Friday, November 22, 2024

శరణ్యే లోకానాం తవహిచరణా!

దుర్గాదేవి నవరాత్రులలో మనం జగన్మాత రూపాలను ఆరా ధిస్తూ సాంసారిక తాపత్రయాలన్నీ మరచిపోతున్నాము. మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే ఆమె పాదాల చెంత ఉన్నందువల్లే నిర్భీతత్త్వంతో ఉండగలుగుతున్నాము. అందుకే ఒక కవి ”నీ దయ నున్న కలుగు జయాలు, నీ దరినున్న తొలగు భయాలు” అంటూ వర్ణించారు.
”శరణ్య లోకానాం తవహచరణా” అంటే-
”అంబికా! వరముద్రలు, అభయ హస్తాల కంటే కూడా నీ పా దాలు భక్తులను భయం నుండి రక్షించేవి. కోరుకున్న దాని కన్నా అధిక ఫలాన్ని ఇచ్చే సామర్థ్యం కలవని విశిదమవుతోందమ్మా!” అని. అటువంటి సౌందర్య రాశి, శక్తి సంపన్నురాలు దుర్గాదేవి. ఆ దుర్గా దేవి సౌందర్య విషయాలు, శక్తి స్వరూపత్త్వం వివరించే శ్రీ ఆది శంకరాచార్యులు అందించిన ”సౌందర్య ల#హరి” విశేషాలు ఈ దేవీ నవరాత్రులు సందర్భముగా స్మరించుకుందాం-
ఒకసారి ఆదిశంకరులు ”మంత్ర శాస్త్ర విధానం” తెలుసుకోవ డానికి, సాక్షాత్తు ఆది దంపతులు ఆశీస్సులు పొందాలనే తపనతో కైలాసం వెళ్ళారు. ఆయన కైలాసం చేరే సరికి జగదంబిక పరమేశ్వ రుడుతో నాట్యం చేస్తోంది. శివుడు తాండవ నృత్యం చేస్తున్నారు. దూరంగా ఉండి తనవితీరా మైమరచి చూస్తున్న శంకరులను, పర మేశ్వరుడు పిలవగా దగ్గరగా వెళ్లి ”పరమేశా! నీలకంఠా! విరూపా క్షా! గంగాధరా పాహమాం పాహమాం” అంటూ స్తుతించారు. తరువాత ఆ దంపతులకు పాదాభివందనం చేసి, ”అమ్మా! భవానీ! ఈ కాలచక్రం అంతా నీ ఆధీనమే కదా! త్రిగుణాత్మురాలవు. నీ వు లేనిదే శంకరుడు కూడా అచేతనత్త్వంతో ఉంటున్నాడు అమ్మా!” అం టూ పరిపరి విధాల స్తుతించారు. తరువాత మ##హశ్వరుడు ఐదు ఆత్మ లింగాలను శంకరుడుకు ఇచ్చారు. ఇంతలో అమ్మ ఏమి చెప్పిం దో? ఏమో? శివుడు అమ్మ సౌందర్యాన్ని, శక్తిని వివరించే ”సౌందర్య ల#హరి” అనే విశేషమైన గ్రంథాన్ని ఇచ్చి ”శంకరా! ఈ సౌందర్య ల#హరి ఈ విశ్వంలో చరాచర జగత్తుకు ఆధార భూతమైంది. జగ న్మాత కరుణ, దయ, చల్లని చూపు లేనిదే ఏమీ ఉండదు. ఈ సౌందర్య ల#హరిని భూలోకంలో కష్టాలుపడుతున్న వారికి, మోక్షం కావాల న్న వారికి, మనోభీష్టాలు సిద్ధింపచేసుకోవడానికి ఎంతో మేలు చేకూ ర్చే స్తోత్రరత్నావళి. పారాయణ విధి- విధానాలు వివరించి, ఈ శివ లింగాలను ప్రతిష్టింపచేసి, శివతత్త్వాన్ని, భక్తి తత్త్వం ప్రచారం చేయ మని ఆదేశించారు.
ఇదంతా దూరంగా ఉన్న నంది (నందీశ్వరుడు) గమనించి, శంకరులు తిరిగి వెళ్ళబోతున్న సమయంలో క్రోధంతో సౌందర్య లహరిని బలవంతంగా ఆయన చేతిలో నుంచి లాక్కోబోయాడు. శంకరులు కూడా లాగారు. ఆ లాగడంలో కొంత భాగం నందీశ్వరు డు వద్ద ఉండిపోయింది. మిగిలిన భాగం అంటే శంకరుల వద్ద కొం త ఉండిపోయింది. దానిలో నలభై ఒక్క శ్లోకాలు మాత్రమే ఉన్నా యి. దీనినే ”ఆనందలహరి” అంటారు. అప్పుడు శివుడు శంకరులు వద్దకు వచ్చి ”శంకరా! నీ చేతనే నేను మిగిలిన భాగాన్ని రాయిస్తాను. వెళ్ళిరా!” అంటూ పంపారు. తర్వాత శంకరులు ఒకరోజు ధ్యానం లో ఉండగా, పరమేశ్వరుడు కనపడి చెబితే, ఆ శ్లోకాలన్నీ పూర్తిచేసా రు ఆదిశంకరులు. అంటే సౌందర్య లహరి శ్లోకాలు సాక్షాత్తు పరమే శ్వరుని నోటినుండి వెలువడినవే. అందుకే అది ఎంతో విశిష్టతను సంతరించుకొంది సౌందల్యలహరి.

సౌందర్య లహరి విశిష్టత…?

ఇందులోని శ్లోకాలలో బీజాక్షర, మంత్రములు సంక్షిప్తం చేయబ డ్డాయి. దీనివల్ల ప్రతికూల ఆలోచనలు నుండి విముక్తి పొందవచ్చు.
సౌందర్య లహరిలోని శ్లోకాలు గురువు ద్వారా మాత్రమే నేర్చు కొని, నిత్యపారాయణ చేస్తే, ఆ ఇల్లు. శోభాయమానంగా ఉంటుంది ఏ చీకూ చింత ఉండదు.
నిర్భీతత్త్వం పొందడానికి, కారాగార వాసం నుంచి రక్షణకు, రోగా ల నుండి విముక్తి పొంది ఆరోగ్యం పొందుటకు, అఖండమైన జ్ఞానా న్ని, భక్తిని పొందుటకు, జాతక రీత్యా గ్రహశాంతులకు ప్రతీకగా పారాయణ చేస్తే గ్రహదోషాలు తొలగుతాయి.
అది- ఇది అననేలా? సర్వాభీష్ట ప్రదాయిని ఈ సౌందర్య లహరి.

సౌందర్య లహరిలోని ప్రధాన అంశాలు

సౌందర్య లహరిలో మొదటి 41 శ్లోకాలు ఆనందహరి అంటా రు. రెండో భాగం మిగిలిన 59 శ్లోకాలు సౌందర్య లహరి. ఆనంద లహరి, సౌందర్య లహరి కలిపి చదివితేనే సౌందర్య లహరి చదివిన ట్లు. మొదటి శ్లోకంలో- అంటే
”శివశ్శక్త్యా,యుక్తో యది భవతి శక్త: ప్రభవితుం”
దీనిలో పరమేశ్వరుడు శక్తిని పొందినప్పుడు మాత్రమే సృష్టి స్థితి లయ చేయగల సంసిద్ధుడై ఉంటాడు. ఆ శక్తి లేనప్పుడు శక్తి హనుడై అచేతనత్త్వంతో ఉంటున్నాడు.
అటువంటి శక్తిని నీవల్లనే పొందుతున్నాడు. అంతటి పరమో
త్కృష్ణమైన నీ స్వరూపం గురించి వివరించడం గత జన్మలో చేసుకు న్న పుణ్యం వల్లనే కదా!
సౌందర్య లహరిలో భవానీ సౌందర్యాన్ని నఖ-శిఖ పర్యంతం వర్ణించారు. ఆమె నల్లని కేశ సంపద ఎనలేని అందాన్ని ఇస్తుంటే, శిగ లోని పూలు మరింత శోభను సంతరించుకున్నాయి. నీ వక్షోజాలు జ్ఞాన క్షీరాలే కదమ్మా! ఆమె నేత్రాల కిరణ శోభయే విశ్వమంతా వ్యా పించి ఉంది కదా! వివిధ మాణిక్యాలు మణులతో పొదిగిన నీ తాటాంకాలు (చెవి దుద్దులు) ధగధగమని వెలుగుని విరజిమ్ము తూంటే అజ్ఞానులు జ్ఞానాన్ని వెదుక్కుంటున్నారమ్మా! నీ నాశికలు ఒక వేణువులా గోచరించి, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ధ్వని పరమ శివుని స్తుతించుచున్నట్లుగా ఉంది తల్లిd! ఇలా ప్రతీ అంగాన్ని శోభాయమా నంగా వర్ణిస్తూ, శంకరులు అందించిన సౌందర్య లహరి మన జీవి తంలో ఆనందాన్ని ఇస్తుంది. సౌందర్య. లహరి ఒక శ్లోకములో-—
”అవిద్యానా మంత స్తిమర మిహవ ద్వీప నగర వరాహస్య భవతి||” అంటే- ”ఓ తల్లిd! నీ పాదరేణువు అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి, సూర్యుడు ఉదయించే ద్వీపంలోని పట్టణంలా కనపడుతోంది. మందబుద్ధితో ఉన్నవారికి జ్ఞానమనే మకరందంగా గోచరిస్తోంది. నీ పాదరేణువు దరిద్రులకు సకల సంపదలు ఇచ్చే చింతామణిగా విరా జిల్లుతోంది. అంతేకాదు సంసార సాగరంలో చిక్కుకొన్నవారికి నీ పాదం విష్ణువు అవతారంలోని ఆది వరాహస్వామి కోరలా ఉద్ధరి స్తుంది తల్లిd!”
ఈ సౌందర్య లహరిలో కుండలినీ యోగసాధన, షట్‌చక్రాలు, శ్రీ చక్రారాధన వంటి వాటి అవసరమైన మంత్రాలు, సాధనా మార్గా లు వివరించబడ్డాయి. ప్రతీ శ్లోకంలో కొన్ని బీజాక్షరాలు సంక్షిప్తం చేయబడ్డాయి. అందుకే అంత విశిష్టమైంది.
వీలైతే రోజూ, కుదరకపోతే వారంలో ఒక్కరోజు అయినా పారా యణ చేసే గృహంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సాక్షాత్తు శివుడే చెప్పారు. అంతేకాకుండా ప్రతీరోజూ అమ్మ కరుణ, దయ, ఆమె అనుగ్రహం కలగడానికి నిత్యం స్తుతించడానికి నాలుగు ముఖ్య శ్లోకాలు వివరించారు. అవి సౌందర్య లహరిలోని 1,3; 15; 32 శ్లోకాలు. ఇవి నిత్యం ఏకాగ్రతతో చదివినా, సౌందర్య లహరి అంతా చదివినట్లే!
దేవీ నవరాత్రులు సందర్భముగా సౌందర్య లహరి చదివిన పాఠకులకు శుభాకాంక్షలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement