ఈ జగత్తులో ప్రతి జీవకోటిలోను తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏదీ లేదు. తల్లి ప్రేమ అసామా న్యము. నిర్వ్యాజము. సద్గురు సాయినాథుడు కూడా తన భక్తుల పట్ల ఎంతో శ్రద్ధగా ప్రేమగా ఉం టూ మాతృప్రేమను కురిపించేవారు. అమృతపు గుళికల్లాంటి మాటలను ఎల్లప్పుడూ మసీదులో కూర్చుని తన భక్తులకు అందించేవారు. అందుకు నిదర్శనాలు సాయి సచ్చరిత్రలో అనేకం వున్నా యి. ఉదాహరణకు అన్నాసాహెబ్‌పై సాయిబాబా కురిపించిన మాతృ ప్రేమను మనమూ ఒకసారి స్మరించుకుని తన్మయులవుదాం.
1916 సంవత్సరంలో అన్నాసాహెబ్ ప్రభు త్వ ఉద్యోగం నుండి విరమణ పొందాడు. ఆ సమయంలో అతనికి చాలా తక్కువ పింఛను వచ్చేది. ఆ డబ్బు అతని కుటుంబ పోషణకు కూ డా సరిపోయేదికాదు. అటువంటి పరిస్థితుల్లో అన్నాసాహెబ్ గురుపౌర్ణమి రోజు అన్నాసాహెబ్ కూడా ఇతరు సాయి భక్తులతో కలిసి షిరిడీకి వెళ తాడు. అప్పుడు సాయి ప్రియభక్తుడు అయిన అణ్ణాచించణీకర్ సాయిబాబాతో అన్నాసాహెబ్ గురించి ఇలా చెబుతాడు. ”సాయీ! దయచేసి ఈ అన్నాసాహెబ్‌యందు కరుణ చూపించండి. వానికి వచ్చే పింఛను వారి కుటుంబ అవసరాల కు సరిపోవడంలేదు. వాని కుటుంబం పెరుగుచు న్నది. వానికి వేరే ఉద్యోగం ఏమైనా ఇప్పించండి. వాని ఆతృతను, భయాన్ని తొలగించి ప్రశాంత జీవనాన్ని ప్రసాదించండి.” అంటాడు.
అప్పుడు సాయిబాబా ”అతనికి వేరే ఉద్యో గం దొరుకుతుంది. కాని అతను ఇప్పుడు నా సేవ చేసి తృప్తిపడాలి. వాని భోజన పాత్రలు ఎప్పుడూ నిండుగానే ఉంటాయి. అవి ఎన్నటికిని నిండుకో వు. కాని వాని దృష్టినంతటిని ఎల్లప్పుడూ నావై పు త్రిప్పవలెను. నాస్తికుల, దుర్మార్గుల సహవా సాన్ని అతడు విడిచిపెట్టాలి. అందరిపట్ల అణకు వ, ప్రేమ, నమ్రతతలతో వుండాలి. నన్ను హృద య పూర్వకముగా పూజించాలి. అతడు ఇట్లు చేస్తే శాశ్వతానందము పొందుతాడు.” అని చెప్పారు.
బాబా పలికిన అమూల్యమైన ఆ మాటలు అన్నాసాహెబ్ మనసులో నిలిచాయి. అతను వెం టనే ఇక యే నౌకరీ కొరకు ప్రయత్నించకూడద ని, గురుసేవలోనే నిమగ్నమవ్వాలని నిశ్చయిం చుకుంటాడు. కాని అణ్ణాచించణీకర్ అడిగిన దానికి బాబా చెప్పిన సమాధానము అన్నాసాహె బ్ మనసులో మెదులుతూనే వుండేది. మధ్యమ ధ్యలో అది జరుగుతుందా లేదా అని సందేహప డుతూనే వుండేవాడు. అయితే బాబా పలికిన పలుకులు భవిష్యత్తులో నిజమయ్యాయి. అన్నా సాహెబ్‌కు మరొక సర్కారు ఉద్యోగం దొరుకు తుంది. కొన్ని రోజులు ఆ ఉద్యోగం చేసిన అన్నా సాహెబ్ ఆ తరువాత ఏ సమస్య లేకుండా బాబా సేవలోనే తన జీవితాన్ని అంతా గడిపాడు.
బాబా పలుకులు అమృతతుల్యం
దయాదాక్షిణ్యమూర్తి అయిన సాయిబాబా మసీదులో ఎక్కువసార్లు ఈ విధమైన మధుర వాక్యాలను తన భక్తులకు చెప్పేవారు.
”ప్రతి ఒక్కరు బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహమందు అభిమానములాంటివి వదిలిపెట్టాలి. అప్పుడే భక్తి రహస్యము తెలు స్తుంది. అసలైన మార్గాన్ని వదిలి ఇతర మార్గాల ను అవలంబించి అనవసరంగా అలసిపోవద్దు.”
”నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రాలకు ఎప్పు డూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి, భక్తిశ్రద్ధలతో మన:పూర్వకంగా నన్నే యారాధిం చవారి యోగక్షేమాలు నేను జూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకే మైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తిప్రతిష్టలకై ప్రాకులాడుట మాని, దైవము దర్బారులో మన్ననలను పొం దుటకు, భగవంతుని కరుణాకటాక్షములు సం పాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవ మందుకొను భ్రమను విడువుము. మనస్సునం దు ఇష్టదైవము యాకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని యారాధనకొరకే నియమింపుము. మనసును ధనసంపార్జనము, దేహపోషణ, గృహ సంరక్షణ ములాంటి విషయాల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి, శాంతముగను చింతారహితమగును. మనస్సు సరైన సాంగత్యంలో నున్నదనుటకు గుర్తు.
ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడు నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమియు చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే యెల్లప్పుడు జపించు చుండు. ఎవరైతే నాకర్పించనిదే తినరో అట్టి వారి పై నేను ఆధార పడి యుందును.”