Monday, November 18, 2024

సర్వవేదముల సారం శివతత్వం

అవ్యక్త స్వరూపమైన పరమాత్మ అద్వైతుడు. వ్యక్తమై ఈ చరాచర సృష్టిని చేసిన పుడు త్రిమూరిత స్వరూపముగా వెలుగొందుచున్నాడు. కాలము అనంత ము. భగవంతుని అంశ. అటువంటి కాల స్వరూపాన్ని యుగము నుండి క్షణము వర కు విభజించి అర్చించుచున్న మన సనాతన ధర్మము మానవునికి అందించిన ఏకైక దివ్యమార్గము. పరమాత్మను అనేక రూపాలలో సేవించడానికి ఏర్పరచుకున్నవే మాసములు. అవి పన్నెండు మాసాలుగా ఏర్పడి కాలమును పర్వదినములుగా చేసి మానవునికి అందించి నవవిధ భక్తి మార్గములలో నడవమన్నది.
నేటితో కార్తిక మాసము ముగియుచున్నది. ఈ నెల రోజులు శివారాధనతో మారుమ్రోగినది. దీపములతో జ్ఞానం ప్రకాశవంతమైనది. భారతీయ సంస్కృతిలో మానవ జీవితమంతా పండుగలతో ఆనందమయం చేసుకోమని సూచిస్తోంది. పండుగ అంటే భగవదారాధనతో సర్వజనులు కలసి మెలసి కష్టసుఖాలు పంచుకునే గొప్ప భావ సంపతి. ఇతరుల మనసులను మనోహరం చేసే గొప్ప సేవాభావన. దేవాల యాలలో జరిగే ఉత్సవాల ఆంతర్యం అదే!
సర్వవేదముల సారం శివతత్త్వం. సర్వమూ శివాత్మకమని తెలుసుకోవాలి. పర మశివుడు స్వప్రకాశ స్వరూపుడు. శివ సంకల్పం నుండే జగత్తు ఉద్భవించింది. శివుడు చైతన్యస్వరూపుడు. కర్మలకు అతీతుడు శివుడు. జీవుడు సర్వశక్తిమయుడైన పరమే శ్వరుని గుర్తించక ప్రకృతి మాయలోపడి అజ్ఞానంచేత తనను ఈశ్వరునికంటే భిన్నం గా భావిస్తున్నాడు. జ్ఞానముచే ఆ మాయను తొలగించుకుంటే తానే ఈశ్వర స్వరూప మని గ్రహిస్తాడు. అపుడు జీవుడు శివుడే అవుతున్నాడు.
వేదసారమైన అద్వైత మార్గంలో పయనించినవారికి శివదర్శనం సులభంగా లభిస్తుంది. పరమేశ్వరుడు అనేకంగా గోచరిస్తున్నా ఆయన లింగస్వరూపుడై తన ఏ కత్వ మహిమను ప్రదర్శిస్తున్నాడు. సృష్టి, స్థితి కారకులైన బ్రహ్మ, విష్ణువులిరువురు కూడా ఈ లిం గ ఆద్యంతములు దర్శిం చలేకపోయారు. పుట్టిన ప్రతి వస్తువు లయముకాక తప్పదు. రుద్రుడు తన విలయతాండవంతో ల యం చేసాడు. శివునికి కర్తృత్వం లేదు. కర్త లేనిది నరహం కారి. అహంకారహితమైనది. జీవ భ్రాంతి లేనిది. భ్రాంతి లేని చోట మాయ లేదు. మాయ లేని ప్రదేశమే కైలాసం. ఈశ్వరుడు జ్ఞాన స్వరూపుడై, జ్యోతిస్వరూపుడై వెలుగొందుతాడు. ఏక రూపుడైన శివుడు అవ్యక్తమై వ్యక్తమయిన ఈ ప్రపంచాన్ని లయం చేసుకుంటున్నాడు. అనేక వృక్షాల యొక్క మూల రూపం బీజం. అలాగే ఈ సమస్తమూ బీజరూపము. అది ఈశ్వరుని చైతన్యము. నానాత్వము బీజ రూపమైన లింగ రూపము. లింగరూపమే బీజ రూపము. కాబట్టి ఈ సమస్త విశ్వాంతరాళము యొక్క బీజ రూపము లింగము. ఈ శివలింగార్చన యే అద్వైత మార్గము. అహంకారంతో కూడిన చైతన్యము. జీవుడు ఎప్పుడైతే అహంకార రహితుడవుతాడో అప్పుడు శివుడవుతున్నాడు. నేనే శివుడను జ్ఞానముతోనే జీవ న్ముక్తుడగు చున్నాడు. ప్రారబ్ధంచేత మానవ జన్మను పొందిన జీవుడు శివచైతన్యంతో శివసాయుజ్యము పొందుచున్నాడు.
దీనికి మానవ ప్రయత్నం అవసరం. జీవుని పూర్వజన్మ సంస్కారం చేత శివభక్తి అలవడుతుంది. శివభక్తి నుండి ప్రేమ, ప్రేమ నుండి సేవ, సత్సంగం, గురువు, జ్ఞానం, తుదకు ముక్తి లభిస్తోంది. కావున పంచాక్షరి మంత్రయుక్తమైన శివపూజ, లింగారాధన ముక్తికి, మోక్షానికి మార్గము.

Advertisement

తాజా వార్తలు

Advertisement