”ర మతత్త్వం జీవతత్త్వంగా, జీవన తత్త్వంగా, జీవిత తత్త్వంగా, ప్రతి మనిషిలోను, మనసులోను పరిమళించి, పరిమళాలు వెదజల్లే ప్రతి క్షణమూ శ్రీరామ సంబరమే. శ్రీరామ సంరంబమే.” అన్నారో మహనీయుడు.
జీవిత తత్త్వానికి అవతార తత్త్వాన్ని అనుసంధానం చేసి, అన్వయం చేసే లోతైన సందేశాత్మక అద్వితీయ నిర్వచనమిది.
మాటలలో చేతలలో నడకలో నడతలో ధ్యాసలో శ్వాసలో జీవితం లోని అడుగడుగునా, అణువణువునా మనం సత్యమయం కావాలి. ధర్మమయం కావాలి. కర్తవ్య మయం కావాలి. తేజోమయం కావాలి. ప్రేమమయం కావాలి. అప్పుడు జగత్తంతా స్వర్ణ మయం అవుతుంది. ”రామ మయం” అవుతుంది. ”రామ మయమై” నిలుస్తుంది.
రామరావణ సంగ్రామం అనంతరం సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరాము డు అయోధ్యకు వస్తున్నాడు. అప్పుడు రామునికి ఓ సందే#హం వచ్చిం ది. తమ్ముడు భరతునితో పదునాలుగు సంవత్సరాల క్రితం కుదిరిన ఒప్పందం ప్రకారం రాముడు అయో ధ్యకు వెళ్తున్నాడు. పదునాలుగు ఏళ్ళలో భరతుని మనసు ఏ మాత్ర మైనా మారిన పక్షంలో, రాముడు అయోధ్యకు వెళ్ళడం ధర్మం కాదనే ది రాముని అభిప్రాయం. భరతుని మనసు మారి ఉండవచ్చునేమో అనే ది శ్రీరామునికి వచ్చిన సందేహం. సందే#హ నివృత్తి కోసం విషయం తెలుసుకోమని హనుమంతునికి ఆ పని అప్పచెప్పాడు శ్రీరాముడు. హనుమంతుడు భరతుని వద్దకు వెళ్లి, అంతా పరిశీలించి శ్రీరాముని దగ్గరకు వస్తాడు. ”రామా! నాకు భరతుని దగ్గర కూడా ”రాముడే” కనిపించాడు. అక్కడ అంతా రామ మయమై ఉన్నది.” అని రామునికి చెబుతాడు హనుమ.
హనుమకు అక్కడంతా రామమయంగా కనిపించినప్పుడు, భరతు నికి అస్థిత్వమే ఉండదు. భరతుడు అస్థిత్వాన్ని కోల్పోయిన తర్వాత, భరతునికి కోరిక ఎక్కడ ఉంటుంది?
జగత్తంతా రామమయం అవడం అంటే యిదే!!
”రామో విగ్రహవాన్ ధర్మ:” ధర్మం విగ్రహ ఆకారం చెందితే, ఆ ఆకార రూపం రాముడు అని అర్థం. ధర్మమే రాముని రూపం అయి నప్పుడు, ”ధర్మం అంటే ఏమిటి? ఏది ధర్మం?”అనే ప్రశ్నలు కలుగు తాయి. కాబట్టి ఆ ప్రశ్నలను విచారణ చేయాలి. విశ్లేషణ చేయాలి.
ఇతరులు నీకేది చేసినట్లయితే నీకు కష్టం అవుతుందో, అపకారం అవుతుందో, అది నువ్వు యితరులకు చేయకపోవడమే ధర్మం. ఇతరులు నీకేది చేస్తే సంతోషం అవుతుందో, ఉపకారం అవుతుందో, నువ్వు యితరులకు అదే చేయటం ధర్మం.
”శ్రీరాముడు చేసినదంతా ధర్మం. చేయనిది అధర్మం” అని అంటారో మహనీయుడు. ఓ గురువు వద్దకు ఓ శిష్యుడు వచ్చాడు. ”నాకు మంచివాడుగా, ధర్మపరునిగా మారిపోవాలని ఉంది. ఉపా యం చెప్పండి.” అని అడిగాడు. ”అదేమంత కష్టమైన పనేమీకాదు నాయనా. సులభమైనదే. దానికోసం నువ్వో పనిచేయాలి. ఈ క్షణం నుంచి నువ్వు శ్రీరాముడిలా మారిపో. శ్రీ రామచంద్రుడివి అయిపో” అని సలహా ఇచ్చారు గురువు గారు.
చాలా సులభమైనదిగా కనిపించినా, అనిపించినా, శ్రీరామునిలా మారిపోవటం ఆచరణలో ఎంత కష్టమైనదో, మాటలలో మనం చెప్ప లేం. అంతటి కష్టమైన దానిని ఎంతో యిష్టంగా ఆచరించి చూపిన అవతార పురుషుడు శ్రీరాముడు. అందుకనే శ్రీరాముణ్ణి అంతగా కొలు స్త్తున్నాం. కొనియాడుతున్నాం. ఇక శ్రీరాముని కర్తవ్యదీక్ష. ఓ కొడుకు గా, ఓ భర్తగా, ఓ అన్నగా, ఓ చక్రవర్తిగా… యిలా తాను ఏ పాత్రలో ఉంటే, ఆ కర్తవ్యాన్ని ఆదర్శప్రాయంగా నిర్వర్తించిన, అద్వితీయ అనంత గుణసంపన్నుడు శ్రీరాముడు.
తన కర్తవ్యాన్ని మనిషి నిండు హృదయంతో, స్వచ్ఛంగా నిర్మలంగా నిబద్ధతతో నిర్వర్తించాలి అనే పాఠాన్ని, తన జీవనం ద్వారా లోకానికి చాటిచెప్పిన అవతార మూర్తిత్త్వం శ్రీరామునిది.
ప్రజల నుంచి వసూలు చేసిన సుంకాన్ని చక్రవర్తికి చేరవేయడం ఉద్యోగి కర్తవ్యం. అయితే ప్రజలనుంచి వసూలు చేసిన ప్రభుత్వ ధనం తో, శ్రీరామునికి ఆలయం కట్టి, తన ఉద్యోగ కర్తవ్యాన్ని విస్మరించాడు రామదాసు!
అందుకనే ఏమో…. తానీషాకు మాత్రమే దర్శనమిచ్చి రామదాసుకి దివ్యదర్శన భాగ్యం అనుగ్రహంచలేదు శ్రీరాముడు.
అవును! కర్తవ్యం విస్మరించిన వ్యక్తి, అతడెంతటి అధికుడైనా, మహా భక్తుడైనా భగవంతుడు దివ్య దర్శనమిచ్చి అతడిని కరుణించడనే, ప్రోత్సహంచడనే భగవత్తత్వాన్ని రామదాసు కథ అన్యోపదేశంగా మన కు బోధిస్తుంది.
రామావతార ”అవతార మూర్తిత్వం” మనకు స్పూర్తివంతం కావా లి. దీప్తివంతం కావాలి. మూర్తివంతం కావాలి.
అప్పుడు ప్రతి జీవితం రసవంతమవుతుంది. కాంతివంతమవు తుంది. నిత్యవంత మవుతుంది. సత్యవంతమవుతుంది. ప్రేమమయ మవుతుంది. సర్వం ప్రేమమయమై, జగత్తంతా రామమయ పూజితమ వుతుంది. స్వర్ణమయ శోభితమవుతుంది.
సర్వం స్వర్ణమయ శోభితం!
Advertisement
తాజా వార్తలు
Advertisement