సత్యం అనేది మారదు. సూర్యుడు ప్రతిరోజు తూర్పున ఉదయిస్తాడు అనేది సత్యం. అది అన్ని కాలాలలోనూ మారని సత్యం. మానవుని జరామరణాలు, నీరు పల్లం వేపు ప్రవహస్తోంది అనేవి సత్యం. కాని ధర్మం అలా కాదు. కాలంతో పాటు మని షి మనిషికి మారుతుంది. కృతయుగంలో నాలుగు పాదాల ధర్మం నడిచింది. త్రేతాయుగంలో మూడు పాదాలపై, ద్వాపరయుగంలో ధర్మం, అధర్మం సమంగా నడిచాయి. కలియుగంలో కలి ప్రభావంతో ఒంటి కాలిమీద ధర్మం నడుస్తున్నది. ధర్మానికి ప్రమా ణం వేదం. వేదం సమర్ధిస్తే అది ధర్మం. వేదానికి వ్యతి రేకంగా ఉంటే అది అధర్మం. ధర్మంలో మనుష్య ధర్మం, పశు ధర్మం వేరువేరుగా ఉంటాయి. పులి జిం కను చంపి తినడం పశు ధర్మం. కాని మనిషి తోటి మని షికి హాని చేస్తే అధర్మము. మనిషికి భగవంతుడు జ్ఞా నాన్ని ఇచ్చాడు.. పశువులకు అది లేదు కనుక వాటికి ఏ ధర్మం వర్తించదు. గృహస్థు, సన్యాసి, బ్రహ్మచారి ధర్మాలు వేరు. గృహస్థు సన్యాసిగా ఉండరాదు. సన్యా సి బ్రహ్మచారిలా ఉండరాదు. గృహస్థు వైరాగ్యంతో సన్యాసిలా భార్యాపిల్లలను పట్టించుకోకుండా ప్రవర్తి స్తే అధర్మమే. బ్రహ్మచారి సన్యాసి ధర్మం పాటించ రాదు. సన్యాసి గృహస్తు ధర్మం పాటించరాదు. వాల్మీ కి మహర్షి రామాయణంలో ధర్మానికి నిలువెత్తు నిద ర్శనంగా శ్రీరాముని గుణగణాలను పేర్కొన్నాడు.
ధర్మం గురించి చెప్పాలంటే రామాయణం ఉదా హరణగా తీసుకోవాలి. దశరథుడు శ్రీరామునకు పట్టాభిషేకం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. మం త్రులు, ఇతర ముఖ్యులు, కులగురువు వశిష్టుడు ఇతర మహర్షులకు కబురు పంపి రాముని పట్టాభిషేకం విషయం తెలిపాడు. రాముని పిలిచి రేపు తెల్లవారిన తరువాత పుష్యమీ లగ్నంలో నీ పట్టాభిషేకం అందు కు సిద్ధంగా ఉండమన్నాడు. శ్రీరాముడు తండ్రి మా టకు సిద్ధపడి భార్య సీతతో ఆరోజు చేయాల్సిన క్రతు వును పూర్తి చేసుకున్నాడు. శ్రీరాముని పట్టాభిషేక నిర్ణ యం అనంతరం దశరథుడు తన ప్రియ భార్య కైకేయి మందిరానికి సంతోషంతో వచ్చాడు.
అప్పటికే రాణి తన ప్రధాన దాసి మంధర మాట ల ప్రభావానికి లోనై అసూయాగ్రస్తురాలై ఉంది. కటిక నేలమీద కైక పడి ఉండడం దశరధుడు చూసి రాణి.. ఏమి నీ బాధకు కారణం… ఏమి కావాలో అడుగు, ఎం తటిదైనా తీరుస్తానని మాట ఇచ్చాడు. దానికి కైకేయి మాటమీద నిలబడే ఇక్ష్వాకు వంశం నీది గుర్తు పెట్టుకో అని గతంలో దేవదానవ యుద్ధం సందర్భంగా దశర థుడు తనకు ఇచ్చిన వరాలను గుర్తుచేసి వాటిని తీర్చా లని కోరింది. దానికి దశరథుడు కోరుకో అనగానే భరతునికి పట్టాభిషేకం, రాముడు 14 ఏళ్లు అరణ్యవా సం వరాలు ఇమ్మంది. దాంతో దశరథుడు హతాశుడై కైకను ఆ రాత్రి అంతా ప్రాధేయపడినా ఆమె తన కోరి కలు నెరవేరాలని పట్టుపట్టింది. మంత్రి సుమంత్రుని సందేశంతో రాముడు కైక మందిరానికి వచ్చి తండ్రికి నమస్కరించాడు. తండ్రి మౌనంగా ఉండడంతో రా ముడు తండ్రి! మీ విచారానికి కారణ మేమిటి, మీ ఆనందం కోసం ఏమి చేయమన్నా చేస్తానన్నాడు. అం తట కైక నాయనా నీ తండ్రి నాకు రెండు వరాలు ఇచ్చా డు. భరతుడికి పట్టాభిషేకం, 14 ఏళ్లు నీ అరణ్యవాసం అని పేర్కొంది. తన వరాలు నెరవేరుతాయో లేదోనని నీ తండ్రి దిగులుగా ఉన్నాడంది. అంతట రాముడు.. తండ్రి! నాకు రాజ్యం, ఐశ్యర్యం లపై భ్రాంతిలేదు. తండ్రి మాటను పాటించడమే నా ధర్మమన్నాడు. అదే పుత్ర ధర్మమన్నాడు. కైకతో అమ్మా.. నేను నీ ఒడిలో పెరిగాను. వరాలు అడగాలా… రామా అర ణ్యానికి శాశ్వతంగా వెళ్లమంటే వెళ్లనా? తండ్రి ఆజ్ఞ ను పాటిస్తూ ఇప్పుడే అరణ్యానికి వెళతానని రాముడు కైకకు చెప్పి తల్లి కౌసల్య మందిరానికి వచ్చాడు. లక్ష్మ ణుడు ఆవేశంతో అన్నా.. ఆ ముసలి దశరథుని నిగ్ర హంచి నిన్ను రాజును చేస్తా ఆదేశించు అన్నాడు. తల్లి కౌసల్య కూడా నాయనా రామా.. లక్ష్మణుడు చెప్పిన మాట ఆలోచించు.. నేనూ అరణ్యానికి నీతో వస్తానని అన్నది. దానికి రాముడు మీ ఆలోచన తప్పు. రాజాజ్ఞ తిరస్కరించరాదు. తండ్రి మాట శిరోధార్యం. ఆయ న ఇచ్చిన శరీరం ఇది. ఈ శరీరంతో ఆయనకు అపకీర్తి తేలేను. మన వంశం వారైన సగర చక్రవర్తి కు మారు లు తండ్రి మాటపై అశ్వాన్ని వెతికేందుకు వెళ్లి బూడిద కుప్పలయ్యారు. పరశురాముడు తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లిని నరికాడు. తండ్రి ఆదేశం పాటించ డంకంటే కుమారుడికి మరో ధర్మం లేదు.
తల్లితో భర్త బతికుండగా వదిలిపెట్టడం అధర్మం. భర్తను సేవించడం నీ ధర్మం అన్నాడు శ్రీరాముడు.
మహాభారతంలో కూడా ధర్మం, అధర్మంపై కృ ష్ణుడు వివరణ ఇచ్చాడు. పాండవులు అరణ్య వాసం చేసే సమయంలో శ్రీకృష్ణుడితో… బావా మేము ధర్మం తప్పక నడుస్తున్నా కష్టాలు తప్పడంలేదు. ఆ కౌరవు లు అధర్మంగా మా రాజ్యాన్ని పొంది సుఖాలు అనుభ వి స్తున్నారు కదా? అని అడిగారు. అందుకు శ్రీకృష్ణుడు సమాధానంగా ఈ జన్మలో చేసిన పాపాలు కర్మల రూ పంలో అనుభవించక తప్పదు అన్నాడు. నీవు చేసిన కర్మలను నీవే అనుభవించాలన్నాడు. నీవు శరీరాన్ని వదిలినా కర్మ వదలదు. నీవు చేసిన అధర్మాలన్నీ వచ్చే జన్మలో వెంటాడుతాయి. కర్మలే నీ పునర్జన్మను నిర్ణయిస్తాయి. అధర్మంవల్ల వచ్చే సుఖం తాత్కాలి కమే కాని కర్మల రూపంలో పట్టి పీడిస్తాయని కృష్ణుడు పాండవులకు తెలిపాడు. ధర్మం ఆచరించిన వారి పేరు పది కాలాలపాటు ఉంటుంది.
సత్యం… ధర్మం
Advertisement
తాజా వార్తలు
Advertisement