Saturday, November 23, 2024

సాయి సర్వజ్ఞత..

సమర్థ సద్గురువు సాయిబాబా. వారు అనంతులు. చీమలు, పురుగులు, జంతువులు… ఇలా సకల జీవులందు వారు నివసిస్తారు. సాయి సర్వాంతర్యామి. వేదజ్ఞానము, ఆత్మసాక్షాత్కార విద్యలలో పారంగతులు. అందుకే సాయి సద్గురువు అయ్యారు. ఎంతటి పండితులు అయినా కూడా శిష్యులకు విద్యను, జ్ఞానాన్ని బోధిస్తారు. కాని శిష్యులను ప్రేరేపించి, వారికి ఆత్మసాక్షాత్కారం కలిగించకపోతే వారు సద్గురు వులు కారు. సాయిబాబా అలాంటి గురువులు కారు. తమ భక్తులకు జ్ఞానంతోపాటు ఆత్మసాక్షాత్కారాన్ని కూడా కలిగిస్తారు. వారు చావుపుట్టుకలను రెంటిని దాటించగలరు. అత్యంత దయార్ద్ర హృదయులు.
సాయిబాబా ఎప్పుడూ ”నా మనుషులనేవారు ఎంత దూరంలో వున్నా పిచ్చుక కాళ్ళకు దారం కట్టి ఈడ్చి నట్టుగా అతనిని షిరిడీకి లాగుతాను” అంటూ వుండేవారు. అలాగే సాయి బాబాను ఆశ్రయించాలనుకునేవారు, దర్శనం చేసుకోవాలని మనసారా ఆశిం చిన వారికి షిరిడీ ప్రవేశం లభించేది. వారి మనోభీష్టాన్ని తెలుసుకుని బాబా వాటిని నెరవేర్చేవారు.
ఒకసారి లక్ష్మీచందు అనే భక్తుడు సాయిని దర్శించుకోవాలనే కోరికతో డబ్బు అప్పు చేసుకొని షిరిడీకి వచ్చాడు. ఆ విషయం బాబాకు తెలిసిపోతుంది. ”నీ స్వప్నము నిజమయినదా కాదా అని ఆలోచించు. మార్వాడి వద్ద 15 రూపా యలు అప్పు తీసుకొని దర్శనం చేయ వలసిన అవసరం ఏమిటి? హృదయం లో కోరిక ఇప్పుడయినా నెరవేరినదా?” అంటారు బాబా. ఈ మాటలు విని బాబా కు ఈ సంగతులన్నీ ఎలా తెలిశాయా?” అని ఆయన సర్వజ్ఞత లక్ష్మీచందు ఆశ్చర్య పడతాడు. మధ్యాహ్నం భోజన సమ యంలో అతనికి సాంజా ప్రసాదంగా లభించింది. రుచిగా వున్న సాంజా లక్ష్మీ చందుకు బాగా నచ్చింది. ఎంతో సంతో షం గా తిన్నాడు. ఆ మరుసటిరోజు కూడా లక్ష్మీచందు సాంజా తినాలని అనుకుంటా డు. కానీ ఏ భక్తుడు సాంజాను తీసుకు రాలేదు. ఎవరైనా సాంజా తీసుకువస్తా రేమో అని లక్ష్మీచందు ఎదురుచూస్తూ కూర్చున్నాడు. కానీ దొరకలేదు. మూడవ రోజు కూడా లక్ష్మీచందు బాబా దర్శనానికి వెళ్ళాడు. అక్కడ బాపుసాహెబ్‌ జోగ్‌ అనే మరో భక్తుడు హారతి సమయంలో ఏ ప్రసాదం తీసుకు రావాలని బాబాను అడుగుతాడు. అప్పుడు సాంజా తీసుకురమ్మని బాబా చెబుతారు. వెంటనే బాపుసాహెబ్‌ జోగ్‌ వెళ్ళి రెండు కుండల నిండా సాంజా తీసుకువచ్చాడు. లక్ష్మీచందుకు అప్పటికి చాలా ఆకలిగా వుంది. అతనికి వీపు నొప్పిగా ఉంటుంది. లక్ష్మీచందును చూసి బాబా ‘నీవు ఆకలితో వుండటం చాలా మంచిదయింది. సాంజా వచ్చింది నీకు కావలసినంత తిను. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకో” అంటారు. తన మనసు తెలుసుకొని తన కోరిక తీర్చిన బాబా సర్వజ్ఞతకు లక్ష్మీచందు రెండవసారి సంభ్రమాశ్చర్యాలకు గురవుతాడు.
ఆ సమయంలోనే లక్ష్మీచందు సాయిబాబా చావడి ఉత్సవాన్ని కూడా చూశాడు. అప్పుడు బాబాకు చాలా దగ్గు వస్తుంది. అది చూసి బాబాపై ఎవరిదో దోషదృష్టి పడివుంటుందని, అందుకే బాబా బాధపడుతున్నారని అనుకుంటాడు. మరుసటిరోజు లక్ష్మీచందు మసీదుకు వెళ్ళతాడు. అక్కడే వున్న శ్యామాతో బాబా ”ఎవరిదో దోష దృష్టి నాపై పడుటచే నేను బాధపడుతున్నాను” అంటారు. లక్ష్మీచందు మనస్సులో ఏమి అనుకుంటాడో అది అంతా బాబా పైకి చెబుతున్నారు. అది విన్న లక్ష్మీచందు మిక్కిలి ఆశ్చర్యపోతాడు.
ఈ విధంగా సర్వజ్ఞతకు, కారుణ్యానికి కావలసినన్ని నిదర్శనాలు లక్ష్మీచందుకు లభించాయి. వెంటనే బాబా పాదాలపై పడి ”మీ దర్శనం వలన నేనెంతో సంతోషించాను. ఎల్లప్పుడూ నాయందు దయాదాక్షిణ్యాలు చూప మని” ప్రార్థిస్తాడు. బాబా ఆశీర్వాదం, ఊదీ ప్రసాదం తీసుకుని లక్ష్మీచందు తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి బాబా మహిమలను కీర్తిస్తూ బాబాకు నిజమైన భక్తుడుగా వుండిపోతాడు లక్ష్మీచందు.

Advertisement

తాజా వార్తలు

Advertisement