శ్రీ సాయినాథుని అవతారం మహోత్కృష్టమైనది, ఆయన మార్గ దర్శకత్వం విభిన్నమైనది. భక్త సులభుడు, భక్తుల పాలిటి ఆశ్రిత కల్పవృక్షం, కామధేనువు అయిన శ్రీ సాయి వంటి అవతారం ఇంతవరకు రాలేదు. నభూతో నభ విష్యతి అన్నట్లుగా ఇక మీదట రావడం అత్యంత దుర్లభం. ఇతర కలియుగ గురువులవలె యోగ సాధనలు చేయించ డం, మంత్రోపదేశం చేయడం, గ్రంథ రచనలు, జీవాత్మ, పరమాత్మల గురించి, ఆత్మ సాక్షాత్కారం గూర్చి ప్రవచనా లు చేయడం ఏనాడూ చేయలేదు. సకల వేద సారాన్ని, ఉప నిషత్తుల సారాంశాన్ని చిన్నచిన్న లీలల ద్వారా కథల ద్వా రా భక్త జనావళికి సుళువుగా అర్ధమయ్యేటట్లు బోధించిన అసామాన్య సద్గురుమూర్తి శ్రీ సాయినాథులు.
కుశాభావు అనే టీచర్ ఒక సాధువును ఆశ్రయించి శుశ్రూషలు చేసాడు. అందుకు సంతోషించిన ఆ సాధువు కుశాభావుకు ఒక మంత్రం నేర్పాడు. ఆ మంత్ర ప్రభావం వలన పండ్లు, మిఠాయిలు వంటి పదార్ధాలను అతను సృష్టించగలిగేవాడు. ఆ సంగతి తెలుసుకున్న ప్రజలు కుశా భావు చుట్టూ చేరి విసిగించసాగారు. అంతేకాక అతనొక మంత్రగాడని విమర్శిస్తూ, తమ సమాజం నుండి వెలి వేసా రు. ఇందుకు ఖిన్నుడైన కుశాభావు తిరిగి ఆ సాధువును ఆశ్ర యిస్తే ”నువ్వు తక్షణం శిరిడీ వెళ్ళి సాయిబాబాను శరణు పొందు, నీకు మేలు కలుగుతుంది” అని సలహా ఇచ్చాడు. ఆ ప్రకారమే 1909వ సంవత్సరంలో కుశాభావు శిరిడీ చేరాడు కాని శ్రీ సాయి అతనిని మశీదులోనికి రానివ్వలేదు. ”ఇటు వంటి శక్తులు గలవారు వేశ్యలతో సమానం. వారికిక్కడ ప్రవేశం లేదు. గోదావరి నదిలో స్నానం చేసి, ఆ శక్తులను అక్కడే విడిచిరా!” అని శ్రీ సాయి ఖచ్చితంగా చెప్పేసారు. కుశాభావు ఆ ప్రకారమే చేసాక, శ్రీ సాయి అతని చేత దాస బోధ అనే ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదివించారు. ఆ తర్వాత శ్రీ గురు చరిత్ర అనే గ్రంథాన్ని 108 సార్లు పారాయణ చేయించారు. ఒకరోజు ఏకాదశి పర్వ దినాన కుశాభావు ఉపవాసం చేస్తున్నాడు. ప్రసంగవశాత్తూ బాబాతో పూర్వం ఋషులు కందమూలాలు తిని బ్రతికేవారని అన్నాడు. వెం టనే శ్రీ సాయి తన వద్ద వున్న కొన్ని ఉల్లిగడ్డలను ఇచ్చి తిన మన్నారు. కుశాభావుకు ఏంచెయ్యాలో తోచలేదు. చివరకు శ్రీ సాయి తింటే తానూ తింటానన్నాడు. వెంటనే శ్రీ సాయి కొన్ని ఉల్లిగడ్దలను తిని, చుట్టూ వున్న భక్తులతో ”ఈ బ్రా #హ్మణుడిని చూడండి! ఏకాదశి పూట ఉల్లిపాయలను తింటున్నాడు” అని గేలి చేసారు. కుశాభావు వారితో ”శ్రీ సాయి ఆదేశిస్తేనే నేను తిన్నాను అంతే తప్ప నేను ఆచారం తప్పలేదు” అని అన్నాడు. శ్రీ సాయి అందుకు అంగీకరించ క తాను తిన్నది కక్కి చూపారు. ఆశ్చర్యం! అందులో కంద మూలాల ముక్కలు వున్నాయి గాని ఉల్లిగడ్దలు మచ్చుకైనా లేవు. కుశాభావు వెంటనే సాయి కక్కిన దానిని మహాప్రసా దంగా భావించి గబగబా తినేసాడు. శ్రీ సాయి అతనిని తిట్టి, తన సటకాతో కొట్టి వారించారు కానీ కూశా భావు వినలేదు. గురూచ్చిష్టం (గురువు ఎంగిలి) అత్యంత పవిత్రమైనదని సకల వేదాలు ఘోషిస్తున్నాయి. ఇటువంటి అవకాశం మరి కరాదని కుశాభావుకు తెలుసు. ఆతని భక్తిశ్రద్ధలకు బాబాకు ఆనంద బాష్పాలు కారాయి. వెంటనే అతనిని కౌగలించు కొని ఆశీర్వదించారు. అంతేకాక- ఎప్పుడూ నువ్వు నన్ను స్మరించినా ఈ ద్వారకామయిలోని ఊదీ నీ చేతిలోనికి వస్తుంది. కష్టాల కడలిలో వున్న వారికి, రోగగ్రస్తులకు, ఊదీని ప్రసాదంగా ఇచ్చి వారికి ఉపశమనం కలుగజేయు ము” అన్న ఒక గొప్ప వరం ఇచ్చారు. నాటి నుండి కుశాభా వు జీవితంలో నూతనధ్యాయం మొదలయ్యింది.
గురువు అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలిగిన అతను శ్రీ సాయి భక్తులలో అతి శ్రేష్టుడయ్యాడు. ఆధ్యాత్మి కంగా ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగాడు. దేశమంతటా పర్యటిస్తూ, సాయి దివ్య లీలా వైభవఉపన్యాసాలను ఇస్తూ, దీన జనులకు, అభాగ్యులకు సాయి ఊదీని ఇస్తూ వారివారి కష్టాలను దూరం చేస్తూ సాయి లో ఐక్యమయ్యాడు.
కుశాభావుకు సాయినాథుని వరప్రసాదం!
Advertisement
తాజా వార్తలు
Advertisement