Tuesday, November 26, 2024

సర్వ దుఃఖ హరణంద్వారకామాయి ప్రవేశం

కలియుగ దైవం, భక్తుల పాలిట ఆర్తత్రా యపరాయణుడుగా అశేష భక్త జనావళిచే పూజ లందుకుంటున్న శ్రీ సాయినాథులు తనకు అన న్య చింతనతో సర్వశ్య శరణాగతి ఒనరించిన భక్తులను ఎళ్ళవేళలా రక్షన కవచం అందించి కాపాడుతుండెడివారు. తన భక్తులకు రాబోయే ఆపదలను ముందుగానే కనిపెట్టి, వారికి తగురీ తిన హచ్చరికలు చేసి, అటు పిదప వారిని ఆ ఆప దల నుండి రక్షించి భక్తులపై తనకు గల అవ్యా జ్యమైన ప్రేమను శ్రీ సాయినాథులు కనబరి చేవారు. అటువంటి ఒక లీలను మరోసారి స్మరిం చుకుందాము.
బాబాకు కూర్మి భక్తుడైన సర్దార్‌ కాకా సాహ బ్‌ మిరీకర్‌ పుత్రుడైన బాలాసాహబ్‌ మిరీకర్‌ కోపర్గావ్‌ తాలూకాకు మామలతదారుగా వుండే వాడు. ఒకసారి అతను చితలీ గ్రామ పర్య టనకు వెళుతూ మధ్య మార్గంలో బాబాను దర్శించ డానికి శిరిడీకి వచ్చి, మశీదుకు పోయి బాబాకు నమస్కరించాడు. బాబా అతనిని కుశల ప్రశ్నలు వేసి ”నీవు చాలా జాగ్రత్తగా వుండవలెను. నీవు ఇప్పుడు కూర్చున్న ప్రదేశం మన ద్వారకామ యి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చుంటారో వారిని ఆ తల్లి అన్ని కష్ట నష్టముల నుండి కాపాడుతుం ది. ఆమె ఒడినాశ్రయించిన వారికి అన్ని చింతన లు దూరమౌతాయి” అని అన్నారు. అటు తర్వా త మిరీకర్‌కు ఊదీనిచ్చి తన ఎడమ చేతిని మూసి కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగ వలెనుంచి ”నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియునా? అదే సర్పం. ఆతను మిక్కిలి భయంకరమైనవాడు. కాని మన ఆయీ (అమ్మ) బిడ్డలను అతనేం చెయ్యలేడు, నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా రా !” అని అన్నారు.
అక్కడున్నవారికి, మిరీకర్‌తో సహా బాబా మాటలు బోధపడలేదు. బాబాను అడిగి తెలుసుకుందామని కుతూహలపడ్డారు గాని ఆయనను అడిగే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది. బాబా తర్వాత శ్యామాను పిలిచి బాలా సాహబ్‌తో చితలీకి వెళ్ళి ఆనందించమని చెప్పారు. బాలాసా హబ్‌ శ్యామతో కలిసి బాబా వద్ద సెలవు తీసుకొని టాంగాలో బయల్దేరాడు. వారిద్దరూ రాత్రి తొమ్మి ది గంటల ప్రాంతంలో చితలీ గ్రామం చేరారు. ఆఫీసులో పనిచేసే వారు ఎవ్వరూ రానందున వారు ఆంజనేయాలయములో బస చేసారు. ఇద్దరూ భోజనాది కార్యక్రములను పూర్తి చేసు కొని ఆలయంలో ఒక మూల కూర్చొ ని మాట్లాడుకోసాగారు. చాప పైని కూర్చొని మిరీకర్‌ వార్తాపత్రిక చదు వుకొంటుండగా మెల్లగా అతని అంగ వస్త్రముపై ఒక నల్లటి విష సర్పం చేరింది. అయితే దానినెవ్వరూ చూడ లేదు. అటువంటి విష సర్పం కరిస్తే ఇక మరణమే శరణ్యం. దీని కాటుకు మందులు కూడా లేవు. విధి రాత ప్రకారం బాలా సాహబ్‌ మిరీకర్‌ ఆ సమయంలో ఆ పాము కాటుకు మర ణించవలసి వుంది. కానీ మిరీకర్‌ బాబా భక్తుడు. పైగా ఈ ఆపద గురిం చి బాబా ఇంతకు ముందే మిరీకర్‌కు చెప్పి వున్నారు. ఇక తన భక్తుడిని బాబా ఎలా రక్షించారో చూడండి. ఆ నల్లటి విష సర్పం నెమ్మదిగా బుస కొట్ట సాగింది. పడగను విప్పి మిరీ కర్‌ను కాటు వేయబోయేంతలో ఎక్కడో దూరం గా వున్న నౌకరు ఆ బుస ధ్వనిని విని దగ్గరగా వచ్చి, పామును చూసి ”పాము, పాము” అం టూ పెద్దగా కేకలు పెట్టాడు. బాలా సాహబ్‌, శ్యామా లిద్దరికీ ముచ్చెమటలు పోసాయి. గడ గడ వణకడం ప్రారంభించారు. ఆ నౌకరు కర్రను తీసుకొని వచ్చాడు కానీ ఏం చెయ్యలేకపోయా డు. ఎందుకంటే ఆ సర్పం సరిగ్గా మిరీకర్‌ భుజం పై వుంది. ఆ గందర గోళానికి ఆ పాము మిరీకర్‌ భుజంపై నుండి దిగడం ప్రారంభించింది. పక్క కు వెళ్ళాక కర్రలతో ఆ పామును కొట్టి చంపేసారు. శ్రీ సాయినాథులు ఈవిధంగా తన భక్తునికి రా బోయే ఆపదను ముందుగానే హచ్చరించి తద్వా రా వానిని ఆ ఆపద నుండి కాపాడారు. తనను రక్షించి తనకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చిన శ్రీ సాయికి మిరీకర్‌ వేన్నోళ్ళ కృతజ్ఞతలను అర్పించి ఆనాటి నుండి శ్రీ సాయి ఆరాధనను తీవ్రతరం చేసాడు. అంతేకాక బాబానే తన సర్వస్వంగా భావించి తన జీవితాన్నంతటినీ బాబా సేవకే అంకితం చేసాడు.
సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు.

Advertisement

తాజా వార్తలు

Advertisement