాడు శ్వేతకేతు. కొంతసేపటికి, ఆ ఉప్పు నీటి పాత్ర తెప్పించి, కరిగిపోయిన ఉప్పు వేరు చేయమని సూచించాడు తండ్రి.
నీటిలో కరిగిన ఉప్పును ఎలా వేరు చేయలేమో అలాగే మనం పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకోవాలి. అప్పుడు ఆత్మజ్ఞానం పొంది నట్లే. ఇంకొంచెం వివరంగా చెపుతాను విను. ఒక మర్రి విత్తనం తీసుకుని రా నాయనా! అన్నాడు.
శ్వేతకేతు మర్రి విత్తనం తీసుకువచ్చాడు.
”ఇప్పుడు ఆ పండును విరుద్ధమన్నాడు. ఇప్పుడు నీకు ఏమి కనపడుతోంది?” అని తండ్రి ప్రశ్నించాడు.
”విత్తనాలు కనపడుతున్నాయి” సవినయంగా సమాధానం ఇచ్చాడు శ్వేతకేతు.
తండ్రి ”అయితే ఒక విత్తనం తీసుకుని చిన్న భాగాలుగా చిత క్కొట్టు. ఇప్పుడు ఏమి కనపడుతోంది?” అని అడిగాడు.
”ఇప్పుడు కంటికి కనపడని రీతిలో శూన్యంగా ఉంది. విత్తనం ఉన్నట్లే కాని గోచరించడంలేదు.” అన్నాడు శ్వేతకేతు.
”అంతపెద్ద మర్రి చెట్టు ఇంత చిన్న విత్తనంలో ఇమిడి ఉన్నట్లే, కనపడని పరమాత్మ తత్త్వాన్ని తెలుసు కోవడమే ఆత్మజ్ఞానం. ఇక్కడ విత్తనం వేరు, చెట్టు వేరు కాదు కదా. అలాగే పరమాత్మ రూపమే నువ్వు. నీలోనే ఉంది శుద్ధ చైతన్యం. నువ్వే తత్త్వమసి. తెలిసిందా! వేదాలు, ఉపనిషత్తులు సారాన్ని గ్రహంచి సత్యశోధన చేయాలి. ఆ చైతన్యం నువ్వే. వివిధ నదులలోని నీరు చివరికి సముద్రంలో కలు స్తాయి. అలా కలిసిన నదులలోని నీటిని వేరుచేయలేనట్లే, జీవులు పర బ్రహ్మలో లీనమైనప్పుడు, విడదీయడం కష్టం. ఇదే సత్యం. ఇదే ఆత్మ జ్ఞానం.” అని బోధించాడు.
ఒక విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణత పొందడానికి సాధన చేసే విధం గానే, మనం పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకోవాలంటే సాధన కావాలి. దానికి ఆధ్యాత్మిక చింతన అనే విత్తనం అవసరం.
సత్యం నుండే ఆత్మ జ్ఞానం
Advertisement
తాజా వార్తలు
Advertisement