Monday, November 18, 2024

సనాతన ధర్మ రథసారధి

సామాన్య కుటుంబంలో జన్మించి … అందరిలానే విద్యార్థి జీవితాన్ని మొదలుపెట్టి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం సృష్టికర్తగా దివ్య తేజస్సుతో విరాజిల్లిన అవతార పురుషులు. నడయాడే దేవునిగా పుట్టపర్తిలో భక్తులకు, జనులకు దర్శన-స్పర్శన భాగ్యమును కలిగించిన దివ్యపురుషులు సాయిబాబా. సాయి ధ్యానంతో ఆధ్యాత్మిక నగరిగా వెలుగొందుతున్న పుట్టపర్తిలో నేడు (నవంబరు 23వ తేదీ) రత్నాకర వంశాంబుధి రత్నం శ్రీసాయి 98వ జయంతి పర్వదినోత్సవాన్ని అయిదు రోజుల ఉత్సవ సంరంభంలా… ఓ మహాయజ్ఞంలా… అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న శుభ తరుణం ఇది. అఖండ జ్ఞానజ్యోతిని వెలిగించి దివ్య కాంతులను ప్రసరింపచేసే భగవానుని 98వ జయంతోత్సవాన ఆత్మ విశ్వాసంతో, భక్తిభావంతో మనసారా ప్రార్థించడమే వారికి అందించే దివ్య నీరాజనం.

నాలుగు సూత్రాలు

సాయి అఖిల మానవాళికి అందించిన నాలుగు సూత్రాలు అత్యంత ముఖ్యమైనవి. 1. ఉన్నది ఒక్కడే దేవుడు- ఆయనే సర్వాంతర్యామి. 2. ఉన్నది ఒకటే మతము- అది ప్రేమ మతము, 3. ఉన్నది ఒకటే కులం- అదే మానవ కులం. 4. ఒకటే భాష అదే హృదయ భాష అన్నారు.

వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు యుగయుగాలలో పలు అవతారాలు దాల్చినవాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా అవతారం దాల్చి, కురుపాండవ సంగ్రామం కురుక్షేత్ర యుద్ధ సమయాన అర్జునుని రథసారధియై విచారంలో మునిగియున్న విజయునికి కర్తవ్య బోధ చేసి భగవద్గీతను బోధించారు. విశ్వరూప సందర్శ న భాగ్యమును కిరీటికి కల్గించి కార్యోన్ముఖుని గావించాడు. నాలుగు యుగాల్లో ధర్మమునకు హాని కల్గినపుడు, నన్ను నేను సృజించుకొని, అవతారాలు దాల్చి ధర్మసంస్థాపన గావిస్తానని సందేశం యిచ్చారు. కలియుగ మాయను వివరించారు. కలి మాయను తప్పించడానికి ఎం దరో అవధూతలు- మహానుభావులు- బాబాలు జన్మించి ధర్మ సంస్థాపనకు నడుం కడతారు.
ఆ కోవకు చెందినవారే భగవాన్‌ శ్రీ సత్యసాయిబాబా. బాల్యంలో సత్యనారాయణ నామధేయంతో పలు మహిమలను, లీలలను చూపించారు. 1940 అక్టోబర్‌ నెల 20వ తేదీన తన 14వ ఏట తాను ‘సత్యసాయిబాబా’ను అంటూ తన అవతారాన్ని ప్రకటించుకున్నారు. 1941లో తొలిసారి బాబా భవిష్యవాణిని వినిపించారు.
2-0వ శతాబ్దంలో ప్రసిద్ధ మత గురువు… వేదాంతి… మానవాళిని ఉద్ధరించుటకు శివ శక్తి స్వరూపముగా… సాయిబాబాగా అవతరించిన మహా పుణ్యయుగమిది. ఆయన బోధన లు అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంటాయి. సర్వమత సమైక్యతను ప్రబోధిస్తాయి.
తన దివ్య సందేశాన్ని అందిస్తూ…. కలియుగంలో జనులలో మానవతా విలువలైన సత్య- ధర్మ- శాంతి ప్రేమలను వృద్ధిచేసి, సంస్కారాలను నేర్పి, దారి తప్పిన విలువలను సక్ర మ మార్గంలో పెట్టి సంస్కరించుటయే తన లక్ష్యమని చాటారు. స్వామి సందేశంలో మాన వాళికి తమ జన్మ మర్మమును, గమ్యమును తెలియజేయు టయే నా అవతార కారణ మన్నా రు. యోగ- క్రియా ఆత్మశక్తుల సమ్మిళితమైన స్వరూపమే అవతార లక్ష్యం అన్నారు.
మానవునిలో దాగిన పశుత్వమును నిర్మూలించి, మానవత్వమును పోషించి, దివ్య త్వానుభూతికి అందుకొనగల్గుటయే సంస్కరణ, ఒక సందర్భంలో సం స్కరణను వివరిస్తూ చమ త్కార్‌, సంస్కార్‌, పరోపకార్‌, సాక్షాత్కార్‌ అనే నాల్గు సోపానాలున్నవని తెలిపారు. లీలలను మహిమలను ప్రకటించి అందరినీ ఆకర్షించుటే చమత్కారం. మానవతా విలు వల ఆవశ్యకతను చెప్పుటయే సంస్కారము. పిదప వారిని నిస్వా ర్థ, నిర్మల సేవలో పాల్గొనునట్లు చేస్తాను. అదే పరోపకారం అన్నా రు. సేవ వలననే నరుడు నారాయణుడౌతాడు. సంస్కారమే నరు ని నారాయణునిగా చేస్తుంది. అదే సాక్షాత్కారమన్నారు.
శ్రీ సత్యసాయి వేదోద్ధరణను ధర్మ రక్షణను, విద్వత్‌ పోషణను, భక్త రక్షణను గావింపదలచి ఆచరించి చూపించారు. వేదోఖిలం ధర్మ మూలం అంటూ ధర్మాచరణ వేదముల మీద ఆధారపడియున్నది గాన విద్వత్‌ పోషణకు పుట్టపర్తిలో వేద పాఠశాలను స్థాపించి, విశ్వవిద్యాలయ స్థాయికి గొని వచ్చారు. 1950లో ప్రశాంతి మందిర ఆవిష్కరణ. 1972లో పూర్ణచంద్ర ఆడిటోరియం ప్రారం భం. 1981లో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం. ఉచిత విద్య. 1990లో సాంస్కృతిక మ్యూజియం, 1991లో ఉచిత వైద్యం అందిస్తూ సూపర్‌ స్పెషాలిటీ ఆసు పత్రి, ప్రజల దాహార్తి తీర్చుటకై తాగునీటి సదుపాయానికి ప్రారంభం. 2000 సం||లో మానవతా విలువలపై అంతర్జాతీయ సమ్మేళనం, సంగీతకళాశాల, ఉచితఅన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
స్వామి సేవకు ఎంతో ప్రాధాన్యతను అందించారు. దీనజనో ద్ధరణకు మానవులు ప్రయత్నించి సేవ చేయాలన్నారు. భక్త బం ధువు, ఆపద్బాంధవుడు, ఆర్తజన రక్షకుడు. విద్యా, వైద్య ప్రదాత సాయి నామస్మరణలో అఖిల జగతి తరించుటకు, సేవ సమితులు, భజన మండలులు ఏర్పరచారు. నేటికీ ప్రపంచ వ్యాప్తంగా సాయి భక్తులు సత్యసాయి బాబాను ఆరాధిస్తూ, భక్తి భావనతో ఆదర్శప్రాయం గా నిలుస్తున్నారు. వారికి సమకాలీనులమైనందుకు వారి మార్గంలో నడచి సకల జగతీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ జీవితాలను ధన్యం చేసుకొందాము.సదా సాయి ని స్మరిద్దాం.హృదయవాసిగా భావిం చి ఆత్మ విశ్వాసంతో మెలుగుదాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement