Saturday, November 23, 2024

సర్వవేళలా ఇష్టదైవ స్మరణం

శ్రీకృష్ణుడు భగవద్గీతలో తనకు అర్పించకు ండా భుజించిన ఆహారం పాపభూయిష్ట మైనదని, అందువలన నిష్కృతి లేని పాపా లు మూటగ ట్టు కుంటారని, అదేవిధంగా భగవంతునికి అర్పించి, పా వనం చేసిన పిమ్మట తీసుకున్న ఆహారం అమృతతుల్య మని అందువలన జీవునకు ఇహం లో, పరంలోనూ శ్రేయస్సు కలుగుతుందని సెలవిచ్చి ఉన్నారు. ఈ గీతా సారాన్ని కలియుగ దైవం, భక్తుల పాలిటి కల్పవృ క్షం అ యిన శ్రీ సాయినాథుడు తనదైన రీతిలో భక్తులకు బోధించారు.
శిరిడీలో ప్రతి ఆదివా రం సంత జరిగేది. చుట్టు ప క్కల గ్రామాల నుండి ప్రజ లు వచ్చి ఆ వారానికి కావల సిన సరుకులు కొనుక్కొని తిరిగి వెళ్ళి పోయేవారు. వెళ్ళే ముందు వారు మసీదు కి వచ్చి సాయిని దర్శించుకో వడం ఒక అలవాటు. ఒక ఆదివారం ఎప్పటివలె మసీ దు కిక్కిరిసిపోయి వుంది.
సాయి సచ్ఛరిత్ర రచ యిత, బాబాకు కూర్మి భక్తు డు అయిన హమాద్రిపంత్‌ బాబా ముందు కూర్చొని ఆయన పాదములను ఒత్తుతూ మనస్సులో నామ జపం చేసుకుంటున్నాడు. బాబాగారి ఎడమ వైపు శ్యా మా, కుడి వైపున బూటీ, కాకా దీక్షిత్‌ కూడా కూర్చొని వున్నారు. అప్పుడు శ్యామ నవ్వుతూ, ”హేమాద్రిపం త్‌జీ, నీ కోటుకు శనగగింజలు అంటినవి చూడు” అని అన్నాడు. అంతేకాక హమాద్రిపంత్‌ చొక్కా చేతులను తట్టగా కొన్ని శనగ గింజలు రాలిపడ్డాయి. హమాద్రి పంత్‌ వెంటనే తన చేతులను ముందుకు చాచగా మరి కొన్ని శనగ గింజలు రాలిపడ్దాయి.
ఈ సంఘటనకు అందరూ ఆశ్చర్యపడ్డారు. శన గలు చొక్కా చేతుల లోపలకు ఎలా ప్రవేశించాయో ఎవ రికి తోచినట్లు వారు ఊ#హంచనారంభించారు. అప్పు డు శ్రీ సాయి కల్పించుకొని ”ఆ హమాద్‌పంతుకు తాను తిన్నప్పుడు ఇంక ఎవ్వరికీ పెట్టని దుర్గుణము వున్నది. ఈరోజు సంతలో శనగలు కొని తానొక్కడే తిం టూ ఇక్కడికి వచ్చాడు” అని అన్నారు.
సాయి మాటలకు హమాద్రిపంత్‌ ఒకింత ఆశ్చ ర్యపడి ”బాబా! నేనెప్పుడూ దేనినీ ఒంటరిగా తిని ఎరు గను. ఈ రోజు దాకా శిరిడీలోని సంత ఎక్కడ జరుగు తుందో కూడా నాకు తెలియదు. ఈ రోజు కూడా నేను సంతకు వెళ్ళలేదు, అయినప్పుడు నేను శనగలు ఎలా కొని వుండగలను? నా దగ్గర ఏ వస్తువైనా ఉన్నప్పుడు దానిని దగ్గరవున్న వారికి పంచి ఇవ్వకుండా నేనొక్కడినీ తినే అలవాటు నాకు లేదు. మనం ఆహారం తినే సమ యంలో దగ్గర ఎవరైనా వుం టే కొంతభాగం వారితో పంచుకోమని మా తండ్రిగారు చెప్పిన ఉపదేశాన్ని ఇప్ప టికీ తుచ తప్పక పాటిస్తున్నాను. అటువంటప్పుడు ఈ దుర్గుణమును, అభాండమును నాపై ఎందుకు మోపు తున్నావు?” అని అడిగాడు. అప్పుడు సాయి చిరునవ్వు తో ”భావూ (తమ్ముడా!) దగ్గర ఉన్నప్పుడు ఇంకొకరికి పంచి ఇస్తావు కానీ ఎవరూ లేనప్పుడు ఏం చేస్తావు? తినే టప్పుడు కనీసం నన్ను స్మరిస్తావా? నేనెల్లప్పుడు నీ చెంత లేనా? నీవే దైనా తినేటప్పుడు నాకు అర్పిస్తున్నా వా?” ఆ మాటలకు హమాద్‌పంత్‌ ముఖం చిన్నబో యింది. బాబా మాటలలో ని అ ర్ధం అక్కడ కూ ర్చున్న వారందరికీ అవగతమై అంద రి అజ్ఞానం పటాపంచలై జ్ఞానోదయం అయ్యింది.
##హమాద్‌పంత్‌ శనగలు తినుట ఆసరాగా చేసుకొని శ్రీసా యి ఒక అద్భుతమైన, అపూర్వ మైన బోధన చేసారు. మనస్సు, బుద్ధి పంచేంద్రియ ముల కంటే ముందుగా విష యములను అనుభవిస్తాయి, కనుక మనం ముందే ఏ విష యానైననూ భగవదర్పితం చేయాలి. అ ప్పుడు మనకు ఆ విషయములందు అభిమాన ము అదృశ్యమైపోతుంది. విషయములను అనుభవించే ముందు బాబా మన చెంతనే వున్నట్లు భావిస్తే ఆ వస్తువును మనము అను భవించవచ్చునా లేదా అన్న ప్రశ్న ఉదయించి తద్వారా వైరాగ్యం, వివేకము ఉదయిస్తాయి. ఆధ్యాత్మిక జీవి తంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. మనము మన సద్గురువును లేదా ఇష్ట దైవమును స్మరించనిదే ఏ పనినీ చేయరాదు.
తినే ఆహారాన్ని ముందుగా భగవదర్పితం చెయ్య డం, తర్వాత కొంత భాగాన్ని మనతో వున్నవారికి పంచి ఇవ్వడం చేయాలి. అంతేకాకుండా భగవంతుడు సర్వాంతర్యామి అని, భౌతికంగా మన చెంత లేకపోయి నా, మనసా వాచా కర్మణా ఆయనను తలుచుకొని ఆహా రం ప్రసాదంగా అర్పిస్తే ఆయనకు స్వయంగా అర్పించి నట్లే అని తెలుసుకోవాలి. ప్రసాదంగా భావించి తినే ఆహారంలో సాత్వికత ఎక్కువై చివరకు మనలో రజో, తమో గుణాలు తగ్గి సత్వ గుణం వృద్ధి చెందుతుంది. మనసు సైతం నిర్మలమవుతుంది. మనస్సును ఈవిధం గా క్రమశిక్షణతో ఉంచినట్లయితే శ్రీఘ్రమే ఆ సద్గురువు యొక్క అపూర్వమైన, అత్యద్భుతమైన కరుణా కటా క్షాలకు పాత్రులమవుతాము.
శ్రీ సాయి చేసిన ఈ బోధనామృతమును మనసా రా వంటబట్టించుకొని భక్తులందరూ తమతమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు.
– సి.##హచ్‌.ప్రతాప్‌
91368 27102

Advertisement

తాజా వార్తలు

Advertisement