గీత మనం పాటించవలసిన ధర్మసూక్ష్మాలు తెలియచేస్తుంది. గీత మోక్ష మార్గాన్ని సూచిస్తుంది. మనకు గీత అనగానే భగవద్గీత మాత్రమే స్ఫురిస్తుంటుంది. భగవద్గీతే కాకుండా ఇంకా మనకు గురుగీత, అగస్త్యగీత, ఉద్ధవ గీత వంటివి ఉన్నాయి. మహాభారతంలో కూడా వృత్తగీత, హంసగీత, బ్రాహ్మణ గీత వంటివి చాలా ఉన్నాయి. అలాగే ఈ ”సరస్వతీ గీత” కూడా మహాభారతంలోని ఓ ఉపాఖ్యానం. దాని గురించి తెలుసుకుందాం!
పూర్వం ”తారక్ష్యుడు” అనే ఋషి తపస్సంపన్నుడు! వేదపారంగతుడు, ఒకసారి ఆయన సరస్వతి దేవి గురించి ఘోరమైన తపస్సు చేయగా, ఆ దేవి అతనికి ప్రత్యక్షమైంది. అప్పుడు ఆ ఋషి సరస్వతీదేవిని ”ఓ! సరస్వతీమాతా! మనుజుడు పాటించవలసిన ధర్మం ఏది? మనుష్యులు ఏవిధంగా పుణ్యగతులు పొందగలరు! ఆ పుణ్యం ఎలా శాశ్వతంగా ఉంటుంది” అని అడిగాడు. సరస్వతీ దేవి బదులిస్తూ ”దీక్షతో వేదాధ్యయనం చేసి, యజ్ఞయాగాలు నిర్వహించి ఆర్జించిన పుణ్యం శాశ్వతంగా ఉంటుంది. అటువంటివారు మరణించిన పిమ్మట స్వర్గ లోకం సంప్రాప్తిస్తుంది. అక్కడ సౌందర్యంతో నడయాడే అప్సరసల సాంగత్యం వల్ల పెక్కు సంవత్సరాలు సంతోషంతో ఉంటాడు. మంచి దూడతోనున్న గోవును యోగ్యుడైన వేదపండితుడుకి దానమిచ్చినవారు వారి అంత్యకాలంలో స్వర్గలోకం చేరి ఆ గోవు మీద ఎన్ని వెంట్రుకలుంటాయో అన్ని వేల సంవత్స రాలు ఆ దాత స్వర్గలోకంలో ఉంటాడు!
వస్త్రదానం చేస్తే చంద్రలోకానికి, బంగారం దానమిస్తే స్వర్గలోకానికి వెడతారు! ఇక భూదానం గురించి చెప్పనేల! అటువంటి దానశీలురకు వైకుంఠంలో స్థిరనివాసం ఉంటుం ది! దీక్షతో అగ్నిహోత్రుడికి గోనేతితో హవిస్సులు సమర్పిస్తూ యజ్ఞక్రతు వులు నిర్వహించిన వారి పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి కలిగించిన వారవు తారు! అగ్ని హోత్రం నా స్వరూపానికి సంబంధించినదని తెలుసుకో! ఎల్ల ప్పుడూ వేద వేదాంగ పారాయణ చేస్తూ, దానధర్మాలు చేస్తూ, ఆచార వ్యవహారాలను పాటిస్తూ, దు:ఖాతీతులై బ్రతికే మహాత్ములుండేచోటు నాకు విశిష్ఠ స్ఠానం. ఆత్మను గురించి పరిజ్ఞానం కలిగిన విద్వాంసులు అందరి సందేహాలను నాద్వారానే తీర్చుకొంటారు! అటువంటి వారందరూ నా లోకంలోకి చేరగలుగుతారు! ధర్మార్ధ కామాలకంటే మోక్షధర్మం ఉత్తమం. మానవుడు ఇంద్రియ నిగ్రహం కలిగి కర్తవ్యములను నెరవేర్చితేతమోక్షాన్ని పొందుతారు. చెడు స్వభావం కలిగి నీతులు మాటిమాటికీ వల్లెవేస్తూ ఎంతో వినయాన్ని ప్రదర్శించేవారికి అథోగతే సుమా! గృహస్థులు గృహస్థ ధర్మాన్ని
ఋషులు దేవ యజ్ఞాన్ని పాటించాలి. దానివల్ల సత్కీర్తి పొందడమేకాక, ధర్మ సూక్ష్మాలు బోధపడతాయి. తనకు ఆపద కలిగినా ధర్మాత్ములు ధర్మాన్నే ఆలంబన చేసు కొంటారు! అదే వారి వెంట వచ్చేది” అని చెప్పింది సరస్వతీదేవి.
అది విని ఋషి ”అమ్మా! వాగ్థేవీ! శరత్కాలంలో వెన్నెలలా మనోహరంగా కనపడుతూ వేదాలలో సత్యమార్గాన్ని అందించిన తల్లీ నన్ను కరుణించు!” అని ప్రార్థించాడు!
ఈ తారక్ష్యుడే గొప్ప ఋషి. ఆశ్ర మం నిర్మించుకొని తను ధర్మాలను పాటి స్తూ, సరస్వతీ ఉపాసన ద్వారా ఎంతో తటస్సశక్తిని పొందారు. ఒకరోజు పురూ ర వంశరాజు తన సైనికులతో, వేటాడటానికి అడవికి వచ్చారు. ఒక బ్రాహ్మణ బాలుడు పొదలమాటున కూర్చొండి తపస్సు చేసుకొంటున్నాడు. పొదల మాటున కదలిక చూసి దూరాన్నుండే అస్త్ర ప్రయోగం చేసాడు. హాహాకారాలు చేస్తూ ఆ బ్రాహ్మణ యువకుడు మరణించాడు. రాజు కంగారుపడి, ఈ తార్యాక్షుని ఆశ్రమానికి వచ్చి, జరిగిన సంగతి తెలియచేసాడు. ఆ ముని సూచన మేరకు ఆ బ్రాహ్మణ బాలుడిని తనవద్దకు తెప్పించి, తపోశక్తితో మరణించిన బ్రాహ్మణ కుమారుడిని బ్రతికించిన మహాఘన శాలి! తర్వాత సరస్వతీ కటాక్షం వల్ల మోక్షాన్ని పొందాడు.
- అనంతాత్మకుల రంగారావు
7989462679