వహసి వపుశి విసదే వసనమ్ జలదాభమ్
హల-హతి – భీతి- మిలిత- యమునాభమ్||
ఓ సర్వలోక రక్షకుడవైన ఓ కృష్ణయ్యా! నీకు జయము కలుగు గాక! నీవు సర్వోత్కృష్టుడవయి ఉండుము. నీవు దివ్యమైన నిర్మలమైన శరీరముతో బలరామావతారమునెత్తి, బృందావన మున గోపికలతో విహరించుచుండగా, యమునా నదిని జలక్రీడకు రమ్మని పిలువగా, అది రానందున కోపముతో నాగేటితో దాని దిశని మార్చబోవగా, యమున వస్త్రమువలె వణకినది కదా! అని జయదేవుని అష్టపదులలో మొదటి అష్టపదిలో దశావతార వర్ణనలో హలధరరూప అని వర్ణించాడు బలరాముణ్ణి.
#హందూ గ్రంథాల ప్రకారం, బలరాముడు తన బలానికి ప్రసిద్ధి చెం దాడు. బలం, రక్షణ, ఆరోగ్యవంతమైన జీవితం కోసం భక్తులు ఆయన ను ఆరాధిస్తారు. బలదేవుడు, హలధర అని కూడా పిలువబడే బలరాము డు వ్యవసాయ పనిముట్లను తన ఆయుధాలుగా ఉపయోగించుకున్నం దున తరచుగా వ్యవసాయంతో సంబంధం కలిగి ఉంటాడు. బలరాము డు విష్ణువు ఉన్న సర్పమైన శేషునితో సంబంధం కలిగి ఉన్నాడు.
భారతీయ కుటుంబ వ్యవస్థలో అన్నదమ్ములంటే రామలక్ష్మణులు, బలరామకృష్ణుల్లా ఉండాలని కోరుకుంటారు.
బలరామావతారము అంటే మహావిష్ణువు ధర్మ రక్షణకు ఎత్తిన దశ అవతారాలలో ఒకటి. బలరాములు వారు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులుగా జన్మించిన అంశావతారము. వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణునికి అన్నివేళలా తోడుగా ఉన్నవారు. ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశ మార్చినారు, మరొకసారి హస్తి నాపురాన్నే (నేటి ఢిల్లిdని) తన హలాయుధంతో యమునలో కలప ఉద్యు క్తులయినారు. వీరు కురుక్షేత్ర యుద్ధమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేసారు. శ్రీకాకుళం జిల్లా నాగావళి నది ఆవిర్భావానికి… నాగా వళి నదీతీరాన పంచలింగాల ప్రతిష్టకి ఈయనే కారణము.
భారత భాగవతాలలో శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రస్తావన వచ్చిన సంద ర్భాలలో బలరాముడిని గురించి కూడా కొన్ని వివరణలు, కథలు కనిపి స్తాయి. శ్రీమహావిష్ణువు శ్వేతతేజస్సు బలరాముడుగానూ, నీలతేజస్సు శ్రీ కృష్ణుడిగానూ అవతరించి దుష్టశిక్షణ కోసం తమ అవతార కాలాన్నంతా సద్వినియోగం చేసినట్లుగా అనిపిస్తుంది. దేవకీదేవికి సప్తమగర్భం కలి గింది. అప్పుడు దేవకిని, వసుదేవుడిని కంసుడు చెరసాలలో బంధించా డు. ఆ సమయంలో యముడు తన యామ్యమైన మాయతో దేవకీదేవి నుంచి గర్భాన్ని ఆకర్షించి రో#హణీదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. బలరా ముడికి ఈ సందర్భంలోనే సంకర్షణుడు అనే పేరు వచ్చింది.
బలవంతులందరిలోనూ శ్రేష్టుడు కనుక ‘బలదేవుడు’ అన్నారు. రామ శబ్దానికి సుందరం అనే అర్ధం ఉంది కనుక ఆయన ‘బలరాముడు’ అయ్యాడు. శ్రీకృష్ణుడికి అన్న అయిన బలరాముడు ఆదిశేషుడి అవతారం కూడా. సాందీపుడు అనే గురువు దగ్గర బలరామకృష్ణులిద్దరూ విద్యా భ్యాసం చేశారు. ఈ బలరాముడు శ్రీకృష్ణుడిలాగే పాండవులంటే కొంత ఆదరాభిమానాలు కలిగివున్నా ఈయనకు కౌరవులలో దుర్యోధనుడంటే కూడా బాగా ఇష్టం అని కొన్నికొన్ని భారత కథాఘట్టాల వల్ల తెలుస్తుంది.
ఈయన భార్య పేరు రేవతీదేవి. నాగలి, రోకలి బలరాముడి ప్రధాన ఆయుధాలు. ఎప్పుడూ నీలంరంగు వస్త్రాలే ధరిస్తుంటాడు. గదా యు ద్ధంలో బలరాముడు గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించాడు. భీముడు, దుర్యోధనుడు ఈయన దగ్గర గదాయుద్ధ విద్యను నేర్చుకు న్నారు.
ద్రౌపది వివా#హంలోనూ, ధర్మరాజు ఇంద్రప్రస్థ రాజధాని ప్రవేశ సమ యంలోనూ శ్రీకృష్ణుడితో పాటుగా బలదేవుడు కూడా ఉన్నాడు. అర్జు నుడు తీర్థయాత్రలు చేస్తూ చిన్ననాటి నుంచి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిం చిన సుభద్రను వివా#హమాడటం కోసం యతి వేషంలో బలరాముడు దగ్గరకు వెళ్ళాడు. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి స#హకరిం చాడు. కానీ అర్జునుడు సుభద్రను అప#హరించడం బలరాముడికి నచ్చ లేదు. తీవ్రంగా కోపగించుకున్నాడు. శ్రీకృష్ణుడు శాంతపరిచాడు.
పాండవులు వనవాసం చేసే రోజుల్లో తీర్థయాత్రలు చేస్తూ ప్రభాస తీర్థం దగ్గరకు వెళ్ళినప్పుడు బలరాముడు, మరికొందరు యాదవ వీరు లను తీసుకొని వారి దగ్గరకు వెళ్ళి వారిని పరామర్శించాడు. ఆ తర్వాత వనవాసం, అజ్ఞాతవాసం అన్నీ పూర్తికావటం ఉత్తర, అభిమన్యుల వివా హం కూడా జరిగాయి. ఆ సందర్భంలో అక్కడ ఉన్న బలరాముడు పాం డవులకు, కౌరవులకు హతకరంగా రాజ్యవిభాగం ఎలా జరిగితే బాగుం టుందో ఆలోచించాలన్నాడు. ఇక్కడే బలరాముడికి దుర్యోధనుడంటే అభి మానం ఉందన్న విషయం వ్యక్తమవుతుంది. అయితే యుద్ధ సమయంలో పాండవులు, కౌరవులు ఇద్దరూ తనకు కావాల్సివారేనని తాను ఏ పక్షానికి ఎలాంటి సహాయం చేయకుండా తటస్ఠంగా ఉన్నాడు.
కురుక్షేత్ర యుద్ధ సమయంలో సరస్వతీ నదీతీరంలో ఉన్న తీర్థయా త్రలకు వెళ్ళి నలభైరెండురోజుల తీర్థయాత్ర ముగించుకొని కురుక్షేత్ర సంగ్రామం చిట్టచివరిలో భీముడు, దుర్యోధనుడు గదాయుద్ధం చేసు కునే సమయానికి తిరిగివచ్చాడు. ఆ యుద్ధంలో భీముడు దుర్యోధనుడి తొడలు విరగగొట్టడం గదాయుద్ధ ధర్మంకాదని తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తపరిచాడు. శ్రీకృష్ణుడు కలగజేసుకొని దుర్యోధనుడికి మైత్రేయ మ#హర్షి శాపం, భీముడు చేసిన ప్రతిజ్ఞ గుర్తుచేసి సర్దిచెప్పడంతో కొద్దిగా బాధపడుతూనే రథమెక్కి ద్వారకకు వెళ్ళాడు.
అవతారం పరంగా చూస్తే త్రేతాయుగంలో విష్ణువు రాముడిగా, ఆది శేషుడు లక్ష్మణుడిగా అన్నాతమ్ముళ్లుగా అవతరించారు. ద్వాపరంలో మాత్రం ఆదిశేషుడు అన్న బలరాముడిగా, విష్ణువు తమ్ముడు కష్ణుడిగా జన్మించారు. శ్రీరాముడిని అనుక్షణం కనిపెట్టుకుని ఉన్నందుకు లక్ష్మణుడు కోరుకున్న వరం కారణంగానే ఈ విధంగా జరిగిందనే కథలు ప్రచారంలో ఉన్నాయి. అలా పరమాత్ముడు రెండు అవతారాల మధ్య సమతుల్యత సాధించినట్లయింది.
– భువనేశ్వరి మారేపల్లి, 95502 41921