Friday, November 22, 2024

రాఖీ కట్టడానికే ఆవిర్భవించినసంతోషిమాత

భారతీయుల సనాతన సంస్కృతిలో రాఖీ పూర్ణిమకు విశే ష గౌరవ, విలువల మహూన్నత ఆచరణ వుంది. సోదరీ, సోదరుల అనురాగ బంధాలను మరెంతో బలోపేతం చేస్తుంది రాఖీ పండుగ, మహళ జన్మించింది మొదలు మరణం వరకు తల్లి, దండ్రులు, అన్నాతమ్ముళ్ళు, భర్త,
కుమారులు, కుమార్తెలు రక్షగా ఉంటారు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత… పుట్టించి బంధాలు తెగిపోకుండా ఆమె రక్షణ బాధ్యతను సోదరులు కొనసాగిస్తారు. సోదరీ, సోదరుల మధ్య బంధాన్ని శాశ్వతంగా వదిలపర చటానికి పూర్వం ఋషులు తీసుకొచ్చిన పండుగ.
భవిష్యోత్తర పురాణం, హమాద్రి చతుర్వర్గ చింతా మణి, భాస్కర రామాయణం, మొగిలాయి చరిత్ర, మహా వీర పురుషోత్తమ చరిత్ర, భాగవతం, మహాభారతం, శివ పురాణం, తదితర గాథలతో కూడిన ఆధ్యాత్మిక, పౌరా ణిక, చారిత్రాత్మక కథనాలు సోదరీ, సోదరుల మధ్య ఆప్యాయతానురాగాలను పరిచే విశిష్ట పండుగగా రక్షాబంధనం వైభవం గురించి గొప్పగా చెబుతున్నాయి.

సంతోషిమాత జననం

వినాయకునికి లాభం, క్షేమం అనే ఇద్దరు కుమారు లు. వీరు శ్రావణ పూర్ణిమ నాడు శంకరుని పుత్రికగా పిలు వబడే నాగదేవత వద్దకు రాఖీ కట్టడానికి వెళ్ళారు. దీంతో ఆమె రాఖీ కేవలం సోదరులకు కట్టడానికే, తనకు ధరింప జేయడం ఉచితం కాదని సున్నితంగా తిరస్కరించింది. దీంతో ఇరువురు సోదరులు తమకు తోడబుట్టిన ఒక చెల్లెలు కావాలని తండ్రిని కోరారు. నారదుని సలహాను పాటించి వినాయకుడు తన ఇరువురు భార్యలు రిద్ధి(బుద్ధి), సిద్ధిలను ఆదేశించాడు. దీంతో వారి శరీరాల నుంచి ఒక మహూ జ్వల దివ్య శక్తి ఆకాశమంత ఎత్తుతో వెలువడింది. త్రిశక్తి మాతల దివ్యరూపాలు, వారి శక్తి, మహమాన్వితాల సమ్మే ళనంతో… మహాశక్తి స్వరూపిణిగా… విజయ వర ప్రదాయి నిగా, మహూజ్వల మహూన్నత ప్రకాశిత దివ్య తేజస్సు నుండి శ్రీ సంతోషి మాత సర్వ జగత్తులోని అంధకారాన్ని బాపడానికి ఆవిర్భవించింది. అప్పుడు ఆమెను తమ తోడ బుట్టిన చెల్లెలిగా స్వీకరించి లాభం, క్షేమం సోదరులు ఇరు వురు ఆప్యాయతానురాగాలతో ఆమెచే రాఖీలు కట్టించు కున్నారు. ఇలా రాఖీ పుణ్యామా అనీ సంతోషిమాత జనించి సకల లోకాలకు ఆరాధ్య దేవతైంది. అందరికీ అమ్మవారైం ది. కోరిన వారికి కొంగు బంగారమైంది. తన భక్తుడు అమ్మా అని పిలువగానే బిడ్డా అని చంకనెత్తుకునే చల్లని తల్లి అయి అందరికీ సంతోషాన్ని పంచుతున్నది.
శ్రావణ పూర్ణిమను రాఖీ పూర్ణిమతో పాటు జంధ్యాల పూర్ణిమగా కూడా పిలుస్తారు. ఈ రోజు నూతన యజ్ఞోప వీతం ధరించిన ప్రతి ఒక్కరూ జీర్ణ యజ్ఞోపవీతాన్ని విసర్జి స్తారు. తమ ఇష్ట దైవాలకు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి జం ధ్యాల పూర్ణిమను ఇళ్ళలో గొప్ప పర్వదినంగా జరుపు కుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement