Thursday, November 21, 2024

సర్వ పాపహరం నర్మదా పుష్కర స్నానం

బృహస్పతి (గురు గ్రహము) మేషాది, ద్వాదశ రాశులలో సంచ రించేటప్పుడు ప్రతి రాశి ప్రవేశ సమయములో 12 రోజులు పుష్కరుడు నదిలో నివసించేట్లు బ్రహ్మ దేవుడు నిర్ణయించాడు. మొదటి 12 రోజులను ఆదిపుష్కరమని, చివరి 12 రోజులను అంత్య పుష్క రమని వ్యవహరిస్తారు. మిగిలిన కాలమునందు మధ్యాహ్న సమయము లో రెండు ముహూర్తాల కాలము ఆ నదిలో పుష్కర ప్రభావముంటుంది.
దేవ గురువు బృహస్పతి మే 1వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12.56 నిమిషాలకు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. మేషే గంగా వృషేరౌవా… అన్న ప్రమాణాన్ని అనుసరించి మే 1 నుంచి రేవానదీ పుష్కరాలు ప్రారం భమయ్యాయి. రేవా నదిని నర్మదానది అని కూడా అంటారు. మే 12వ తేదీ వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. ఈ 12 రోజుల కాలం అత్యం త పవిత్రమైనదిగా పరిగణిస్తారు. భారతదేశంలోని పన్నెండు పవిత్ర నదులలో ఒకటైన నర్మదా నదిని పూజించేందుకు అత్యంత విశిష్టమైనవి ఈ పన్నెండు రోజులు. నర్మదా నదిలో స్నానం చేయడం, దానధర్మాలు చేయ డం వల్ల ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దేశంలో మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల గుండా ప్రవ#హంచే రేవానది భారతదేశంలో 5 పొడవైన నదులలో 5వ స్థానంలో వుంది.

నర్మదానది ప్రాశస్త్యం

శ్లో. రేవాతీరే తప: కుర్యాత్‌, మరణం జాహ్నవీ తటే
దానం దద్యాత్‌ కురుక్షేత్రే, గౌతమీ మ్యాంత్రితయం పరం.

నర్మదా నదీ తీరంలో తపస్సు, గంగానదీ తీరంలో మరణం, కురుక్షే త్రంలో దానము విశేష ఫలప్రదములని (ముక్తికారకములని) ఆర్ష వాక్య ము. గోదావరి నదీ స్నానం వలన ఈ మూడింటి ఫలం కలుగుతుందని భా వము. నర్మదానది అమర కంటకం వద్ద కపిలధార నుండి జనించి వింధ్య పర్వత దేశముల గుండా పశ్చిమ వాహని అయి నర్మదానదికి పుష్కర వైభవం ప్రారంభమైంది.
అమరేశ్వర క్షేత్రము నర్మదా తీరమున గలదు. పద్మపురాణము, హరి వంశము మొదలైన పురాణములందు నర్మదా నది ప్రస్తావన ప్రముఖము గా కనిపిస్తుంది. నర్మద అన్ని నదులలో శ్రేష్టమైనది. సర్వపాపములను పోగొట్టి చరాచర జగత్తును తరింపజేయును. సరస్వతి మూడు రోజులలో, ఏడు రోజులలో యమున, గంగ ఒక రోజులో మనలను పాపవిముక్తులను చేస్తాయి. అయితే నర్మద దర్శన మాత్రము చేతనే పరిశుద్ధులను చేస్తుందని పురాణములలో అనేక విధముల నర్మదా ప్రాశస్త్యము వివరింపబడినది.
ఈ నదీ పుష్కరానికి వెళ్లాలనుకున్న వాళ్ళు మధ్యప్రదేశ్‌ రాష్ట్రములో ని ఉజ్జయినీ మహాక్షేత్రమునకు వెళ్ళి అక్కడ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శనము, మహాకాళీ శక్తి పీఠమును, ఇతర దర్శనీయ ప్రదేశములను వీ క్షించి, ఇక్కడనుండి ఇండోర్‌ మీదుగా అమరేశ్వర క్షేత్రమునకు చెరి ఓంకా రేశ్వరుని, అమరేశ్వరుని సేవించుకుని నర్మదా పుష్కర స్నానమాచరిస్తారు.

ప్రముఖ దర్శనీయ ప్రదేశాలు

- Advertisement -

అమరకంటక్‌ ఆలయం, ఓంకారేశ్వర్‌ ఆలయం, చౌసత్‌ యోగిని ఆల యం, చౌవిస్‌ అవతార్‌ ఆలయం, మహశ్వర్‌ ఆలయం, నెమవార్‌ సిద్ధేశ్వర్‌ మందిర్‌, భోజ్పూర్‌ శివాలయం చాలా పురాతనమైనవి, ప్రసిద్ధమైనవి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర్‌ నర్మదా నది ప్రవ హస్తున్న ప్రదేశాలలో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహస్తారు. భక్తుల కోసం అనేక స్నాన ఘా ట్లు ఏర్పాటు చేస్తారు.
నర్మదా నదికి హందూ మతంలో లోతైన ఆధ్యాత్మిక ప్రా ముఖ్యత కలిగి ఉంది. శివుని సన్నిధి ద్వారా పవిత్రం చేసిన నదిగా భావిస్తారు. భక్తులు త మ పాపాలను ప్రక్షాళన చేసేందుకు పవిత్ర జలాలలో పవిత్ర స్నానాలు చేస్తారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు, భక్తులు నర్మదా నదిలో పుష్కర స్నా నాలు ఆచరిస్తారు. పూజలు, పిండ ప్రదానాలు, నైవేద్యాలు సమర్పిస్తారు.
ఈ నదీ ప్రవాహం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఘాట్ల వద్ద నది లోతు ఎక్కువగా ఉండదు. భక్తులు సులభంగా స్నానాలు చేయవచ్చు.
ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటితీర్థఘాట్‌ అన్ని ఘాట్లలో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇక్కడ స్నానం చేస్తే అనేక తీర్థయాత్రల పుణ్య ఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. ఇంక నూ చక్రతీర్థ ఘాట్‌, గోముఖ ఘాట్‌, భై రోన్‌ ఘాట్‌, కేవల్‌ రాం ఘాట్‌, బ్రహ్మ పురి ఘాట్‌, సంగం ఘాట్‌, అభయ్‌ ఘాట్‌ అని ఉన్నవి. నీరు నారాయణ స్వరూపం కనుక ఆ స్పర్శచే పాపాలు స్నానం ద్వారా తొలగిపోతాయని విశ్వ సిస్తారు. తీర్ధ స్నానం ఉత్తమం, దాని కంటే నదీస్నానం శ్రేష్టం. పుష్కర సమ యంలో నదీస్నానం ఉత్తమోత్తమం. బాణలింగాలుగా పిలువబడే గులకరా ళ్ళు ఈ నదిలో లభిస్తాయి. ఈ ప్రాం తం వారు నర్మదా కే కంకేర్‌ ఉత్తే శంకర్‌ (శివుడు గులక రాళ్ళలో ఉన్నాడు) అని విశ్వసిస్తారు. ఆదిశంకరాచార్యులు గురువైన గోవింద భగవత్పాదుల వారి ని ఈ నది ఒడ్డున గల ఓంకారేశ్వర్‌లోనే కలిశారు. గోవిందభగవత్పాదుల వారు నర్మదా నదీ తీరముననే తపస్సు గావించినట్లు ఐతి#హ్యము. గోదా వరి తీర్ధ మహాత్య వర్ణనలో నర్మ దానదీ ప్రస్తావన చేయబడింది.

పుష్కర ఘాట్లు

నర్మదా నది పుష్కరాల్లో భక్తులు ఈ ఘాట్లలో పవిత్ర స్నానాలు ఆచరించవచ్చు. కోటి తీర్థ ఘాట్‌, చక్ర తీర్థ ఘాట్‌, గౌముఖి ఘాట్‌, భైరన్‌ ఘాట్‌, కేవల్రామ్‌ ఘాట్‌, నగర్‌ ఘాట్‌, బ్రహ్మపురి ఘాట్‌, సంగం ఘాట్‌, అభయ్‌ ఘాట్‌. నర్మదానదికి చెందిన తీర్థములలో ఓంకార, కపిలా, సంగమ, అమరెవ తీర్థములు స్మరించినంతనే పాపములు నశించి అఖండ పుణ్యము కలుగునని విశ్వాసం. స్నాన యోగ్యమైన పుణ్య క్షేత్రాలు నాగేశ్వరం, ఓంకారేశ్వర్‌, అమరేశ్వర్‌, జబ్బల్పూర్‌, బరూచ్‌, హోసుం గాబాద్‌ మొదలైనవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement