Tuesday, November 19, 2024

సత్పురుషుల సాంగత్యఫలము!

ఒకరోజు ఒక దొంగ పట్టపగలు రాజభవనంలోకి ప్రవేశించా డు. కాపలాదారుల కళ్ళు కప్పి దొంగ తనం చేశాడు. అలికిడితో అప్రమత్త మైన కాపలాదార్లు పారిపోతున్న దొంగను చూసి వెంబడించారు.
ఆ దొంగ పరిగెట్టి… పరిగెట్టి బాగా అలసిపోయాడు. ఇక రాజభటు ల నుండి తప్పించుకోవడం కష్టమని గ్రహంచాడు. దొంగిలించిన సొత్తును ఎవరి కంటపడకుండా విసిరేసాడు. అలా వెళుతూ వెళుతూ ఊరి చివరకు వచ్చే సాడు. అక్కడ దొంగకు స్మశానం కని పించింది. దొంగకు ఓ ఆలోచన వచ్చింది. వెంటనే స్మశానంలోకి వెళ్ళా డు. అక్కడ ఉన్న బూడిదను వంటి నిండా పూసుకుని ఓ చెట్టుక్రింద సాధువేషంలో కూర్చున్నాడు.
రాజభటులు వచ్చి చుట్టూ వెతికారు. దొంగ ఎక్కడా కనబడకపోయేసరికి తప్పించుకుని పారిపోయి ఉంటాడని అనుకున్నారు. రాజభవనానికి వెళ్ళడానికి వెనుదిరిగారు.అంతలో వారికి అక్కడ ఓ చెట్టు క్రింద ధ్యానంలో ఉన్న సాధువు కనిపించాడు. ఆయనను చూసి ఎవరో సాధువు ధ్యానమగ్నుడై ఉన్నాడని తలచి అతనికి మ్రొక్కారు. రాజభటులు ఊళ్ళోకి వెళ్ళి ఊరి బయట చెట్టు కింద ఓ సాధువు వున్నాడని చెప్పారు.
అలా ఒకరి నుంచి ఒకరికి ఊరంతా తెలిసింది. ఊరి బయట ఓ సాధు పుంగవుడు ఉన్నాడని జనం తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని మ్రొక్కుతూ ఫలపుష్పాదులు సమర్పించుకోసాగారు.
”నేను సాధువు వేషంలో ఉంటేనే ప్రజలు నన్ను ఇంతగా ఆరాధిస్తున్నారు. అలాంటిది నేను నిజంగా సాధువునైతే భగవంతుడి కృప నాకు బాగా లభిస్తుంది కదా” అనుకుని ఆ నాటినుండీ ఆ దొంగ నిజమైన సాధువుగా మారిపోయాడు.
కేవలం వేషధారణ అతనిలో ఎంతో మార్పుకు నాంది పలికింది. జీవన వాసనా ప్రభావ మది. శంకర భగవత్పాదులు అందువల్లనే ”భజగోవిందం”లో ఇలా అన్నారు.
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలత్వం
నిశ్చలతత్త్వై జీవన్ముక్తి:
సత్సాంగత్యం వల్ల అసంగత్వం ఏర్పడి మోహం, భ్రాంతి తొలగిపోతాయి. అప్పుడే మన సు నిశ్చలమై ముక్తి లభిస్తుంది. భగవత్‌ చింతన వల్ల సద్భక్తుల సహవాసం లభిస్తుంది. అది ముక్తికి సోపానమై, జన్మ చరితార్ధం ఔతుంది. సత్కర్మాచరణ, సత్యనిష్ఠ, సాధుసత్పురుషుల సాంగత్యం వల్ల మోహం నశించి ఆత్మ నిరంతరం చైతన్యాత్మలో సంగమిస్తుంది.
పెడదారి పట్టిన మనస్సును సరిదిద్దే గొప్ప అవకాశం సత్సంగత్వం. సత్సాంగత్వం వల్ల మోహం, భ్రాంతి నశిస్తాయి. మనస్సు నిర్మోహమై, నిశ్చలమవుతుంది. అంత:కరణ శుద్ధమై, పరమాత్మకు నిలయం అవుతుంది. అప్పుడే జీవన్ముక్తి.
మట్టి ఇనుముకు అంటితే తుప్పు పడుతుంది. అదే ఇనుము నిప్పులలో కాలిస్తే తిరిగి మెరుస్తుంది. సత్‌ సహవాసం నిప్పులాంటిది. మనలోని మాలిన్యాలను ప్రక్షాళనం చేసి మనస్సును, చిత్తాన్ని, అంతరంగాన్ని పరిశుద్ధం చేస్తుంది. క్రమేపి ఆత్మతత్త్వాన్ని అర్ధం చేసుకొని, అద్వైతానందానుభూతిని పొందే అవకాశాలను కల్పిస్తుంది.
ప్రతి ఒక్కరు నిశ్చేతనంగా వుండకూడదు. వీలైనంతవరకు దైవచింతన, ఆధ్యాత్మికత పెంపొందడానికి మార్గదర్శకమైన సత్సంగ సమూహాల్లో పాల్గొనాలి. అప్పుడే జ్ఞానసిద్ధి పొంద డానికి, మోక్షప్రాప్తికి అవకాశాలు పెరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement