సనాతన ధర్మంలో రెండు పదాలు ఉన్నాయి. అవి 1) సనాతన 2) ధర్మం. సనాతన అంటే ఎప్పటికీ నిలిచేది. శాశ్వతంగా ఉండేది. ఇక ధర్మం అంటే మనం మన జీవన గమనం సుఖసంతోషాలతో ఉండటానికి అనుసరించవలసిన పద్ధతులు. ఆది శంకరులు జన్మించక ముందు చార్వాక లోకాయతిక, శాక్తేయ, సాంఖ్యక వంటి మతాలు దాదాపు ఎనభై వరకు ఉనికిలో ఉండేవి. ఒక మతానికి మరొక మతానికి విరుద్ధమైన భావనలు. కొంచెం పండితుడుగా చలామణి అయ్యేవాడల్లా, కొత్తమతాన్ని సృష్టించుకొనే రోజులు. ప్రజలు
అయోమయానికి గురయ్యారు. అదే సమయంలో శంకరాచార్యులు జన్మించారు. హిందూ సంస్కృతిలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి, ప్రజల్లో అవగాహన కలిగించారు. సనాతన ధర్మం ప్రచారంలో భాగంగా ఆయన దేశం అంతా పర్యటించి, నాలుగు మూలలా నాలుగు ఆధ్యాత్మిక పీఠాలు స్థాపించి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించి, మనకు ఏది అవసరమో తెలియచేసారు. అనేక గ్రంథాలు, స్తోత్రాలు, ఉపనిషత్తులు సారం మనకు అందించబట్టే మనం భగవంతుని కీర్తించగలుగుతున్నాము. అలాగే, రామానుజాచార్యులు విశిష్టాద్వైత మతం ప్రచారం చేశారు. ఆ రోజుల్లో ముక్తికి నారాయణ మంత్రం పటించేవారు. అది ఏ కొద్ది మందికో మాత్రమే లభ్యం అయ్యేది. అలాకాదని ప్రజలు అందరూ అర్హులేనని, తాను గురువు వద్ద నేర్చుకున్న తిరుమంత్రాన్ని, వైష్ణవాలయం ఎక్కి అందరికీ వినపడేలా మైకులో గట్టిగా ఈ తిరుమంత్రం వెల్లడి చేశారు.
రామకృష్ణ పరమహంస నోటినుండి భగవంతుని ప్రసంగాలు తప్ప అన్యమైన మాటలు వచ్చేవి కావు. ఆయన అన్ని మతాల సారాంశం ఒక్కటే. అదే మోక్షసాధన. హిందూధర్మంలో మోక్ష సాధన గృహస్థాశ్రమంలో ఉన్నా పొందవచ్చునని భగవంతునిపై విశ్వాసం ఉండాలని చెప్పేవారు. ఆ నమ్మకం వల్లే ఆయనకు భవతారుణీ అమ్మ సాక్షాత్కరించింది. వివేకానంద పాశ్చాత్య దేశాల్లో మన హిందూ మతం గొప్పతనాన్ని, ఉపనిషత్తులు, భగవద్గీత ఇతిహాసాలు వంటివాటిపై ప్రచారం చేశారు. ఇతర దేశస్థులు భారతీయ సంస్కృతి పట్ల ఆకర్షితులయ్యేటట్లు చేశారు. నైతికతను ఆలోచింప చేశారు. నిస్వార్దం, స్వచ్ఛత, సత్యం మనిషి ఔన్నత్యానికి ప్రధానమని ప్రచారం చేశారు. ప్రజలు మూఢ నమ్మకాలతో, అజ్ఞానంతో, భగవంతుని పట్ల అవిశ్వాస భావనతో ఉన్న సమయంలో చైతన్య మహా ప్రభువు, ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీ శీల ప్రభుపాదులు వంటి ఎందరో మహానుభావులు హిందూ ధర్మం గొప్ప తనాన్ని తెలియపరుస్తూనే, అన్ని మతాలను కూడా గౌరవించాలి అని బోధించారు. షిరిడీ సాయిబాబా కాలంలో #హందూ, ముస్లిం తగాదాలు ఎక్కువగా ఉండేవి. ఆయన బోధనలు వల్ల సోదరభావం వచ్చింది. అసలు మన #హందూ ధర్మంనకు సంబంధించిన వివరాలకు పునాది మహాభారతం, భగవద్గీత, రామాయణం వంటి అనేక గ్రంథాలు. అంటే సనాతన ధర్మం కొన్ని యుగాలుగా మనకు అందించబడుతోంది. #హందువుగా పుట్టిన మనం కొంతలో కొంత ధర్మాన్ని పాటిస్తూ, భావితరాలకు అందించాలి. సనాతన ధర్మంలో, తల్లి తండ్రులను, గురువులను పూజించాలి. నీ కర్తవ్యాన్ని విస్మరించకూడదు. ఎదుటి వారిలో దైవత్వాన్ని చూడడం, సత్యాన్ని పలకడం వంటి సద్గుణాల సమ్మేళనం. ఇది పాటించడానికి పెట్టుబడి ఏమీ అవసరం లేదు కదా! మనం ధర్మాన్ని అనుసరించి కర్తవ్య నిర్వ#హణలో నిమగ్నమవుదాము.
- అనంతాత్మకుల రంగారావు