పరమ పవిత్రమైన కార్తీకమాసంలో ఏకాదశ రుద్రుల దర్శనం… సకల పాప హరణం ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని 9 గ్రామాల్లో, అయినవిల్లి మండలం నేదునూరు, అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మిలలో వేంచేసి ఉన్న 2 ఈశ్వరులను ఏకాదశా రుద్రులు అంటారు. ఈ ఏకాదశారుద్రులను కార్తీకమాసం లో దర్శించుకొంటే ముక్తి కలుగుతుందని పునర్జన్మ ఉండ దని భక్తుల నమ్మకం. వీరిని దర్శించుకోవాలంటే సూర్యో దయం నుండి సూర్యాస్తమయం అవుతుంది. కానీ ఈ ఏకాదశారుద్రులను ఏకకాలంలో దర్శించుకోవాలంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి మరునాడు కనుమరోజున అంబాజీపేట మండలంలోని మొసలపల్లి శివారు జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థంలో సుసాధ్యమవుతుంది. బహుశా దేశం లోనే ఏకాదశారుద్రులు ఒకేచోట కలవడం ఎంతో అరుదని వేద పండితులు చెపుతున్నారు. ఈ ఏకా దశ రుద్రులలో ఎంతో శక్తివంతమైన ఈశ్వరునిగా శ్రీ బాలాత్రిపురసుందరి సమేత వ్యాఘ్రేశ్వరునిగా ప్రతి నిత్యం బిల్వార్చనలు అందుకుంటున్నాడు.
1. విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం
(శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి)
పూర్వం ఒక బ్రాహ్మణుడు శివపూజకు పత్రి తీసుకు రావడానికి అడవికి వెళతాడు. అక్కడ ఒక పెద్దపులి అతన్ని తరుముతూ వస్తే ఎదురుగా కనిపించిన చెట్టు ఎక్కేస్తాడు. ఆ చెట్టు మారేడు చెట్టు. పులి ఆ చెట్టు కిందనే కూర్చుని వుంటుంది. చీకటి పడిపోతుంది. రాత్రి అయినా పులి చెట్టు కింద, బ్రాహ్మణుడు చెట్టుపైన. ఆ బ్రాహ్మణుడు శివుడిని తలుచుకుంటూ తాను కూర్చున్న చెట్టు మారేడుదళాలను కోసి రాత్రి తెల్లవార్లూ పులిపైన వేస్తాడు. తెల్లవారి చూసే సరికి చెట్టుకింద పులి వుండదు. బ్రాహ్మణుడు కిందకి దిగి చూసేసరికి అక్కడ శివలింగం వుంటుంది. మారేడు దళా లతో శివుని ధ్యానిస్తూ అర్చన చేయడం వల్ల ఆ పెద్ద పులి (వ్యాఘ్రము) శివలింగ రూపాన్ని పొందిందని కథనం. అప్పటి నుండి ఆ పరమేశ్వరుడు వ్యాఘ్రలింగేశ్వర స్వామి గా పూజలందుకుంటున్నాడు.
2. మహాదేవరుద్రుడు- కె.పెదపూడి
(శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామి)
విశ్వామిత్రుని కలిసిన మేనక ఇచట ఒక శివలింగమును ప్రతిష్ఠించి పూజించగా స్వర్గమునకు పోవ కరుణించెనని కథనము. మేనకచే ప్రతిష్ఠింపబడుటచే మేనకేశ్వరస్వా మి అని పిలువబడెను.
3. త్రయంబకేశ్వరుడు- ఇరుసుమండ
(శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి)
శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం తరువాత అయోధ్యకు వెళ్తుండగా ఇరు సుమండ వద్ద వారి పుష్పక విమానం నిలిచిపోతుంది. శ్రీరాముడు ఇక్కడ శివలింగం ప్రతిష్టించి, పూజించి ముందుకు కదిలారు. రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనందరామేశ్వరుడని పిలువ బడెను.
4. త్రిపురాంతక రుద్రుడు- వక్కలంక
(శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి)
దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివు డు సం#హరించి వక్కలంక గ్రామమునందు శివలింగ రూపంలో ఆవిర్భవించెనని కథనము.
5. త్రికాగ్నికాల రుద్రుడు- నేదునూరు
(సర్వమంగళా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వరస్వామి)
మూడు అగ్నులయందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి శివుడు లిం గరూపమును పొందుటచే త్రికాగ్ని కాలునిగా పిలువబడి అగస్త్య మ#హర్షిచే నేదునూరు గ్రామ మున ఈ శివలింగము ప్రతిష్ఠింపబడినది.
6.కాలాగ్ని రుద్రుడు- ముక్కామల
(బా లాత్రిపురసుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి)
రావణ సంహారం తరువాత అగస్త్య మహా ముని అయో ధ్యకేగుచున్న రామునిచే ఈ ప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజే సెను. రాఘవునిచే ప్రతిష్ఠింపబడుట వల్ల రాఘవేశ్వరస్వామిగా పిలువబడెను.
7.నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి
(శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వరస్వామి)
#హలమును శివుడు తన కంఠమునందు నిక్షిప్తము చేసి కొని నీలకంఠుడైనాడు. ఆ గరళకంఠుడే మొసలపల్లి గ్రామ మునందు లింగరూపమున ఆవిర్భవించెను. కొలిచిన వారికి అనంత భోగాలను అందించేవాడు. అనేక భోగు లను (పాములను) ఆభరణములుగా ధరించినవాడు అగుటవల్ల అనంత భోగేశ్వరస్వామిగా కొలువుదీరాడు.
8. మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి
(శ్యామలాంబా సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి)
శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యు ముఖము నుండి రక్షించెను. ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భ వించి చెన్నమల్లేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు ఆ పరమశివుడు.
9. సర్వేశ్వర రుద్రుడు- గంగలకుర్రు అగ్రహారం
(ఉమాపార్వతీ సమేత శ్రీవీరేశ్వర స్వామి)
శివాంశ సంభూతుడైన వీరభద్రుడు దక్షయజ్ఞమును ధ్వంసంచేస్తాడు. ఆ ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వర స్వామి గా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారము నందు వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను.
10. సదాశివ రుద్రుడు- గంగలకుర్రు
(సర్వమంగళా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి)
లింగ రూపమును ధరించిన శివుని తల చూచితినన్న అబద్ధంవల్ల బ్రహ్మను పూజాపునస్కారములు లేకుండు నని శపించి విష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. ఆ లింగధారి యైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేదపండి తులైన బ్రా#హ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను.
11. శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు
(శ్రీబాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు)
విష్ణుమూర్తి పూజకు సంతసించిన మహాదేవుడు విష్ణు వుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆ మహాదేవు డు పుల్లేటికుర్రు గ్రామమునందు లింగరూపమున ఆవిర్భ వించెను. (పుల్లేటికుర్రు ‘పుండరీకపురము’) వ్యాఘ్రేశ్వర మునందు వ్యాఘ్రేశ్వరస్వామి ఉండుటచేత ఇచట అభినవ వ్యాఘ్రేశ్వరస్వామిగా భక్తుల పూజలందుకుంటున్నాడు.
– సి.ఎన్.మూర్తి, 8328143489