పూర్వజన్మల ప్రారబ్దం చేత వ్యాధులు సోకి పీడింపబడతామని మన విశ్వాసం. ఆ వ్యాధిని నిర్మూలించటం కోసం ఔషధ సేవనం, దానం, జపం, హోమం, దేవతా పూజలను చేయాలని ఈ శ్లోకం యొక్క అర్థం.భూతాపం పెరగడం, జనాభా పెరగడం, అడవుల నిర్మూలన, పరిసరాల కాలుష్యం మొదలైన కారణాల వలన ఇటీవలి కాలంలో ”ఆధి” (మానసిక అనారోగ్యం), వ్యాధులు (శారీరక అనారోగ్యాలు) ప్రబలుతున్నాయి. చికిత్సకు లొంగని మొండి వ్యాధులు ప్రజలను కబళిస్తున్నాయి. మందులకు, మంత్రాలకు లొంగని భయంకరమైన, ప్రారబ్దం వలన ప్రాప్తించిన, రోగాలను కేవలం తనను ధ్యానించిన మాత్రం చేత నయంచేసి, ఉపశమనం కలిగించే దేవతగా శీతలా దేవిని పురాణాలు కీర్తించాయి.
”పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే
తచ్ఛాంతి రౌషధై ర్దానై: జపహూమ సురార్చనై:”
శీతలాదేవిని సాక్షాత్ శివుడే జ్ఞానప్రదాయినిగా; ధైర్య, ఆరోగ్య, అభయ ప్రదా యినిగా కీర్తించినట్లు స్కాంద పురాణం చెబుతోంది. శీతలాదేవిని స్మరిస్తే చాలు రోగాలు నశించి పోతాయనీ; ఘోర ప్రమాదాలు, విపత్తులు తప్పిపోతా యని, మానవుల తీవ్ర కర్మలను భస్మం చేయటంలో శీతలాదేవికి సాటి లేదని రుద్రుడు స్తుతించాడు.
ఒక చేతిలో చేట, వేరొక చేతిలో చీపురు, ఇంకొక చేతిలో అమృత కలశము, మరొక చేతిలో అభయ ముద్రలను కలిగిన చతుర్బాహు సమాయుక్త శ్రీ శీతలాదే వి. ఆమెకు వాహనం గార్దభం (గాడిద). ఈమెను కాత్యాయినీదేవి అవతారంగా భావిస్తారు. ఉత్తర భారతదేశంలో శీతలాదేవి అని, దక్షిణ భారతదేశంలో ఆ పేరుతో పాటు సుంకులమ్మ, పోలేరమ్మ వంటి గ్రామ దేవతల పేర్లతో కూడా ఆమె పూజి ంపబడుతోంది. చల్లని దయ గల తల్లి కనుక ఆమెను శీతలాదేవిగా వ్యవహరిస్తారు.
జీవులలోని దుర్గుణాలను చెరిపివేయడానికి చేటను, మన దుష్కర్మలను, వ్యాధులను ఊడ్చివేయడానికి చీపురును ఆమె ధరించింది. చీపురుతో మన దుష్కర్మలను, వ్యాధులను ఒకచోటకు ఊడ్చివేసి, చేటతో వాటిని ఎత్తి పారేస్తుం దన్న సందేశాన్ని వాటిద్వారా ఆమె మనకు అందిస్తోంది. దుష్కర్మలు, దుర్గుణా లు నశించిన తర్వాత తన చేతిలోని అమృత కలశంతో జ్ఞానామృతాన్ని మనకు అందించి అభయాన్ని ప్రసాదిస్తుంది ఆ చల్లని తల్లి. తనను నమ్మినవారు ఏ ‘ఆధి’ వ్యాధులకూ భయపడనక్కరలేదనీ, అండగా తాను ఎల్లప్పుడూ ఉంటా ననీ, తన అభయ ముద్రతో సూచిస్తుంది. శివుని స్వేదం నుండి ప్రభవించిన జ్వరాసురుని నిర్మూలనకై లక్ష్మి, సరస్వతి, పార్వతుల అంశలతో బ్రహ్మదేవుడు లోకక్షేమం కోసం ఆమెను సృష్టించినట్లు స్కాందపురాణం చెబుతున్నది. ప్రపంచాన్ని చల్లగా, పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడం కోసం అవతరించిన చల్లని తల్లి శీతలాదేవి.
ఆంధ్ర—కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో, తుంకూరు జిల్లాలో ‘పావుగడ’ అనే క్షేత్రంలో శీతలాదేవి కొలువై ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హం దూపురానికి 45 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది. ప్రకృతి సౌందర్యానికి పట్టు గొమ్మ అయిన ఆ చిన్న గ్రామంలో శీతలాదేవి యంత్రం ప్రతిష్ఠించబడి ఉంది. దీనికి నేపథ్యమైన స్థల పురాణం ప్రకారం దాదాపు నాలుగు శతాబ్దాల క్రిందట ఈ ప్రాంతంలో భయంకరమైన కరవు కాటకాలు తాండవించాయట. ఆహా రం, నీళ్ళు లేక జంతువులు, పక్షులు, ప్రజలు ఆకలి దప్పులతో అలమటించి పోయారు. పచ్చని పంటచేలు అన్నీ బీడు భూములుగా మారాయి. ఆధివ్యాధు లు ప్రబలి ప్రజలు అకాల మరణాల పాలైయ్యారు. దిక్కుతోచని ఆ ప్రాంతీయు లు సమీపంలోని అడవిలో తపోనిష్ఠలో ఉన్న మునులను ఆశ్రయించి, శరణు పొంది, తమ కష్టాలను తీర్చమని మొరపెట్టుకొన్నారట. వారిపట్ల దయ తో ఆ మహర్షులు ఒక నల్లరాతిపై శీతలాదేవి మహా బీజాక్షర మంత్రాన్ని లిఖిం చి, దానిపై అమ్మవారిని ఆవాహన చేసి, ప్రాణ ప్రతిష్ఠ చేశారట. ఆమె కృపతో అక్కడ వర్షాలు పడి నేల సస్యశ్యామలమై, జీవరాశులన్నీ కళకళలాడాయట. ఆ యం త్రం చుట్టూ గుడిని నిర్మించి, ఆ పై భాగంలో శ్రీ శనీశ్వర స్వామిని కూడా ప్రతి ష్ఠించారట. భక్తిశ్రద్ధలతో కొలిచేవారి కోరికలను తీర్చే కొంగు బంగారంగా శీత లాదేవి అక్కడ అలా అవతరించింది. ఆమెకు పసుపు కుంకుమలు, గాజులు, చీర, రవికెలను సమర్పించి, పూజించిన భక్తులను, వారి పశువులను ఏ రోగాల బారిన పడకుండా ఆ తల్లి కాపాడుతుందని భక్తుల విశ్వాసం. అనారోగ్యాల నివా రణకు శీతలాదేవికి పాలాభిషేకం చేస్తారు. అవివాహతులకు ఆ తల్లిని పూజిం చాక వివాహాలైన సందర్భాలు ఉన్నాయి. అక్కడ శీతలాదేవి స్తోత్రం, శీతలాష్ట కం, శీతలాంబ సుప్రభాతం పారాయణ చేసినా సకల శుభాలు చేకూరు తాయని ప్రజల నమ్మకం.
”జ్యేష్ఠమాసే ద్విజశ్రేష్ఠ! కృష్ణాష్ట మ్యాం త్రిలోచనం
య: పూజయతి దేవేశం ఈశ లోకం వ్రజేన్నర:!”
జ్యేష్ఠ మాసంలోని బహుళ అష్టమినాడు త్రిలోచన పూజ చేసిన వారికి శివ సాయుజ్యం తప్పక లభిస్తుందనీ, అష్టమితో నవమి కలిసినచో ఆనాడు త్రిలోచ నునితోబాటు (ఈశ్వరు డు) జగన్మాత అయిన కాత్యాయనిని శీతలాదేవిగా అర్చించాలని, అందువల్ల ఆధివ్యాధులు దరిచేరవనీ స్కాంద పురాణం చెప్పిం ది. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి గోమయంతో ఇంటినీ, పరిసరాలనూ శుద్ధి చేసి, శీతలాదేవిని, త్రిలోచనునీ ధ్యానావాహనాది పూజలతో అర్చించాలి. శక్తి కలవారు చండీహోమం చేయడము మరింత ఉత్తమం. పాయసాన్నం, పులి హోర, పెరుగన్నాలను నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. దాన భోజనాదు లతో అతిథి, అభ్యాగతులను సత్కరించాలి. అలాచేసి పార్వతీదేవి, పరమేశ్వరు ల కృపకు పాత్రులు కావాలి. ఈనెల (జూన్) 11వ తేదీ, ఆది వారం నాడు (అంటే ఈ రోజే) ”శీతలాష్టమి”. అమ్మవారి అనుగ్ర#హం కోరి, ఆమెను ఆరాధించి తరిద్దాం.