Thursday, September 19, 2024

సాయినాథుని సర్వజ్ఞత్వం!

ఒక రోజు ఒక భక్తుడు శిరిడీలోని మశీదులో సాయిబాబా పా దాల చెంత కూర్చొని వున్నాడు. అంతలో ఒక బల్లి మశీదు గోడపైకి ఎగబ్రాకి టిక్కుటిక్కుమని అరిచింది. అంతట ఆ భక్తుడు ”ఆ బల్లి అరిచిన దానికి అర్ధం ఏమిటి సాయి, అది శుభమా లేక అశుభమా?” అని సాయిని అడిగాడు. సాయి చిరునవ్వుతో ”ఆ బల్లిని చూడడానికి ఔరంగాబాదు నుండి తన చెల్లెలు వస్తోంది. అందుకనే ఆ బల్లి చాలా ఆనందంగా అరుస్తోంది” అన్నారు. సాయిబాబా తనతో పరిహాసమాడు తున్నారని తలిచి ఆ భక్తుడు ఏమీ మాట్లాడకుండా నోరు మూ సుకొని కూర్చున్నాడు.
కొద్దిసేపటి తర్వాత ఔరంగాబాదు నుండి ఒక భక్తుడు సాయి దర్శనానికి మశీదుకు వచ్చాడు. అతను స్వారీ చేసిన గుర్రానికి ఆకలి వలన అలసటతో కూలబడిపోయింది. దానికి ఉలవలు తీసుకురావడానికి తన దగ్గర వున్న సంచీని తీసి అం దులో వున్న దుమ్ము, ధూళిని పోగొట్టడానికి సంచీని విదిలిం చాడు. ఆశ్చర్యకరంగా అందులో నుండి ఒక బల్లి క్రింద పడిం ది. చకాచకా ప్రాకుకుంటూ ఆ బల్లి మశీదు గోడను ఎక్కి ఇంత కు ముందు వున్న బల్లిని చేరుకుంది. రెండు బల్లులు ఆనందం తో కలుసుకొని, కౌగలించుకొని ముద్దాడుకున్నాయి. ఎంతో ప్రేమతో కలిసి ఆడుకోసాగాయి. బల్లి గురించి ప్రశ్నించిన ఆ భక్తుడికి ఇక నోట మాట రాలేదు. ఎక్కడ శిరిడీ? ఎక్కడ ఔరం గాబాదు? జరగబోయే సంఘటనను అద్దంలో చూపించిన సాయి సర్వజ్ఞత్వానికి జోహార్లు! సాయిబాబా సాధారణ యోగి, సాధు సత్పురుషుడు కాదు. పరిశుద్ధ, పరమేశ్వర, పరబ్రహ్మ అవతారం. త్రిమూర్తి స్వరూపులు. భూత, భవిష్య త్‌, వర్తమాన కాలాలలో జరగబోయే సంఘటనలన్నీ ఆయ నకు తేటతెల్లం అని అప్పుడు అందరికీ అర్ధమయ్యింది.
సర్వజ్ఞత్వము, సర్వైశ్వర్యత్వము, సర్వ భోక్తృత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వ పరిపాలకత్వము, సర్వ సంహా రకత్వము, కలవారే భగవంతుడు అని శాస్త్రం కూడా స్పష్టం గా నిర్వచించింది. ఈ సుగుణాలన్నింటినీ సాయినాథునిలో సంపూర్ణంగా వున్నాయి.మరొకసారి సాయి భక్తాగ్రేసరుడైన నానా చందోర్కర్‌ మరొక భక్తునితో కలిసి శిరిడీ నుండి బయలుదేరడానికి సాయి ని శెలవు అడిగాడు. సాయి వారిరువురినీ దీవించి ”భోజనం చేసి తాపీగా బయలుదేరండి.” అని అన్నారు. సాయి ఆజ్ఞను శిరసా వ#హంచి నానాచందోర్కర్‌ వాడాకు వెళ్ళి సుష్టుగా భోజనం చేసి బయలుదేరాడు. కాని నానా స్నే#హతుడు మా త్రం రైలుకు వేళ అయిపోతోందంటూ ఒకటే హడా విడి చేసి భోజనం చెయ్యలేదు. మాటిమాటికీ చేతికి వాచీలో సమ యం చూసుకుంటూ బయలు దేరమంటూ నానాను ఒకటే తొందర పెట్టసాగాడు, భోజనం కూడా చెయ్యలేదు. కోపర్‌ గావ్‌ స్టేషనుకు వచ్చాక ఆ రోజు రైలు ఆలస్యంగా వస్తోందని తెలిసింది. రైలు ప్రయాణంలో కూడా సరైన తిను బండారాలు దొరకలేదు. సాయి మాటలను వేద వాక్కుగా భావించిన నానా రైల్లో హాయిగా నిదురపోగా, శ్రీ సాయి మా టలను పట్టించుకోకుండా తన స్వంత బుద్ధితో ఆలోచించి తదనుగుణంగా ప్రవర్తించిన ఆ భక్తుడు బొంబాయి చేరే వర కూ ఆకలితో మాడిపోయాడు. తనను నమ్ముకుంటే జీవితం లో ఇక ఏ సమస్యలు రావని, ఏ చీకూ చింతా లేకుండా ఉండొ చ్చని ఈ లీల ద్వారా తెలియజేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement