Friday, November 22, 2024

శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవం

కర్నూలు, ప్రభన్యూస్‌ బ్యూరో: మకర సంక్ర మణ పుణ్యకా లాన్ని పురస్కరించుకొని పంచాహ్నక దీక్షతో నిర్వహించపబడే సంక్రాంతి బ్రహ్మోత్స వాలు శ్రీశైలంలో బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.ఏడు రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల18 వ తేదీతో ముగియను న్నాయి. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవా లు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న వెల్లడిం చారు. లోక కల్యాణం కోసం నిర్వహించబడు తున్న ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ జ్యో తిర్లింగ స్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామివారికి విశేషార్చనలు, మహాశ క్తిస్వరూపిణి అయిన శ్రీభ్రమరాంబాదేవి అమ్మ వారికి ప్రత్యేక పూజలు, రుద్రహోమం, చండీ హోమం, నవగ్రహ మండపారాధనలు, కలశా రాధన, జపాలు, పారాయ ణలు నిర్వహిస్తారు.

లోకకల్యాణం కోసమే…
ఉదయం 9.15 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆ గమ శాస్త్రానుసారం జరిపించబడ్డాయి. బ్రహ్మోత్సవ ప్రారంభసూచకంగా అధికారులు ఆలయ అర్చకులు, వేదపండితులు సంప్రదాయ బద్ధంగా యాగశాల ప్రవేశం చేశారు . తరువాత వేదపండి తులు చతుర్వేదపారాయణలతో వేదస్వస్తి నిర్వహించారు. శివసంకల్పం, వేదస్వస్తి తరువాత దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురువాలని, దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలనీ, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరు సుఖశాంతు లతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండి తులు లోకకల్యాణ సంకల్పాన్ని చెప్పారు. గణపతి పూజ సంకల్పపఠనం తరువాత ఉత్సవాలు నిర్వి ఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేశారు.
ఆ తరువాత శివ సంచార దేవతలలో ఒకరైన చండీశ్వ రునికి విశేషపూజ చేశారు. చండీశ్వరుడు స్వామి వారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు చేస్తూ ఉత్సవాలను నిర్వహిస్తాడని ప్రతీతి. కంకణ ధారణ చండీ శ్వర అర్చన తరువాత కంకణాలకు శాస్త్రోక్తం గా పూజాదికాలు నిర్వహించారు. అనంతరం అధికారులు, అర్చకస్వాములు, స్థానాచా ర్యులు కంకణాలను ధరించారు.ఆ బ్ర#హ్మూ త్సవాలలో ఆయా వైదిక కార్యాలను నిర్వహించమని ఋత్వికులను ఆహ్వా నిస్తూ వారికి దీక్షావస్త్రాలను అందజేశారు. తరువాత అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, వాస్తు హోమం, మండపారాధన, పంచావరణార్చన, ప్రధాన కలశస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంకాలం అంకురార్పణ
ఇక సాయంకాలం అంకురార్పణ జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత ప్రదేశంలోని మట్టిని సేకరించి సంప్రదాయబద్ధంగా యాగశాలకు తీసుకువచ్చి తరువాత ఈ మట్టిని 9 పాలికలలో నింపి దాంట్లో నవధ్యానాలు పోసి ఆ మట్టిని మొలకెత్తించే పనిని ప్రారంభిస్తారు. ఈ పాలికలలో రోజు నీరు పోసి నవధ్యానాలు పచ్చగా మొలకెత్తేలా చేస్తారు. ఈ విధంగా అంకురాలను ఆరోరింపజేసే కార్యక్రమం కాబట్టే దీనికి అంకురార్పణ అని పేరు. ఆ తరువాత జరిగే ధ్వజారోహణకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒక కొత్తవస్త్రం మీద పరమశివుని వాహనమైన నందీశ్వరుని, అష్టమంగళ చిత్రాలను చిత్రీకరిస్తారు. ఈ నందిధ్వజపటాన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన తాడును సిద్ధం చేసారు. ఈ నంది ధ్వజపటాన్ని ఊరేగింపుగా, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి, చండీశ్వరస్వామి సమక్షములో పూజాదికాలను నిర్వహించారు. ధ్వజారోహణలో భాగంగానే భేరీపూజచేశారు. ఈ భేరీపూజలో డోలు వాద్యానికి పూజాదికాలు జరిపించారు. చివరగా ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement