”ఇహపర శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానమే ధర్మం! అన్ని మతాలు ఒక్కటే! అందరి మహ నీయుల ప్రవచన సారాంశం ఒక్కటే! అందరు మతస్తులు ఆ పరమాత్మ బిడ్డలమే! అందరిలో ప్రవ హంచేది ఒకే రక్తం. అందరిలో సజీవమై ప్రకాశించే ఆత్మ తత్వం ఒక్కటే. హందువుల దైవమైన రాముడు, ముస్లింల దైవమైన అల్లా ఒక్కరే. ఆ పరమాత్ముడిని చేరేందుకు వివిధ మార్గాలే మతాలు. దారులు వేరైనా, చేరబోయే గమ్యం ఒక్కటే. ఆందుకని మీలో మీరు కలహంచుకోవడం మానండి” అని శ్రీ సాయినాథులు తన భక్తులకు ప్రబోధించేవారు. మానవులలో దట్టంగా పేరుకొనిపోయి వున్న మత మౌఢ్యాన్ని తొలగించి, వారికి నిజమైన ఆధ్యాత్మిక ధర్మం తెలిపి, వారిని జ్ఞానవంతులను చేయ డానికే శ్రీ సాయినాథులు అవతరించారు.
ఒకసారి శిరిడీలో ఒక ముస్లిం భక్తుడు తనకు సంతానం కలిగితే శిరిడీకి వచ్చి మిఠాయిని పం చుతానని మొక్కుకున్నాడు. బాబా అనుగ్రహం వలన అతని కోరిక ఫలించింది. పండంటి మగ సంతానం కలిగింది. కోరిక నెరవేరిన నేపధ్యంలో శిరిడీ వచ్చి మిఠాయి పంచడానికి శ్రీ సాయినాథుల అనుమతి కోరాడు ఆ ముస్లిం. బాబా చిరునవ్వు నవ్వి ‘వెళ్ళి మారుతీ ఆలయంలో మిఠాయిని పంచు” అని అ న్నారు. ఆ ముస్లిం బాబా మాటలకు ఆశ్చర్యపడి ”నేను ముస్లింను కదా! హందువుల ఆలయంలో మిఠాయిని ఎలా పంచగలను?” అని అడిగాడు. అందుకు బాబా నవ్వి ”ఇటీవల జరిగిన యుద్ధం లో ఆంజనేయుడు అల్లాను ఓడించాడు” అని మ రింత కోపంతో ”ఏమి ముస్లింవిరా నువ్వు? ఇదేనా ఖురానును చదివి నువ్వు అర్ధం చేసుకున్నది? వెళ్ళి మారుతీ ఆలయంలో మిఠాయిని పంచు” అని ఆజ్ఞాపించారు. ఇక చేసేది లేక ఆ ముస్లిం భక్తుడు మారుతి ఆలయంలో మిఠాయిని పంచి తన మొక్కును తీర్చుకున్నాడు. నామ, రూప, గుణ రహతుడు, సర్వగతుడు, విశ్వవ్యాప్తుడైన భగవం తునిపై భక్తికి మత భేదం అడ్డుకారాదని శ్రీ సాయి మనకు కళ్ళకు కట్టినట్లుగా తెలియజేసారు.
మత మార్పిడిని శ్రీ సాయి తీవ్రంగా నిరసించేవారు. విశ్వానికి సృష్టి, స్థితి, లయ కారకుడైన భగ వంతుడు ఒక్కడే! సందర్భానుసారంగా వివిధ కాలాలలో వివిధ రూపాలను ధరించి తన అవతార కార్యం గావించేవాడు. అన్ని మతాలు ఆ భగవంతుడిని చేరడానికే పుట్టాయి. సర్వ మానవ సమాన త్వాన్ని ఉద్బోధించే శ్రీ సాయి భక్తులకు మతం మార్చుకోవడం అనవసరం అని చెప్పేవారు. శ్రీ సాయికి కూర్మి భక్తుడైన బడేబాబా ఒక హందువును ముస్లింగా మార్చి శ్రీ సాయి దర్శనానికి తీసుకు వచ్చి తాను చేసిన ఘనకార్యాన్ని వివరించాడు. అప్పుడు శ్రీ సాయి ఉగ్రులై ఆ యువకుని చెంప పగి లేలా కొట్టి ”నీ తండ్రిని మార్చుకున్నావట్రా!” అని అరిచారు. తన మతాన్ని మార్చుకోవడం తండ్రిని మార్చుకున్నంత పాపమని బాబా వారి అభిప్రాయం.
మరొక సందర్భంలో సాయి భక్తాగ్రేసరుడైన దాదాకేల్కర్‌ను సాయి పిలిచి కొంత డబ్బిచ్చి మాంసం కొని తీసుకురమ్మన్నారు. దాదాకేల్కర్ సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు. సదాచార సంపన్నుడు. రక్తం చూస్తే చాలు కళ్ళు తిరిగి క్రింద పడిపోతాడు. అటువంటి వ్యక్తి తన సమర్ధ సద్గురువైన సాయి చెప్పిన వెంటనే నిస్సంకోచంగా బయలుదేరాడు. మధ్యమార్గంలో అతనిని వెనక్కు పిలిచి ఇంకెవరినైనా పంపించమని చెప్పారు శ్రీ సాయి. ఇంకోసారి మశీదులో మాంసం పలావు వండుతున్న శ్రీ సాయి దాదాకేల్కర్‌ను పిలిచి ”పలా వు ఎలా వుందో రుచి చూడు” అని అడిగారు. కేల్కర్ చూడకుండానే ”చాలా బావుంది” అని అన్నాడు. సాయి నవ్వుతూ ”రుచి చూడకుండానే బాగుందంటావేం?” అంటూ కేల్కర్ చేతిని బాండీలోనికి తోసి ”సరిగ్గా వుడికిందో లేదో చూడు, ఆచారం గురించి భయపడకు” అని ప్రేమగా అతనిని గిల్లారు. ఆచార వ్యవహారాలు శరీరానికేగాని ఆత్మకు లేవు. సాయి తన ఆజ్ఞలను శిష్యులు ఏ మేరకు పాటి స్తున్నారో పరీక్ష చేసేందుకే నిషిద్ధమైన పనులను పురమాయించేవారు. గురువు పాదాలకు సర్వశ్య శరణాగతి చేసే గురువు ఆజ్ఞను తూ.చ. తప్పక పాటించే భక్తులకే గురువు అనుగ్రహ ఫలం శీఘ్రంగా లభిస్తుంది. గురువు ఆజ్ఞలను తన స్వంత బుద్ధితో ఆలోచించి తర్క, వితర్కాలను చేసే వారికి ఎన్ని జన్మలకైనా అను గ్ర#హం లభించదు.
సర్వమానవ సమానత్వమేసాయి లక్ష్యం!
Advertisement
తాజా వార్తలు
Advertisement