Sunday, October 20, 2024

సంస్కారాలు… అంతరార్థం

భారతీయ సంస్కృతిలో చెప్పబడినవన్నీ సమాజహతం కోసమే ఉద్దేశించబడినవి. సమాజం అంటే మనుష్యులు తప్ప వేరెవరో కాదు. అందుకే మన సంప్రదాయాలు మానవ వికాసానికై ఋషు లచే నిర్దేశించబడ్డాయి. ఈ సంప్రదాయాలనే సంస్కారాలు అని చెబుతారు. మన జీవితాలు ఏదో ఒక దశలో ఈ సంప్రదాయాలను అనుసరించే ముందుకు సాగుతుంటాయి.
మనుస్మృతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా గుర్తించింది. 1. వివాహం, 2. గర్భాదానం, 3. పుంస వనం, 4. సీమంతం, 5. జాతకర్మ, 6. నామకరణం, 7. అన్నప్రాశనం, 8. చూడాకర్మ, 9. నిష్క్రమణం, 10. ఉప నయనం, 11. కేశాంతం, 12. సమా వర్తనం. అయితే మరికొంతమంది స్మృతి కారులు ఈ సంస్కారాలను షోడశ (16) సంస్కారాలుగా పేర్కొన్నారు. కర్ణభేదం, విద్యారంభం, వేదారంభం, అంత్యేష్టి అంటూ మనువు చెప్పిన 12 సంస్కారాల కు, ఈ నాలుగు సంస్కారాలను జోడించి షోడశ సంస్కారాలుగా గుర్తించారు.
మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు సంస్కారమయమే. ఇందులో అంత్యేష్టి తప్ప మిగిలిన 15 కర్మల ద్వారా జీవుడు సంస్కరింపబడుతూ మరణం తర్వాత ఉత్తమలోక ప్రాప్తిని పొందడం జరుగుతుంది. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడ తొలగి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిద్ధిఇస్తుంది. సంస్కారాల ఆచరణ మనిషి జీవితంలో వివా హంతో మొదలవుతుంది. అంటే తల్లి గర్భంలో ఏర్పడే పిండం పవిత్రంగా ఏర్ప డాలన్నదే. స్త్రీ పురుష సంయోగం మంత్రం చేత పునీతమవుతుంది. అంటే తల్లి గర్భంలో ఏర్పడే పిండం పవిత్రంగా ఏర్పడాలన్నదే. స్త్రీ పురుష సంయోగం మంత్రం చేత పునీతమవుతుంది. తద్వారా మన సంస్కారాల ప్రధానోద్దేశ్యం జీవుల క్షేమమేనని తేటతెల్లమవుతోంది. వేదోపనిషత్తుల ప్రకారం మన శరీరం ఐదు అంశాలమయంగా విభజింపబడింది.
1. అన్నమయ కోశం- భౌతిక శరీరం
2. ప్రాణమయ కోశం- శక్తి కేంద్రం
3. మనోమయ కోశం -చింతనా కేంద్రం
4. బుద్ధిమయ కోశం – వివేకం
5. అనందమయ కోశం – పరమశాంతి

మన శరీరంలో ఈ ఐదు అంశాలు షోడశ సంస్కారాల ద్వారా సక్రమ మైన రీతిలో చలిస్తాయనేది శాస్త్రవచనం ఈ సంస్కారాల వెనుకనున్న వైజ్ణానిక రహస్యాలు నేతి వైజ్ణానికులకు సైతం అశ్చర్యపరుస్తాయి.
వివాహం: వివాహం సమయంలో వధూవరులచే పలుమంత్రాలు చెప్పించబడుతుంటాయి. ఆ సమయంలో వరుడు, ”భగ, ఆర్యమ, సవిత, పురంధి అనే దేవతలు గార్హపత్యం కోసం నిన్ను నాకు అనుగ్రహంచగా, నా జీవితం సుఖమయం అయ్యేందుకు నీ చేయిని నేను పట్టుకున్నాను” అని చెబుతాడు.
గర్భాదానం : స్త్రీ పురుష సంయోగం ద్వారా పుట్టబోయే సంతానం యోగ్యులుగా ఉండేందుకై ఈ సంస్కారం నిర్దేశించబడింది.
పుంసవనం : తల్లిం గర్భంలోని పిండం పవిత్రంగా ఏర్పడేందుకు, మంచి గుణగణాలతో, తెలివితేటలతో ఎదగాలని ఉద్దేశించబడిన సంస్కా రమే పుంసవనం.
సీమతం: గర్భవతికి ఈ సంస్కారాన్ని నిర్వహంచడం వల్ల దుష్ట శక్తుల నుంచి రక్షింపబడుతుంది.
జాతక కర్మ: బిడ్డకు నెయ్యిని రుచి చూపి, పది నెలలు తల్లి గర్భంలో ఉండి ఈ ప్రపంచానికి వచ్చిన జీవికి జరిపే తొలి సంస్కారం ఇది.
నామకరణం: బిడ్డ ఈ సమాజంలో తనకంటూ ఓ వ్యక్తిత్వంతో వృద్ధి లోకి రావాలన్న కోరికతో తల్లిదండ్రులు జరిపే సంస్కారం.
నిష్క్రమణం: బిడ్దను తొలిసారిగా బయటకు తీసుకెళ్ళడం, చంటి బిడ్డను విభిన్న వాతావరణాలకు పరిచయం చేయడమో ఈ సంస్కా రంలోని అంతరార్ధం.
అన్నప్రాశనం: బిడ్డకు బలవర్ధకమైన, ఆహారాన్ని పరిచయం చేయడం.
చూడాకర్మ: పుట్టువెంట్రుకలను తీయించడం ఈ సంస్కారంలోని ప్రత్యేకత.
కర్ణబేధ: చెవులు కుట్టించడం.
ఉపనయనం: బాల బ్రహ్మచారికి జరిపే సంస్కారం.
వేదారంభం: సమవర్తన సంస్కారాన్ని చక్కగా ముగించేందుకే వేదారంభం.
సమావర్తనం: పిల్లలు విద్య ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ సంస్కారం జరుపబడుతుంది.
వానప్రస్ధం: బాధ్యతలను వారసులకు అప్పగించి వచ్చే జన్మకై జరిపే కర్మ.
సన్యాసం: ఐహక బంధాల నుంచి విముక్తి పొందడం.
అంత్యేష్టి: పితృరుణం తీర్చుకునేందుకు పుత్రులు చేసే సంస్కారం.
మానవుని జీవితంలో ఇలా అన్ని కర్మలను నిర్వర్తిస్తే జీవితం పరిపూర్ణ మవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement