ప్ర చరిత్రకారుల అంచనా ప్రకారం మూడు వేల సంవత్సరాల క్రితమే పదహారు జనపదాలయిన అంగ, అస్సక, అవంతి, భేది, గాంధార, కాంబోజు, కాశీ, కోసల, కురు, మగధ, మల్ల, మత్స్య, పాం చాల, శూరసేన, వజ్జి, వత్స మహా రాజ్యాలు అత్యంత వైభోగంతో తులతూ గాయి. వీటి ప్రస్థావన వేదములలో కూడా కనబడుతుంది.
అత్యంత ధర్మబద్ధమైన నాగరికతను ఈ మహా రాజ్యాధిపతులు మాన వాళికి అందించారు. సనాతనమైన ఆధ్యాత్మిక జీవనాన్ని తరతరాలకు అం దించారు. అలౌకిక జ్ఞానాన్ని, సత్యాలను అందించిన ఏకైక జాతి ఈ భరత జాతి. పట్టణాల నిర్మాణం, వ్యవసాయం, వాణిజ్యం, లలిత కళలు, శిల్ప కళలు, నాట్య శాస్త్రం, వైద్య శాస్త్రం, ఖగోళ శాస్త్రం, తర్క మీమాంస శాస్త్రం, నీతి శాస్త్రం, కామ శాస్త్రం, యుద్ధనీతి శాస్త్రము, అనేక ధర్మశాస్త్రాలు మాన వాళికి అందించి మానవ జన్మను నవరసభరితంగా చేసి సుఖశాంతులతో, ఆనందంతో జీవితాన్ని ముగించమని ప్రబోధించాయి. ఇహ పరములలో ముక్తిని పొందమని సూచించాయి. అఖండ భరత ఖండం సకల సంపద లతో తులతూగింది. ఆదరణ కాని అనాగరికత మచ్చుకు కూడా కనబడ లేదు. అయితే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వేద సంస్కృతిలో అనేక శ్రేయోదాయకమైన విషయాలు మానవాళికి అందించబడ్డాయి. మానవ జాతి లక్ష్యాలను నిర్దేశించాయి.
తరువాత మౌర్యులు, గుప్తులు, రాష్ట్రకూటులు, ప్రతిహారులు, చాళు క్యులు, చోళులు, పల్లవ, బేర, పాండ్య, పశ్చిమ చాళుక్య మొదలైన రాజ వంశాలు తరతరాలుగా వస్తున్న అపార సంపదను మరింత పెంపొందించి అత్యంత వైభవోపేతమైన సంస్కృతిని, సాంప్రదాయాలను జాతికి అందిం చారు. ఇదంతా మిగిలిన ప్రపంచం అంధకారంలో ఉన్నప్పుడే జరిగింది అనేది పరమసత్యం. ఈ భరతజాతిపై మిగిలిన ప్రపంచం ఈర్శ్య, అసూయ లతో ఆహారం , సంపదల కోసం అనాగరిక దండ యాత్రలు చేసింది.
వేల సంవత్సరాలు ఎంతో శ్రమించి మానవాళికి శ్రేయస్సును కలిగించే సంస్కతీ సాంప్రదాయాలను నిర్మిస్తే వాటిని క్షణాల్లో నాశనం చేసారు. డేరి యస్, అలెగ్జాండర్ దగ్గర నుండి ఫ్రెంచ్, డచ్, బ్రిటీషు వారి వరకు భారత దేశం మీదపడి అన్ని రకాలుగా దోపిడి చేసినవారే! అంటే ఎంత సంపన్న మైన దేశమో, జాతో ఎవరికైనా అర్థం అవుతుంది. ఎడారి మీద ఎవరైనా దండెత్తుతారా? రక్తాన్ని శ్రమగా మార్చి నవరసభరితమైన సంస్కృతిని మానవాళికి అందిస్తే అసూయతో, కష్టపడకుండా దోపిడి అనే అనాగిక చర్యకు పాల్పడి భరత ఖండాన్ని నిలువునా దోపిడి చేసి సర్వేజనా సుఖినో భవంతు కాదని దోచుకుని ప్రకృతికి విరుద్ధంగా భోగించి నాగరికతా హనము కోరుకున్నారు. స్వతహాగా సాత్వికులైన భరత జాతి ధర్మము కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. కాకతీయ, మసునూరి, విజయనగర, గజపతి, అహోం, మేవార, రాజపుత్రులు, మరాఠాలు, సిక్కులు, మైసూరు రాజులు, గుప్తులు, నందులు మొదలైనవారు నాగరికతను, సంస్కృతిని, ధర్మాన్ని కాపాడుకోవడం కోసం తమ శౌర్య పరాక్రమాలు చూపారు.
సుమారు 200సార్లు ఈ భారతదేశం విదేశీ దండయాత్రలను ఎదు ర్కొంది. కానీ ఏనాడు ఏదేశముపైనా దండయాత్ర చేయలేదు.
ఇక అంతర్గత పోరాటాలు చక్రవర్తి, సామంతుల మధ్య జరిగాయి. చక్ర వర్తి సామంతులను సకల మర్యాదలతో చూసేవాడు. సామంతులు కూడ అదే గౌరవంతో సార్వభౌమత్వాన్ని నిలిపేవారు. దేశం అన్నివిధాలుగా సుభిక్షంగా ఉండేది. దోపిడిదార్లను అడ్డుకుని తరిమి వేసిన చందేల విద్యా ధరుడులాంటి మహవీరులకు కొదవలేని జాతి భరతజాతి. ఇలా అనేక విధ్వంసాలను ఎదుర్కొని, దోపిడిలకు గురయిన దేశం తమ ఆత్మశక్తి వలన తిరిగి నిలబడుతోంది. కాని అనేక త్యాగాలకు గురయ్యింది. నిత్యం సంప దను దోచుకుపోతుంటే కొంతకాలం పేదరికానికి గురికాక తప్పదు కదా!. పై గా కొంతమంది స్వార్ధం, పిరికితనం, వెన్నుపోట్లకు కారణంగా మారింది.
ఏదిఏమైనా భరత జాతి కొంతకాలం పేదరికం ఇక్కట్లకు ఆలవాల మయ్యింది. అదే సమయంలో స్వామి వివేకానంద ఈ దేశంలో ఉదయిం చాడు. ఒక దేశ, జాతి, సంస్కృతీ సాంప్రదాయాలలో వేలు పెట్టడానికి ఎవరికీ అధికారం లేదు. ఎవరి ధర్మం వారికి గొప్పది.
దీనిని ఏ సభ్య నాగరిక సమాజం దేశం హర్షించదు. తప్పక ఖండిస్తుం ది. విశ్వ మత మహాసభలో స్వామి వివేకానంద ”అమెరికా సోదర సోదరి మణులారా! అనే మూడు మాటలతో భారతదేశ అంతరంగాన్ని ఆవిష రిం చారు. వివిధ మత సాంప్రదాయాలన్నింటినీ సామరస్య పూరితంగా తనలో ఇముడ్చుకొన్న హిందూ మత విశాల దృక్పథాన్ని వర్ణించి స్వామీజీ ఇలా అన్నారు. నేటి ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కారాలు దేనికి కేవల ప్రతి ధ్వను లుగా కనిపిస్తున్నాయో అలాంటి వేదాంత తత్వ మహోన్నత ఆశ్రమాలు మొదలుకుని నానావిధ పురాణాలను ఆధారంగా గైకొన్న విగ్రహ ఆరాధ నలనే సగుణోపాసన భావాల పర్యంతం సమస్త ఆశయాలకు, నాస్తికవాదా నికి హిందూమతమనే సనాతన ధర్మం స్థానమిస్తోంది.
ప్రపంచ చరిత్రను గావించినా భారతీయులవంటివారు కానరారు. వీరు పొలిమేరలు దాటి జైత్రయాత్రలు ఏనాడు చేయలేదు. శ్రమించి సంప దలు సృష్టించుకొని దండయాత్రలకు గురయ్యారు. ఎన్నో వందల ఏళ్ల నుండి విదేశీయులు దాడిచేస్తూ ఉన్నా తిరిగి తమ ఆత్మశక్తితో నిలబడుతు న్నారు. ఆత్మ తత్వాన్ని ఆదర్శంగా గ్రహించిన ఆధ్యాత్మి అన్వేషకులకు మృతిలేదు. భరత ఖండం అజరామరం. భారతదేశం అత్యంత దుర్దశలో ఉన్నప్పుడు కూడా సిద్ధ పురుషులు ఉదయిస్తూ వచ్చారు. భారతీయులు పవిత్రతను పరమ పూజ్యంగా నిలుపుకున్నంతకాలం వారు అమృతప్రా యులే!” అని హైందవ ఝుంఝూ మారుతమయ్యాడు.
ఆ విధంగా భారత జాతిని బానిసత్వతమో నిద్ర నుండి మేల్కొల్పి దేశోన్నతి కోసం పాటు పడమని ఉద్ఘోషించాడు. నవీన భారతదేశ పునరుజ్జీవనం కోసం జీవితాన్ని అర్పించిన ”ఈశ్వర నియుక్త మహావక్త”. జాతి, దేశ, మత భేధాలు లేకుండా విశ్వ మానవులందరికీ జనన మరణ సంసార చక్రం నుండి ముక్తి మార్గాన్ని చూపడం కోసం వేదాంత సందేశాన్ని అందించిన ”వేదాం త శిరోభూషణ” స్వామీ వివేకానంద. వారి మార్గం ప్రతి భారతీయు నికి శిరోధార్యం.
సనాతన ఝంఝా మారుతం
Advertisement
తాజా వార్తలు
Advertisement