Saturday, November 23, 2024

సద్గురుని అనుగ్రహంతోనే ముక్తి!

శ్రీ సద్గురు మలయాళస్వామి వారు కుహనా గురువులను గూర్చి ఆయన రచించిన శుష్క వేదాంత తమో భాస్కరంలో చక్కగా వర్ణించారు. గుర వోబహవస్సంతి- శిష్య హృత్తాప హరకమ్‌” అంటూ గురు గీతలోని ఈ శ్లోకంలో శిష్యుల సొమ్ము మొక్కే గురువులెందరో ఉన్నారు. శిష్యుల హృదయాన్ని దోచుకోగల గురువు చాలా అరుదు. గురువులనేకులు. వేషధారులందరు సద్గురువు లు గారు. ఇదే సద్గురువులను గూర్చి కవి శేషప్ప సీస పద్యం ద్వారా వివరించారు.

సీ|| జందె మింపుగ వేసి సంధ్య వార్చిననేమి
బ్రహ్మ మందగ కాడు- బ్రాహ్మణుండు
తిరుమణి శ్రీ చూర్ణ గురులేఖలిడినను
విష్ణు నొందక కాడు- వైష్ణ వుండు,
బూదిని నుదుటను- బూసి కొనిన నేమి
శంభు నొందక కాడు- శైవ జనుడు,
కాషాయ వస్త్రాలు గట్టి కప్పిన నేమి
యాసపోవక కాడు- యతి వరుండు
గీ|| ఇట్టి లౌకిక వేషాలు గట్టి కొనిన-
గురుని జెంద కసన్ముక్తి దొరకబోదు
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస- దుష్ట సంహార నరసింహదురితదూర!
అంటూ త్రిమూర్తుల వైభవాన్ని పేర్కొంటూ, ఆచార పరంపరలోని బాహ్య చిహ్నాలని గూర్చి ప్రస్తావించినాడు. బ్రాహ్మణ- శైవ-వైష్ణవ- యతివరులను గూర్చి వివరిస్తూ సమాజంలోని వ్యక్తుల సంప్రదాయాలను తెలిపాడు. ముచ్చటగా జందెం ధరించినా, బ్రహ్మ తత్త్వం తెలియకపోతే బ్రాహ్మణుడు కాలే డు. నొసటిపై తిరుమణి, శ్రీ చూర్ణాలతో ఎగువ రేఖలు దిద్దుకున్నా విష్ణుతత్వం తెలి యకపోతే విష్ణు భక్తుడు కాలేడు. విభూతి రేఖలు నొనటిపై తీర్చుకున్నా పరమ శివత త్వం తెలియకపోతే శైవుడనిపించుకోలేడు. శరీరంపై కాషాయ వస్త్రములు కట్టుకు న్నంత మాత్రాన సన్యాసి కాలేడు. ఆశలను గెల్చినవాడే యతి. పైపై డాంబిక వేషాలు ప నికిరావు. సద్గురుని అనుగ్రహం ముఖ్యం. కవి ఈ పద్యం త్రిమూర్తులను పేర్కొం టూ, శైవ, వైష్ణవ, యతి సంప్రదాయాల విశిష్టతను వివరించారు. తిరుమణి, శ్రీ చూర్ణరేఖలు- విభూతి పట్టెలు, కాషాయాంబరాలు, మతపరమైన బాహ్య చిహ్నాలు- ధర్మపురుషార్థ ద్యోతకాలన్నాడు. బ్రాహ్మణులకు జందెం వర్ణ వ్యవస్థకు చిహ్నం. బ్రాహ్మణులు త్రికాల సంధ్యా వందనం చేస్తారు. ఉదయ సంధ్య- జననానికి, సాయం సంధ్య మరణానికి సంకేతాలు. ఇది నిష్టతో చేయాల్సిన పవిత్ర కార్యం.
వైష్ణవ మతానికి చిహ్నాలు తిరుమణి. శ్రీచూర్ణం పొడిని నొసటిపై తాల్చడం సం ప్రదాయం. ఈ రెంటినీ కలిపి, శ్రీ వేంకటేశ్వరస్వామికి నేత్రాలు కన్పించకుండా రేఖలు దిద్దడం చూస్తున్నాం. కవి నామాలు తీర్చగానే వైష్ణవుడు కాదు. విష్ణుతత్వం బాగా తెలిస్తేనే అవుతాడు అన్నారు. శైవ లక్షణాలను వివరిస్తూ శైవులు నుదుటిన, శరీరంపై పలుచోట్ల విభూది పట్టెలు దిద్దుతారు. వీటిని భస్మ త్రిపుండ్రాలంటారు. వీటిని ధరిం చిన వారిని గురులింగ జంగములంటారు. పరమ శివతత్వం తెలుసుకోవాలి గాని విభూతి పట్టెలతో ఏమీ కాదన్నాడు. ఇంక యతులు కాషాయ వస్త్రాలు. సన్న్యాసికి ఇది గుర్తు. కషాయాన్ని మాలిన్యాన్ని రూపుమాపినాడనుటకు చిహ్నమన్నాడు. శౌచ విధిగల వాడే యతి వరుడౌతాడని, వేషాలు కట్టినవాడు కాడని కవి వాక్కు.
ఆదిశంకరులు భజ గోవిందస్త్రోత్రంలో-
‘జటిలో ముం డీ లుంభితకేశ: / కాషాయాంబర బహుకృత వేష:
పశ్యన్నిపిచ నపశ్యతి మూఢో: ఉదర నిమిత్తం బహుకృత వేష:” అంటూ వేషధారు లను నిందించాడు. బాహ్యవేషాలన్ని పొట్ట కూటికేయన్నాడు. లౌకిక వేషాలతో వైష్ణ వం కైవసంగాదు. గురువు దగ్గర కూర్చొని, తత్త్వ రహస్యాలు గ్రహించి, సంప్రదా యాలు- ఆచారములు, ఆధ్యాత్మిక భావనలు తెలిసి ముక్తినొందాలి. ముక్తిపొందు టకు సద్గురువులే ఆలంబన అనీ, వారే బోధ గురువులనీ తెలిపారు. జనులు పరతత్త్వ మును గ్రహించి గురువును పరమాత్మ స్వరూపునిగా గ్రహించిన నాడు ముక్తి దానంతట అదే లభిస్తుంది.”గురులేక ఎటువంటి గుణికి తెలి యకబోదు” అన్నారు త్యాగ బ్రహ్మ, వాగ్గేయ కారులైన త్యాగరాజు.
– పివి సీతారామమూర్తి
9490386015

Advertisement

తాజా వార్తలు

Advertisement