యాదగిరిగుట్ట, ప్రభన్యూస్: పాలు, పెరుగు, చక్కెర, తేనె, గోమూత్రంతో కూడిన పంచామృతాలతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో పున: ప్రతిష్టించనున్న శిలామయ దివ్యమూర్తులను అధివాసానికి చేకూర్చే క్రతువు ఆగమ శాస్త్రం ప్రకారం మంగళ వాయిద్యాలు, వేదోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా కొనసాగించారు. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణతో ప్రధానాలయం పున: ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీ నుంచి బాలాలయంలో నిర్వహిస్తున్న పంచకుండాత్మక సహిత మహాకుంభాభిషేకం శుక్రవారం నాటికి ఐదవ రోజుకు చేరుకుంది. శిల్పకళలో ప్రతిష్టామూర్తులకు ప్రాణ ప్రతిష్ట చేసే క్రతువులో భాగంగా పంచామృతాధివాసం ప్రత్యేకంగా నిర్వహించారు. ఉదయం బాలాలయంలో శ్రీ స్వామి వారికి నిత్యారాధనలు యథావిధిగా చేప ట్టిన అనంతరం శాంతిపాఠంతో యాగాన్ని తిరిగి ప్రారంభిం చారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రధానాల యంలో 49 (ఏకోనపంచాషట్) కలశములతో శిలా, లోహమయ మూర్తులకు అభిషేకం నిర్వ హిం చారు. పంచామృత శుద్ధోదక ములను ఈ కలశాలలో నింపి అభిషేకం చేసే ఘట్టం కన్నుల పండువగా కొనసాగింది. దీంతో వరుసగా మూర్తులు తేజోమ యమై, పవిత్రమై ప్రాణ ప్రతిష్టతో భక్తజనకోటికి శుభాశీస్సులు శ్రీ స్వామి వారు అంద జేయనున్నారు. లోక కల్యాణార్థం నిర్వహిస్తోన్న ఈ సంప్రోక్షణ ఉత్సవాలు భగవానుడికి ప్రీతిపాత్రమని ఆగమశాస్త్రం చెబు తోంది. ఉత్సవాలలో భాగంగా ఇటు బాలాలయంలోనూ, అటు ప్రధానాలయంలోనూ ఉత్సవ ప్రక్రియను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. మూలమంత్ర, మూర్తిమంత్ర హవనము లతో పాటు సామూహిక శ్రీవిష్ణుసహస్రనామ పారాయణాలతో ఆధ్యాత్మిక శోభతో యాగ ప్రాంగణం భాసిల్లింది. ఆలయ ప్రధానార్చకులు నల్ల న్‌థీఘల్ లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగుతుండగా ఆలయ ఈవో ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు మరింగంటి మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు, మరింగంటి శ్రీధరాచార్యులు, ఆలయ అధికారులు గజవెల్లి రమేష్‌బాబు, దోర్భల భాస్కరశర్మ, వేముల రామ్మోహన్, గట్టు శ్రవణ్‌కుమార్ తదితరులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.
భద్రతా ఏర్పాట్లపై వరుస సమీక్షలు
ఈ నెల 28న ప్రధానాలయ ప్రారంభోత్సవం, భక్తుల దర్శనాల పునరుద్ధరణ జరుగనున్న నేపథ్యం, 28వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వందలాది మంది వారి సపరివారం పాల్గొననున్న దృష్ట్యా శాంతిభద్రతల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై వరుస సమీక్షలు జరుగుతున్నాయి. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగడి సునీతారెడ్డి శుక్రవారం మరోమారు యాదగిరికొండను సందర్శించారు. పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో శాఖల వారిగా ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షను నిర్వహించారు. భక్తుల వసతి సౌకర్యాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
యాగాలలో నేటి పర్వాలు
26వ తేదీ శనివారం ఉదయం శాంతిపాఠం, చతు:స్థానా ర్చన, మూలమంత్ర హవనములు, ఏకతీతి కలశాభిషేకం, ద్వార తోరణ ధ్వజకుంభరాధన, నిత్యలఘు పూర్ణాహుతి. సాయంత్ర వేళ సామూహిక శ్రీ విష్ణుసహస్రనామ పారాయ ణం, చతు:స్థానర్చనలు, ధ్యాన్యాధీవాసం, నిత్యలఘు పూర్ణాహుతి చేయనున్నారు.
పంచామతంలో శిలామూర్తుల పావనం
Advertisement
తాజా వార్తలు
Advertisement