Sunday, November 24, 2024

మత మార్పిడిని నిరసించిన సాయిబాబా!

శ్రేయాన్‌ స్వధర్మో విగుణ: పరధర్మాత్‌ స్వనుష్ఠి తాత్‌ ?
స్వధర్మే నిధనం శ్రేయ: పరధర్మో భయావ#హ:
(భగవద్గీత 3–35లోని శ్లోకం)
చక్కగా ఆచరించబడిన పరధర్మం కన్నా, గుణర హతమైనప్పటికీ స్వధర్మమే అత్యుత్తమమైనది; స్వధ ర్మాచరణంలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయ స్కరమే; కానీ, పరధర్మం మాత్రం భయంకరమైనది అన్నది పై శ్లోకం భావం. తాను జన్మించిన మతం నుండి కారణాలు ఏమైనా పర మతంలోకి మారడం కూడా ముమ్మాటికీ తప్పేనని పై శ్లోకం భావార్ధం.
మన స#హజ స్వభావం ద్వారా జనించిన విధులను మానసిక స్థైర్యముతో చాలా సునాయాసంగా చేయవ చ్చు. ఇతరుల విధులు దూరం నుండి చూడటానికి ఆ కర్షణీయంగా ఉండవచ్చు, కానీ అది ప్రమాదభరితమై నది. అది మన స్వభావంతో పొసగకపోతే, అది మన ఇం ద్రియ మనోబుద్దులలో ఘర్షణకి దారితీస్తుంది. మరి మనకు నిర్దేశించబడనిది అయినదే పరధర్మం. మన స్వధర్మానికి విరుద్ధంగా నడుచుకోవడం ఇతరుల స్వధ ర్మాన్ని ఆచరించడం పరధర్మపాలన అవుతుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం సబబు కాదు. ఎవరికి వారికి వారివారి స్వధర్మమే శ్రేయస్కరమైనది. పరధ ర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే అవుతుంది. ఇదే అంశాన్ని శ్రీ సాయి ఒక లీల ద్వారా అద్భుతంగా తెలియజేసారు.
ఒకసారి శిరిడీలో ఒక ముస్లిం భక్తుడు తనకు సం తానం కలిగితే శిరిడీకి వచ్చి మిఠాయిని పంచుతానని మొక్కుకున్నాడు. బాబా అనుగ్రహం వలన అతని కోరిక ఫలించింది. పండంటి మగ సంతానం కలిగింది. కోరిక నెరవేరిన నేపథ్యంలో శిరిడీ వచ్చి మిఠాయి పంచడానికి సాయినాథుల అనుమతి కోరాడు ఆ ముస్లిం.
బాబా చిరునవ్వు నవ్వి ‘వెళ్ళి మారుతీ ఆలయం లో మిఠాయిని పంచు” అని అన్నారు. ఆ ముస్లిం బాబా మాటలకు ఆశ్చర్యపడి ”నేను ముస్లింను కదా! #హందు వుల ఆలయంలో మిఠాయిని ఎలా పంచగలను?” అని అడిగాడు. అందుకు బాబా నవ్వి ”ఇటీవల జరిగిన యు ద్ధంలో ఆంజనేయుడు అల్లాను ఓడించాడు” అని మరింత కోపంతో ”ఏమి ముస్లిం విరా నువ్వు? ఇదేనా ఖురానును చదివి నువ్వు అర్ధం చేసుకున్నది? వెళ్ళి మారుతీ ఆలయంలో మిఠాయిని పంచు” అని ఆజ్ఞాపిం చారు. ఇక చేసేది లేక ఆ ముస్లిం భక్తుడు మారుతి ఆల యంలో మిఠాయిని పంచి తన మొక్కును తీర్చుకున్నా డు. నామ, రూప, గుణ ర#హతుడు, సర్వగతుడు, విశ్వ వ్యాప్తుడైన భగవంతునిపై భక్తికి మత భేదం అడ్డు కారా దని ఈ లీల ద్వారా సాయి మనకు కళ్ళకు కట్టినట్లుగా తెలియజేసారు.
మత మార్పిడిని సాయి తీవ్రంగా నిరసించేవారు. విశ్వానికి సృష్టి, స్థితి, లయ కారకుడైన భగవంతుడు ఒక్కడే! సందర్భానుసారంగా వివిధ కాలాలలో వివిధ రూపాలను ధరించి తన అవతార కార్యం గావించేవా డు. అన్ని మతాలు ఆ భగవంతుడిని చేరడానికే పుట్టా యి. సర్వ మానవ సమానత్వాన్ని ఉద్భోదించే సాయి భక్తులకు మతం మార్చుకోవడం అనవసరం అని చెప్పే వారు. సాయికి కూర్మి భక్తుడైన బడేబాబా ఒక #హందు వును ముస్లింగా మార్చి సాయి దర్శనానికి తీసుకువచ్చి తాను చేసిన ఘనకార్యాన్ని వివరించాడు. అప్పుడు సాయి ఉగ్రులై ఆ యువకుని చెంప పగిలేలా కొట్టి ”నీ తండ్రిని మార్చుకున్నావట్రా! ” అని అరిచారు. తన మ తాన్ని మార్చుకోవడం తండ్రిని మార్చుకున్నంత పాప మని బాబా అభిప్రాయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement