మన పెద్దలు, పండితులు ఈ అనంత సృష్టి అంతా బ్రహ్మదే అంటుంటారు. అంటే ‘సర్వం బ్రహ్మమయం’ అని అర్థం. అంటే ఏమిటో తెలుసుకుందాం.
మానవ సృష్టికి మొదటి మానవుడు- బ్రహ్మ.
ప్రజలందరికీ తండ్రి, ప్రజాపిత ఆ బ్రహ్మ దేవుడు.
అన్నింటికంటే గొప్ప విద్య- బ్రహ్మ విద్య
బ్రహ్మ జ్ఞానాన్ని ఆచరించేవాడు. బ్రహ్మచారి.
బ్రహ్మజ్ఞానాన్ని కర్మేంద్రియాల ద్వారా చూపడమే బ్రహ్మచర్యము.
అన్నిటికంటే గొప్ప ముహూర్తం- బ్రహ్మ ముహూర్తం.
అన్ని ఉత్సవాలలో కెల్లా గొప్పది- బ్రహ్మోత్సవం.
అతి గొప్ప ప్రయత్నం- బ్రహ్మ ప్రయత్నం
ఎవరూ చెరపలేని రాత- బ్రహ్మరాత.
ఈ ముడిని ఎవరు విప్పలేరు – బ్రహ్మముడి.
ఈ అస్త్రానికి తిరుగులేదు – బ్రహ్మాస్త్రం.
అతి చెవుడు ఉంటే – బ్రహ్మ చెవుడు.
ఏదైనా గొప్ప రహస్యం- బ్రహ్మ రహస్యం
ఎవరికైనా గొప్పగా ఆహ్వానం పలికితే ఏమి పట్టారు అంటారు? – బ్రహ్మరథం
గొప్ప రాక్షసిని ఏమంటారు?- బ్రహ్మ రాక్షసి
ఏదైనా తినేది రుచిగా ఉంటే ఏమని అంటారు? – బ్రహ్మాండం
బాలవాక్కుని ఏమంటారు? బ్రహ్మవాక్కు
ఏ దేవుడు దిగివచ్చినా వీరు మారరు అంటారు? – బ్రహ్మదేవుడు
సరస్వతికి మరొక పేరు – బ్రహ్మ మానస పుత్రిక
స్వర్గానికి మరొక పేరు బ్రహ్మ పగలు
నరకానికి మరొక పేరు- బ్రహ్మ రాత్రి
ఆనందంలోకెల్లా గొప్ప ఆనందం- బ్రహ్మానందం
అన్నింటికంటే గొప్ప ఉపదేశం- బ్రహ్మోపదేశం
అన్నింటికంటే పెద్ద నది- బ్రహ్మ పుత్రానది
బ్ర#హ్మ తత్వము బోధించే వారు- బ్రాహ్మణులు.
ఇలా అన్నిటా నింటినవాడు ఆ బ్రహ్మదేవుడు. అందుకే సర్వం బ్రహ్మ మయం.