21-02-2024 బుధవారం రోజు ఉదయం అష్టాక్షరి మంత్ర జపంతో ప్రారంభమైంది. అనంతరం ప్రాతస్మరణీయం, యాగశాలలో సేవాకాలం, శాత్తుముఱై నిర్వహించారు. తర్వాత అగ్నిప్రతిష్ట కార్యక్రమం జరిపించారు. ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. త్రిదండి చినజీయర్‌స్వామివారు భక్తులకు తీర్దప్రసాదం అనుగ్రహించారు. తర్వాత దివ్యసాకేతంలోని రామచంద్రప్రభువుకి సూర్యప్రభ వాహన సేవ ఘనంగా నిర్వహించారు. దివ్యసాకేతం నుంచి SOE వరకు జరిగిన ఈ వాహన సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తర్వాత భక్తులకు పెద్దలు అనుగ్రహ భాషణం చేశారు. పూర్ణాహుతితో ఉదయం కార్యక్రమం పూర్తయింది.
మధ్యాహ్నం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు*
స్వాగతాంజలి కార్యక్రమంలో భాగంగా జీవా ఆశ్రమ నాట్యాచార్యులు ఘంటసాల పవన్ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన. సంగీత దర్శకులు పడాల తారకరామారావు బృందం భక్తి సంగీత విభావరి కార్యక్రమం.
తర్వాత శ్రీమతి భావన పెద్దప్రోలు శిష్య బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ప్రారంభంకానున్న సాంస్కృతిక కార్యక్రమాలు
సమతాకుంభ్ 108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement