Saturday, November 23, 2024

శాండిల్య విద్య…!

సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాన్త ఉపాసీత|
అథ ఖలు క్రతుమయ: పురుషో యథాక్రతురస్మి
పురుషో భవతి తథేత: ప్రేత్య భవతి స క్రతుం కుర్వీత||
(3.14.1)

నామరూపాత్మకమైన ఈ జగత్తంతా ఆ పరబ్రహ్మ అయి ఉన్నాడు. సృష్టి, స్థితి లయాలు మూడు ఆ పరబ్రహ్మలోనే కలుగు తున్నాయి. అందువల్ల అందరూ ఎంతో శాంతమైన మనస్సుతో పరబ్రహ్మను ఉపాసించాలి. ఆ పరమాత్మ సాక్షాత్తూ యజ్ఞ స్వరూ పుడు. ఈ లోకంలో మానవుడు ఎలాంటి కర్మలు చేస్తాడో అందుకు తగిన పుణ్యలోకాలను మరణానంతరము చేరుకుంటాడు.
ఆ పరబ్రహ్మ మనోమయుడు. స్థూల సూక్ష్మ శరీరాలు కలవా డు. చైతన్య స్వరూపుడు, సత్యసంకల్పుడు, ప్రాణమే శరీరముగా గలవాడు. గొప్ప వెలుగుతో ప్రకాశించేవాడు. సత్యసంకల్పుడు. ఆకాశమే ఆత్మగాగలవాడు. సర్వ కర్మలు, సర్వ కామములు, సర్వ రస గంధములు (శబ్ద, స్పర్శ, రూప, రస) అన్నీ ఆ పరబ్రహ్మమే. సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. వాక్కు మొదలైన ఇంద్రియాలు ఉన్నా లేకున్నా సర్వేంద్రియ కార్యములు చేయగలిగినవాడు. అం దరి క్షేమాలు కోరుకునే ఆప్తకాముడు అవడం చేత ఆగ్రహం లేనివా డు (ఆగ్ర#హ శూన్యుడు.)
ఆత్మ అనేది సూక్ష్మాతి సూక్ష్మమైనది. మ#హత్తరమైనది. ఈ హృదయ పద్మంలో గల ఆత్మ వరి గింజకన్న, బార్లీ గింజకన్నా, ఆవగింజ కన్నా కూడా చాలా సూక్ష్మంగా ఉంటుంది. అలాగే నా హృదయమనే కమలంలో నివసించే పరమాత్మ ఈ భూగోళం కన్నా పెద్దది. ఆకాశం కన్నా పెద్దది. దేవలోకంకన్నా పెద్దది. నా హృ దయ కమలంలో నివసించే పరమాత్మే ఈ సృష్టికర్త. సర్వకామము లు, సర్వగంధములు, సర్వరసములు ఆ పరమాత్మ స్వరూపమే. అతడే పరబ్రహ్మము.
హృదయ పద్మంలో ఉండే ఆత్మయే సమస్త కర్మలను నిర్వరి ్తస్తుంది. సమస్తమైన మంచి కోరికలు కలిగి ఉంటుంది. సమస్త సుగంధాలు, రసాలు కలిగి ఈ ప్రపంచాన్ని అన్ని వైపుల నుండి వ్యాపించి ఉంటుంది. ఆత్మను గురించి మాటలతో చెప్పలేము. దానికి ఏ విధమైన కోరికలు ఉండవు. ప్రాణుల కోరికలన్నీ అదే తీరు స్తుంది. ఈ విధంగా హృదయ పద్మంలోని ఆత్మయే పరబ్రహ్మ స్వరూపం. ఈ శరీరం నుండి వేరైనప్పుడు అంటే సాధకుని శరీరం మరణించినప్పుడు, అందులోని జీవాత్మ ఆ పరమాత్మలో మరణా నంతరం తప్పక పరబ్ర#హ్మలో లీనమవుతాడు. దీనినే శాండిల్య విద్య అంటారు. ఇవే విషయాలు నారాయణ సూక్తంలో మరింత వివరంగా చెప్పబడ్డాయి.
ఈ విశాల విశ్వమంతా ఆకాశాన్ని ఉదరంగా (కడుపుగా), భూ మిని పీఠంగా చేసుకొని వుండడం వల్ల ఇది ఎప్పటికీ నశించదు. ఈ విశ్వానికి దిక్కులు మూలలు. ఈ విశ్వం యొక్క తూర్పు దిక్కు పేరు జుహూ. దక్షిణ దిక్కు పేరు సహమాన. పడమట దిక్కు పేరు రాజ్ఞీ. ఉత్తరదిక్కు పేరు సుభూత. స్వర్గము పైభాగము. ఈ విధంగా చెప్పబడిన విశ్వం సకల సంపదలకు ఆధారం.
అంగీరస గోత్రంలో పుట్టిన ఘోర మహర్షి దేవకీపుత్రుడైన శ్రీకృష్ణునికి ఆత్మ యజ్ఞోపాసనను వివరించాడు. ఈ విద్యను అభ్య సించిన వాడికి ఇతర విద్యలయందు కోరికలు ఉండవు. మానవుడు లౌకికమైన కోరికలు తీర్చుకోవడానికి యజ్ఞ కర్మలు చేస్తాడు. అలాగే పారలౌకికమైన అసంతృప్తితో, తీవ్రమైన కాంక్షతో ఆత్మ యజ్ఞం చేస్తాడు. ఆత్మ యజ్ఞాన్ని చేసినవాడు మరణానంతరం బ్రహ్మలోకా లు పొందుతాడు. సంకల్ప వికల్పాలకు కారణమైనది మనస్సు. కనుక మనస్సే బ్రహ్మగా ఉపాసించాలి. ఇది ఆత్మ విషయక దర్శనం. తరువాత దేవతా సంబంధమైన ఆకాశాన్ని బ్రహ్మగా ఉపాసించాలి. ఆకాశము, మనస్సు రెండూ సూక్ష్మమైనవి. సర్వవ్యాపకమైనవి, అంతులేనివి కనుక వీటికి బ్రహ్మత్వం ఆపాదించబడుతుంది.
మనస్సు అనే బ్రహ్మకు నాలుగు పాదాలున్నాయి. వాటిలో మొదటి పాదం- వాక్కు; రెండవ పాదం- ప్రాణం; మూడవ పాదం- నేత్రం; నాలుగవ పాదం- శ్రోత్రం; ఇది ఆధ్యాత్మిక దృష్టి.
ఆది దైవ దృష్టితో చూసిన యెడల మొదటి పాదం- అగ్ని; రెండవ పాదం- వాయువు; మూడవ పాదం- ఆదిత్యుడు; నాలు గవ పాదం- దిక్కులు. ఈవిధంగా ఆధ్యాత్మ, ఆది దేవత దృష్టితో నాలుగు పాదాలు గల బ్రహ్మోపాసన చెయ్యవచ్చు. ఈ రెండు విధానాలను కలిపి కూడా ఉపాసన చెయ్యవచ్చును. ఎందుకనగా, మనస్సు, ఆకాశం రెండూ ఒక్కటే! అటువంటి మనో ఆకాశ బ్ర#హ్మకు….
మొదటి పాదం- వాక్కు, అగ్ని; రెండవ పాదం- ప్రాణము, వాయువులు; మూడవ పాదం- నేత్రం, ఆదిత్యుడు; నాలుగవ పా దం- శ్రోత్రం, దిక్కులు ఇలా మనస్సును, ఆకాశాన్ని బ్రహ్మగా ఉపాసించేవాడు యశస్సుతో, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తాడు.
‘ఆదిత్యుడు బ్రహ్మ’ మొట్టమొదట ప్రపంచమంతా సత్తుగా అంటే నామరూపాత్మకం లేకుండా ఉంది. ఈ విధంగా నామరూ పాత్మకంగాని అసతు ్తకార్యోన్ముఖం అయ్యింది. అది క్రమంగా స్థూలరూపాన్ని పొందుతూ, నీటిలో కలిసి అండంగా అయినది. కొంతకాలానికి ఈ అండం పగిలి రెండు ముక్కలయింది. ఆ ముక్క లే వెండి, బంగారాలు. వీటిలో వెండిలాగా కనిపించేది క్రింద ఉండే భూలోకం. బంగారు రంగులో కనిపించేది పైన ఉండే ద్యు లోకము. ఈ గ్రుడ్డును కప్పి వుండే పొర పర్వత సమూహాలు, నదులే నాడులు.
ఆ గర్భంలో పుట్టినవాడే ఆదిత్యుడు. ఆదిత్యునితోపాటు దూరప్రాంతాలకు వినిపించే ధ్వనులు, సమస్త జగత్తు, బ్రతకడానికి కావలసిన అన్న వస్త్రాలు పుట్టాయి. ఇప్పటికీ సూర్యోదయం వలన, సూర్యాస్తమయం వలన సమస్త భూ తాలు భోగ విషయాలు ఘోష శబ్దంతో పుడుతున్నాయి. ఇంతటి మహమాన్వి తుడైన ఆదిత్యుని తెలుసుకొని అతనిని బ్రహ్మగా భావించి పూజిం చేవారు లేక ఆరాధించేవారు స్వయంగా ఆదిత్యుడే అవుతాడు. సుఖ జీవనం సాగిస్తాడు. అతని వద్దకు సంతోషకరమైన శబ్దాలు శీఘ్రం గా చేరతాయి. అని చాందోగ్యోపనిషత్తులో, శాండిల్యముని ఆత్మ యజ్ఞోపాసన, బ్రహ్మ విద్య మొదలైన విషయాలను తన శిష్యులకు వివరించాడు. దీనినే శాండిల్య విద్య అంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement