Sunday, November 24, 2024

వేదభూమి చాటిచెప్పిన సనాతన నాదం!

మానవజాతి… సురాసురుల సమ్మేళనం. ఈ సృష్టి ఒక వైకుంఠపాళి. ఆడుకునేది పైవాడు. అయితే పాములతో బాటు నిచ్చెనలూ ఇచ్చాడు. పాపాలు చేస్తే పాముల నోట్లో పడుతూ క్రిందికే పోతారు. అదే సత్యం గ్రహించి పుణ్యకార్యాలు చేస్తూ పరోపకార జీవనం చేసేవారు నిచ్చెననెక్కి త్వరగా పరంధామం చేరతారు. ఇటువంటి వెూక్షదాయకమైన ఆనంద విజ్ఞానం గల ఆధ్యాత్మిక యజ్ఞవాటిక ఈ వేదభూమి. త్రవ్వేకొలదీ విలువైన మణులు లభిస్తూనే ఉంటాయి.

తన కుమారుని అయోధ్యకు వారసునిగా చేయ సంకల్పించిన కైకేయి ఆశ నెరవేరలేదు. ధర్మంకోసం తల్లి మాటను తృణీ కరించి తనకుతానుగా నారవస్త్రములు ధరించి పదునాలుగు సంవత్సరాలు వనవాసం చేసేందుకు సిద్ధపడ్డ భరతుడు జనించిన పుణ్యభూమి ఈ భారతదేశం. తెల్లవారితే కోసల సామ్రాజ్యానికి వారసునిగా సింహాసనం అధిష్ఠించవలసిన శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడై మందహాసం చేస్తూ, ఎటువంటి ఆవేదన, ఆక్రోశానికి లోనుకాకుండా సీతాసమేతుడై సోదరుడు లక్ష్మణునితో కలసి అర ణ్యాలకు పయనమయ్యాడు.
బలము, యశస్సు, సంపద, జ్ఞానము, సౌందర్యము వీటన్నిం టినీ మించిన వైరాగ్యము కలిగిన శ్రీరాముడు ఉదయించిన దివ్యకేం ద్రము భరతఖండము. మానవుడై జన్మించిన శ్రీరాముడు దేవునిగా పూజింపబడ్డాడు. అటువంటి దివ్యవిభవునికి అవతార పరంపర తప్పనిసరిగా ఉండునని తమ దివ్యదృష్టితో కనుగొన్నాడు వాల్మీకి మహాముని. ఆయన మహిమాన్విత చరిత్రను లిఖించి శ్రీరామాయ ణంగా మానవాళికి అందించాడు మహనీయుడు. స్థితికారుడైన శ్రీమహావిష్ణువు యొక్క అవతారమని కనుగొన్నాడు.
యుగయుగాలకు ధర్మము యొక్క స్వరూపం తెలియచేయ డానికి అవతరించిన ధర్మస్వరూపుడు ఈ శిశువేనని గ్రహించిన వశి ష్ఠమహాముని ”రామ” అనే రెండు బీజాక్షరాలను ఎంపిక చేసి నామ కరణం చేసాడు. ఆ రహస్యాన్ని కనుగొన్న ఋషిపరంపర రామ నామసంకీర్తనను మానవులకు మార్గదర్శనం చేసారు. వివేకవంతు లు గ్రహించి రామనామం జపిస్తూ పునీతులవుతున్నారు.
మోక్షదాయకమైన ఆనంద విజ్ఞానం గల ఆధ్యాత్మిక యజ్ఞవా టిక ఈ వేదభూమి. త్రవ్వేకొలదీ విలువైన మణులు లభిస్తూనే

ఉంటాయి. వాటికి విలువ కట్టకుండా ముక్తి సాధనకు వినియోగించుకొనే వారికి లభిం చేది సచ్చిదానందమే కదా!
విధివశమున అన్న ధర్మరాజు జూదం ఆడి సర్వం ఓడిపోయి పన్నెండు సంవత్సరాలు వనవాసం చేయాల్సివస్తే భార్య ద్రౌపదితో సహా నలుగురు తమ్ములు సహనంతో అనుసరించారు. వనవాస కాలాన్ని తమ తెలివితో సద్వినియోగం చేసుకున్నారు. చివరిగా ఒ క సంవత్సర కాలాన్ని అజ్ఞాతంగా గడిపి కురుక్షేత్ర యుద్ధంలో విజ యం సాధించారు. ఈ ధర్మ సంస్థాపనా యజ్ఞంలో శ్రీకృష్ణ భగవాను ని సంపూర్ణంగా సేవించి ప్రజారంజకమైన పరిపాలన కొనసాగించా రు. లీలామానుష విగ్రహరూపుడైన శ్రీకృష్ణుడు కలియుగంలో మానవజన్మను తరింప చేసుకోవడానికి భగవద్గీతను అందించా డు. సత్త్వగుణ సంపన్నులైన జ్ఞానధనులు గీతారహస్యాలను అవగాహన చేసుకుని ఆత్మజ్ఞానం పొందుతున్నారు.
ఏ యుగంలోనైనా దేవతా స్వభావం, రాక్షస స్వభావం గల మానవులు జనిస్తూనే ఉంటారు. ధర్మదేవత ఘర్షణ పాలవుతూనే ఉంటుంది. అయితే ధర్మమునదే అంతిమ గెలుపు అనేది పరమాత్మ శాసనం. ఈ మాయా ప్రపంచ కల్పనలో జీవులతో ఆడుకునే దైవక్రీ డలో దైవస్వభావం ధర్మరక్షణా ధారులైన దేవతల వైపే మొగ్గుచూ పుతుంది. రాక్షసుల అమానవీయ చర్యలను ఖండిస్తూ వారిని శిక్షిం చడమే దైవం యొక్క స్వభావం. మరి ఎందుకీ విచిత్రమైన దైవక్రీడ అనే అనుమానం కలగడం సహజం. త్రిగుణాత్మకమైన ప్రకృతిలో పాంచభౌతిక దేహాలను సృజించి వాటికి ఆత్మ అనే చైతన్యంతో అను సంధానం చేసి తనను కనుగొనమని పరీక్ష పెట్టాడు పరమాత్మ. ఇక సంసారమనే వేదికపై అంతులేని నాటకం మొదలయ్యింది. వినోదం పరంధామునిదైతే, ముగింపు లేని పాత్రను ధరించడం జీవుడి వంతు అయింది.
రంగస్థలం మీద నటించి, నటించి అలసిన జీవుడు పరమాత్మ కొరకు అన్వేషణ ప్రారంభించక తప్పదు. అటువంటి అన్వేషణకు సరయిన వేదికయే ఈ కర్మభూమి. మానవజన్మ అత్యంత విలువైన దని, సచ్చిదానందమే దాని గమ్యమని తెలుసుకున్నది ఈ పవిత్ర మైన భరతజాతి. అందుకే సదాశాంతిని కాంక్షిస్తుంది. ఆనందం గా జీవించమనే దైవసంకల్పం. అనుభవించడానికి ప్రకృతిని ప్రసాదించాడు. అనుభవించడమంటే విధ్వంసం చేయమని కాదు. ప్రకృతితో, ప్రకృతిలో మమేకమై జీవించడం. భగవ దాన్వేషణ తమ మార్గంగా మసలుకోవడం. సకల జీవకోటి తో సమన్వయంగా మెలగడం. మూర్ఖత్వం వదలి వివేకంతో సాటి మనిషిని ఆనందంతో నింపడం.
పరమాత్మను కనుగొనే అన్వేషణలో స్వార్థానికి చోటు ఉండదు. సదాత్యాగం తొణికిసలాడుతుంది. అన్వేషణ అనేక మార్గాలలో సాగుతుంది. స్వచ్ఛమైన అన్వేషకుడు ఎవరి మార్గాని కి, విశ్వాసానికి ఆటంకం కలిగించడు. సనాతనమైన ఆనందంతో తేలిపోతూ ఉంటాడు. సాధనా తపస్సు తీవ్రమయేకొలదీ పరమా త్మరూపం నిత్యానందమని, దు:ఖరహితమని అవగాహన కలుగు తుంది. చివరకు తానే ఆ రూపమని, ఆనందమయునిగానే తనని సృష్టించాడని గ్రహిస్తాడు. అపుడు ఈ వ్యక్తావ్యక్తమంతా ఆనందభ రితంగా మారడం చూస్తాడు.
అపుడు ఈ భౌతిక ప్రపంచమంతా ఒక వింతగా మారుతుంది. ఈ కక్షలు, యుద్ధాలు, సుఖం, దు:ఖం, ఆశ, నిరాశ, జననం, మర ణం, యవ్వనం, వృద్ధాప్యం, భోగం, దరిద్రం ఇవన్నీ ఈ సంసార రంగస్థలంపై పరమాత్మ కల్పించే మాయా భావనలని తెలిసిపోతుం ది. తనకు లభించిన పాత్ర అద్భుతమైనదని గ్రహించి మహాదర్శకు ని శాసనం ప్రకారం నటించి, ఎన్ని దు:ఖాలు ఎదురైనా కృంగిపోక సుఖాంతం చేసినవాడే కర్మయోగి. అటువంటి వారికి తిరిగి ఎటు వంటి పాత్ర ఇవ్వడు. పరంధామంలో తన ప్రక్కన కూర్చొండ బెట్టుకొని ప్రేక్షక పాత్రను ఇస్తాడు. దుర్లభమైన ఈ మానవ జన్మను సదా ఆ పరమాత్మ యొక్క అన్వేషణలో ఆనందమయం చేసుకొని, మానవత్వపు పరిమళాలను వెదజల్లి ఈ పుడమిని శాంతిథామం చేయమని ఆ పరమాత్మ ఆదేశం. అదే ఈ వేదభూమి చాటి చెప్పే సనాతన నాదం.

Advertisement

తాజా వార్తలు

Advertisement