మా నవసేవే మాధవ సేవ. మాధ వుని దరిచేరడానికి మానవులు సదాచార పరాయణులై, ధర్మచింతనతో, దానధర్మాలు చేస్తూ భగవన్నామ స్మరణ లో గడపాలని అంటారు మన పెద్దలు.
భక్త సులభుడైన మాధవుడు అత్యం త సౌందర్యంతో తన ఇద్దరు దేవేరులతో అపురూపంగా దర్శనమిచ్చే పుణ్య స్ధలం తుత్తిపట్టు. దేవేంద్రుడు తనకు ఏర్పడిన బ్రహ్మ హత్యాదోషం నుండి విమోచనం పొందడానికి భూలోకంలో గల పంచ క్షేత్రాలలో మాధవుని విగ్రహాలను ప్రతి ష్టించాడు.
ప్రథమంగా ఉత్తరదేశం అలహాబా ద్‌లోని ప్రయాగలో వేణుమాధవుని, రెండవదిగా ఆంధ్రప్రదేశ్‌లోని కుంతి మాధవుని, తమిళనాడు ఆంబూరుకు సమీపాన వున్న తుత్తిపట్టులో బిందుమా ధవుని మూడవదిగా, నాలుగవదిగా తిరువనంతపురంలో సుందర మాధవు ని, ఐదవదిగా రామేశ్వరంలో సేతుమాధ వుని ప్రతిష్టించి పూజించి తన బ్ర#హ్మ #హ త్యా దోషం నుండి విముక్తుడైనాడని స్ధలపురాణల కథనం.
ఇంద్రునికి దోషం ఏర్పడడానికి కారణం?
ఆది కాలంలో బ్రహ్మదేవుడు తన సృష్టికి సహాయకులుగా ఏర్పర్చిన ప్రజాపతులలో త్వష్టా ఒకడు. దేవతాశ్రేష్టుడైన త్వష్టాకు విశ్వరూపుడనే కుమారుడు. అతనికి మూడు శిరస్సులు. శాంత స్వరూపుడు, ధర్మ చింతన కలవాడు. ఒకసారి విశ్వరూపుడు తండ్రి ఆశీర్వాదంతో కఠోర తపస్సు చేసాడు.
ఆ తపస్సు వలన తన పదవికి భగ్నం కలుగు తుందనే భయంతో మహంద్రుడు విశ్వరూపుని తపస్సుని భగ్నం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. కాని అన్ని ప్రయత్నాలు వృధా అయినవి. క్రోధావేశాలతో ఇంద్రుడు విశ్వరూపుని తన వజ్రా యుధంతో తెగ నరికాడు.
తన పుత్రుని దారుణ హత్య విషయం తెలిసిన త్వష్టా ఒక అభిచార యాగాన్ని చేశాడు. దాని ఫలి తంగా ఆవిర్భవించిన విరాట్శూరుడనే దానవుని ఇంద్రుని నాశనం చేయమని ఆదేశించాడు. ఇంద్రు డు ఆ దానవునితో మైత్రి చేసుకుని మోసంతో అతడి ని కూడా సంహరించాడు.
ఇందువలన ఇంద్రునికి హత్యాపాతక దోషం చుట్టుకుంది. విముక్తికై బ్రహ్మదేవుని ప్రార్ధించాడు. బ్రహ్మదేవుని ఆదేశం ప్రకారం భూలోకంలో ఐదు ప్రాంతాల్లో దేవశిల్పిచే మాధవుని ఆలయాలు నిర్మించి పూజించాడు.
ఎట్టకేలకు మహావిష్ణువు అనుగ్రహంతో తన దోషాన్ని తొలగించుకొన్నాడు. ఆనాడు ఇంద్రుడు నిర్మించిన నగరం ఈనాడు దేవనాథపురం అని పిలువబడుతున్నది.
ఈ పంచ మాధవుని ఆలయాలకు ఎవరు యాత్రకి వెడతారో వారి సకల పాపాలు, దోషాలు తొలగిపోయేలా అనుగ్రహంచమని ఇంద్రుడు శ్రీ హరిని ప్రార్ధించాడు. మహావిష్ణువు అంగీకరించాడు.